ధరిత్రి – పిల్లలు – కథలు – The reality

సంపాదకీయం -డాక్టర్ కొండపల్లి నీహారిణి

ఎండాకాలం భగభగ మండిపోతోందా? చైత్ర వైశాఖ మాసాలు వేడి ఎలా ఉంటుంది? పేరే ఎండాకాలం. ఓ వైపున ధరిత్రి దినోత్సవం జరుపుకుంటున్నామని ఉన్నత పాఠశాల విద్యార్థుల లాగా, బుద్ధిగా చదువుకుంటున్న ప్రాథమిక పాఠశాల విద్యార్థుల్లాగా, ఏమీ తెలియని అమాయకపు ప్రైమరీ స్కూల్ స్టూడెంట్స్ లాగా, అప్పుడే చేరిన ఎల్కేజీ యూకేజీ పిల్లలు లాగా ఈ ధరణి మాత బడి ఒడిలో …ఒడి బడిలో నిత్య జీవన పారాయణం చేసే బ్రతుకు జీవులం. ఈ ప్రకృతి ఒక పెద్ద గురువు. అన్ని దశల తరగతులకు స్కూల్ హెడ్మాస్టర్ లాగా, బడి గంట కొట్టే చెప్రాసి లాగా, గంట గంటకు తరగతులు మారి పాఠాలు బోధించే టీచర్ లాగా ఎంత చదివినా భయాన్ని కలిగింపజేసే పరీక్ష ప్రశ్న పత్రికలాగా పంచభూతాల నిలయమైన ఈ ప్రకృతి ఎన్నో నేర్పిస్తుంది. ఈ జీవన పోరాటంలో కళాశాల నుండి విశ్వవిద్యాలయాలనుండి ఉద్యోగ నిర్వహణ వరకు మన వెంట ఉంటుంది, మనుగడకు ఉపకరిస్తుంది. ఇంత చక్కని ప్రకృతి కి నిలయమైన ఈ భూమాత ఈ ధరణి దేవత మన అస్తిత్వాలకు ప్రతీక. కాపాడుకోవాల్సిన బాధ్యత జాగ్రత్తగా మెసలుకోవాల్సిన బాధ్యత మన పైనే ఉంది.

ఇదంతా ధరిత్రి దినోత్సవం కోసం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది…. మరి పిల్లలు కథలు ఏమిటి…. అనుమానం రావచ్చు. ఎందుకంటే పిల్లలకు కథల రూపంలో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం అనే ఈ ఐదు ముఖ్య ఎలిమెంట్స్ ని చెబితే వాళ్ళకి తప్పకుండా మనసుకు ఎక్కుతుంది. ఈ నేర్పు ఇంట్లో తల్లిదండ్రులకు ఉంటుంది కాని ఉపయోగించుకోరు అంతే.. అదేదో మన సబ్జెక్టు కాదు అన్నట్టు లేకుంటే ఇప్పటినుంచే వీళ్ళకి ఏం నేర్పించాలి లే అనే ఒక నిరాసక్త భావంతోను ఉండడం వల్లనే పిల్లల లోపల ఈ మొండితనం ఎక్కువైంది . భౌగోళిక, పర్యావరణ విషయాలపైన అవగాహన కలిగేలా చిన్నచిన్న ఉదాహరణలు చెబుతూ వాళ్ళ ఆటపాటల్లో నేర్పిస్తూ ఉంటే ఎదుగుతున్న పిల్లలు తప్పకుండా భవిష్యత్తులో ప్రకృతి ప్రేమికులు అవుతారు. బాల్యం ఎంతో విలువైన కాలం. వాళ్లలోని వ్యక్తిత్వ వికాసం క్రమంగా ఎదుగుతున్నప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్య తో పాటు బుద్ధి నేర్పించాలి. పరిసరాల విజ్ఞానం అర్థం చేయించాలి పూలు పండ్లు చెట్లు నిత్యం తినే కూరగాయలు ఎట్లా వస్తాయి ఎట్లా పెరుగుతాయి పండించే వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంటుంది ఆర్గానిక్ ఏంటి ఆర్గానిక్ కానిది ఏంటిది ఇటువంటివన్నీ నేర్పించాలి. ఇందులో భాగంగా పరిశుభ్రత బంధుమిత్రులతో ఎలా మాట్లాడాలి నేర్పించాలి.
పిల్లలు కొత్త నోట్ బుక్ వంటివాళ్ళు. మనం ఏది రాస్తే అదే చదువుకోగలుగుతాము . ముఖ్యంగా వాళ్ళు ఉపయోగించే భాష ఏమిటి? ఏ ఏ సందర్భాల్లో ఎట్లా మాట్లాడుతున్నారు ? ఎవరితో ఏ పదాలు ప్రయోగిస్తున్నారు వంటి విషయాలపైన తల్లిదండ్రులు సీసీ కెమెరాలు లాగా అబ్జర్వ్ చేయాలి.
పిల్లల వ్యక్తిత్వ వికాసం వృద్ధి కలిగేలాగా నాలుగు మంచి మాటలు చెప్తున్నారు ఆత్మ పరిశీలన తో అబ్జర్వ్ చేయాలి। అంటే తల్లిదండ్రులుగా తాత నానమ్మలుగా తాత అమ్మమ్మలుగా మీరు ఎలా మాట్లాడుతున్నారనే దానిపైన మీరే దృష్టి పెట్టుకోవాలి . వాళ్ళు తెలియకుండానే ఫోకస్ చేస్తారు. వాళ్ళు వినరులే అనుకోవడం చాలా పొరపాటు.

ఈ రోజు ల్లో పిల్లలతో ఎక్కువసేపు గడపడం అనేది ఒక్కటే ఒక పెద్ద టార్గెట్ అయిపోయింది . ఈ విషయమే పెద్ద వాళ్ళకి ఇదే తెలియని నష్టం చేస్తోంది. వాళ్లకి బోర్ కొట్టి టీవీ చూస్తాము అనినఅనడం అలవాటైపోయింది అసలే తమ వయసు పిల్లలు లేక ఆడుకోవడానికి బయటికి వెళ్లడం లేదు. ఇక ఇళ్లలో పెద్దవాళ్లు వాళ్లతో కూర్చోకుంటే వాళ్లు ఏం చేస్తారు? తల్లిదండ్రులు ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతూ ఉండడం వాళ్ళు చూస్తున్నారు ఫోన్లో ఎలా మాట్లాడుతున్నారు అనేది వాడు వింటున్నారు హోంవర్క్ చేసుకుంటున్నారు కదా పిల్లలు అనుకొని వాళ్ళని వదిలేసి తల్లిదండ్రులు ఏదైనా వేరే పనుల మీద ఉన్నారు అంటే చాలు ఆ హోంవర్క్ వాళ్లు సరిగా చేయడం లేదు మనసుకి ఎక్కించుకోవడం లేదు అనేది అర్థం చేసుకోవాల్సిందే. ఎట్టి పరిస్థితిలో పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నంతసేపు వాళ్ళ పక్కనే కూర్చొని మాట్లాడుతూ చేయించాలి. ఇది తప్ప వేరే మార్గమే లేదు. సో మెనీ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. వాటిని పెద్దవాళ్లే అధిగమించలేకపోతున్నారు . ఇక పిల్లలు ఎలా అధిగమిస్తారు? ఆ లేత మనసులపై గాఢమైన ప్రభావం పడుతున్న ఈనాటి ఆకర్షణల నుండి కాపాడి వాళ్లను ధరిత్రి ని రక్షించుకోవాలన్నట్టే బాల్యాన్ని రక్షించాలి.
పాత కథలనే కొత్తగా ఆలోచనత్మకంగా చెబుతూ ఈ పసి మొలకలు మహావృక్షాలుగా ఎదిగే ధరిత్రిని సిద్ధం చేసే సమాజాన్ని నిర్మిద్దాం
__**__&

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మహిళా మణులు

పవిత్ర బంధం