ఓటన్నది ఒక హక్కు

కవిత

ఓటన్నది బంగరు భవితకొక వరం
వరాల జీవన నిర్ణయ సాధనం
సాధ్యాసాధ్య ప్రజా జీవన నిర్ణయం
నిర్ణీత ప్రణాలికల పరిశోధనం
శోధనసాధనా జయవిజయముల విచక్షణం
విమల మనో కార్యసాధకులకందించిన కలుగును శుభఫలం
ఫలితఫల జీవనముకిదొక బ్రహ్మాస్త్ర సుసాధనం
ప్రజాస్వామ్య విలువల వరవీణానాద సుస్వరం
సమర సమాన ఎన్నికలకిది దర్పణం
నాయికానాయకులకిదొక విజయపథం
విజయీభవ జీవికకు ఓటన్నదొక ఆయుధం
అవినీతి రహిత ధర్మపర ప్రజాసేవకులకై నిలవాలి
ఓటులోని ప్రజారంజన గుణం
గుణగణ సుపరిపాలనా జనస్వామ్యమె ఓటులోని సుగుణం.

Written by Padma Tripurari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హృదయాంజలి

అమ్మ