దృష్టి

కథ

లలితా చండి

సర్వాంగానాం నయనం ప్రధానం శరీరంలో అన్నిటికన్నా నయనానికి ప్రాధాన్యం వున్నది.
ఆకన్నలు చల్లని చూపులను మరోప్పుడు ఎర్రని చూపులను చూస్తాయి.
చేప చూపులతోట పిల్లలను పెంచుతుందట.మధుర మీనాక్షీ దేవి చల్లని చూపులెే చాలు లోకానికి, తల్లి రావటం చూసిన దివ్య చదువుతున్న పుస్తకం నించి తలెత్తి …
“అమ్మా ఇందాక కాలేజి నుంచి ఇంటికీ వస్తుంటే ఒక కోయవాడు గబుక్కున ఆగి నన్ను చూసి నీకు బాగా దిష్టి వుంది దాన్ని తీస్తాను కొంచం ఖర్చు అవుతుంది ఇస్తావా?
అన్నాడు ఇంతలో బస్ వస్తే ఎక్కేసాను” అంది దివ్య తల్లితో

” ఎంత ఇవ్వమన్నాడేంటి? ఇంతకీ దిష్టి తీయించుకున్నావా? అయినా ఇది ఒక జీవనోపాది
కొందరికి.” అంది తల్లి వసుధ.

“అలా అనిపించలేదమ్మా నేను బస్ఎక్కేటప్పటికి అతను మరెవరిని అడగలేదు ఆగకుండా వెళ్లటం కనిపించేవరకు చూశాను ”

“అలా అయితే నమ్మాల్సిందే
కొందరికి అతీంద్రియ శక్తులు వుంటాయి కాకపోతే వాళ్లు ఇలా ఎప్పుడో ఒక సారి తటస్థపడతారు ”
దిష్టి అంటే ఏమిటీ ?ఎందుకు తగులుతుంది ?
దిష్టి తీయడమంటే?..దివ్య అడిగింది

“దిష్టి, దృష్టి అన్నా ఒకటే అయితే ఎవరైనా అభివృద్ధి లోకి వస్తుంటే పక్కవాళ్ళో పగవాళ్ళో బాధపడడం వాళ్ళ యెక్క నెగిటివ్ చెడు దృష్టి మీద వుంటుంది. దానివల్ల ఏదో శారీకమైన బాధ, తలనొప్పి లాంటివి వస్తాయి”.

“చిన్నప్పుడు పసిపిల్లలకు స్నానం పోసాక సాంబ్రాణి వేసి దృష్టి చుక్క అరికాళ్లల్లో కణతలపైన పెట్టేవారు ఎవరి చెడు దృష్టి పడకూడదని”.
పిల్లలు చీదర చేసినా ఏడ్చినా దిష్టి తగిలిందని ఉప్పు తిప్పి నీళ్లలో వేసేవారు
అలా చేస్తే దృష్టి పోతుందని అనేవారు నమ్మేవారు.”
“అంతేనా… మా అమ్మ అలా చేసిన కాసేపటికి మాకు ఆ చీరాకు తగ్గేది కూడ”
“ఇది నిజమేనా? ట్రాష్ ఏమో ఇందాకటి కోయవాడులా” అంది దివ్య.

“లేదు దివ్యా..అడవులలో నివశించే కొందరికి కొన్ని శక్తులు వుంటాయి”
అంది వసుధ.
అంతేకాదు వెంటనే వంటగదిలోకి వెళ్లి గుప్పెడు ఉప్పు తీసుకుని గబగబా ఏదోఅంటూ.. దివ్య తలచుట్టూ తిప్పేసి బయట నీళ్లలో వేసి కాళ్ళు చేతులు కడుకొచ్చి,
“దివ్యా వెళ్లి నువ్వూ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని బొట్టు పెట్టుకో”అంది.

దివ్య తల్లి చెప్పిన పని వెంటనే చేసింది ఎందుకో అప్పటిదాకా వున్న చిరాకు తగ్గి హాయిగా అనిపించింది.

తల్లికి చెప్పలేదు నాలుగు రోజులుగా కాలేజిలో గొడవగా వుంది. కార్పరేట్ కాలేజీ ఉద్యోగం కాదుగాని చదువు కంటే మార్కులు అమ్ముతున్నారు
తన కూతురుకి తక్కవ మార్కలు వచ్చాయని ఓతండ్రి వచ్చి గోల చేస్తున్నాడు పైపెచ్చు పిల్ల చదవలేదు అన్న బాధలేదు సరికదా ఇంత ఫీజు పే చేసాను మార్కులు తక్కువ ఎందుకు వచ్చాయి అంటే ఎలా? తన సబ్జెక్టు గత కొంతకాలంగా పిల్ల చదువు మానేసి సెల్ లోె ఎవరితోనో చాటింగ్ ఎక్కువ అయింది ఎన్నిసార్లు హెచ్చరించిన మాట వినలేదు, ప్రిన్సిపాల్ కు తెలియపరచింది తల్లిదండ్రులకు కబురుచేస్తే ఈరోజు వచ్చిగోల చేసాడు.

దివ్య అమ్మాయి తండ్రితో
“మీ అమ్మాయికి సెల్ ఫోన్ ఇవ్వకండి రెండు నెలలపాటు
మార్కులు సరిగా రాకపోతే నన్ను అడగండి “అని గట్టిగా చెప్పి
ప్రిన్సిపాల్ పిలుస్తున్నా వినకుండా బయటకు నడిచింది.

తన కాలేజీ విషయాలు బయటనే కాని ఇంట్లోకి రానివ్వదు, అలాగే ఇంటి విషయాలు బయట చర్చించదు.
దివ్య పాఠాలు బాగ చెబుతుందని తనపని సిన్సియర్ గాచేస్తుందని కాలేజిలో మంచి పేరూ వుంది.

బోజనం చేసి పడుకుంటుంటే
కోయవాడి మాటలు అమ్మ వెంటనే దిష్టి తీయడం తలచుకుంటూ
‘దిష్టికి కాలేజి గొడవకు ఏమైనా సంబంధం వుందా!..ఏమో చూడాలి
అని తలుచుకుంటూ నిద్రలోకి జారుకుంది.
** ** ***
మర్నాడు కాలేజికి బయట
తనకోసమే అన్నట్లు నిన్నటి కోయవాడు ఎదురుచూస్తూవున్నాడు.

దివ్య చూడనట్లు వెడుతుంటే
ఆపి ఆమె చేతిలో ఒక చిన్న కాగితం పొట్లంపెట్టి అమ్మవారి బొట్టు రోజు పెట్టుకో మంచి జరగుతుంది అని చేతిలో పెట్టాడు
దివ్య తన పరుసు తెరచి రెండువందల నోటు తీసి ఇచ్చింది.
“చాలు బిడ్డ చాలు అంతా మంచిగ అవుతుంది” అని తలమీద చెయ్యుపెట్టి ఆశీస్సులు ఇచ్చిగబగబా
వెళ్లి పోయాడు.

తన క్లాసులోకి వెడుతుంటే బయటే నిలబడి తనకోసమే ఎదురుచూస్తూన్న నిన్నటి తండ్రి కూతురు ఇద్దరిని చూసి ఆగింది.
“మేడమ్ మీరు చెప్పినట్లు మా అమ్మాయికి ఫోన్ ఇవ్వటం లేదు,ఈసారి పరీక్షలలో మార్కులు తక్కువ వస్తే అప్పుడే మిమ్ములను గట్టిగా అడుగుతాను”అంటూ బెదిరిస్తున్నట్లు చెప్పి వెళ్ళి పోయాడు.

అతను వెళ్లిన వైపు చూస్తున్న
దివ్యకు కోయవాడి మాటలు
గుర్తుకు వచ్చాయి కొన్నిటికి రీజనింగ్ అందవుకనుక తాత్వికతకతో చూడలేమో?…
చిన్నప్పుడు అమ్మమ్మ బయటకు వెళ్లి వచ్చినప్పుడల్లా ఉప్పుతో దిష్టి తీసేది ,అమ్మ అలా కాకపోయిన పుట్టినరోజులకు పండుగలకు తీసేది. కాలంమారుతుంటే ప్రతి దానికి రిజనింగ్ అలోచించాల్సిన అవసరం వస్తోంది గుడ్డిగా నమ్మలేం దేనిని అని చదివిన చదువు ప్రశ్నిస్తుంటే? కొన్నిటికి జవాబులు దొరకపోయినా … అర్ధం చేసుకుని ఇలా సమాధానపడాల్సిందే. సహజంగా ఉప్పు గాలిలోని తేమను గ్రహిస్తిుంది.
ఇనుమును సైతం తినేయగలదు, తుప్పును వదల్చగలదు.
ప్రతి మనిషి చుట్టూ ఒక ఆరా వుంటుంది. నెగిటివ్ దృష్టి కలిగినప్పుడు అది ప్రశాంతకు భంగం కలిగిస్తుంది.
అలాంటి వాటికి విరుగుడుగా ఇలా ఉప్పుతో తిప్పితే తగ్గుతుందని పూర్వ కాలం వాళ్లు ఆచరించే వారు
కోవిడ్ మనకు ఎంతో గుణ పాఠం చెప్పింది. మరిచిపోయిన ఎన్నో పాత పద్దతులను అలవాట చేసింది. అందుకేనేమో కొన్నింటిని బలమైన రిజనింగ్ లు లేకపోయినా నమ్మాల్సి వస్తుందని అనుకుంటూ క‍లేజీలోకి నడిచింది దివ్య.

లలితాచండి

Written by Lalitha Chandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మాతృ దినోత్సవం ( అమ్మల పండగ )

ఎలక్షన్స్ వస్తున్నాయి