స్వయంకృతం

కథ

ఈర౦కి.ప్రమీలారాణి

వేసవికాల౦ మధ్యాహ్నం కావడ౦ తో కూలర్పనిచేస్తున్నా,ఫ్యాన్ తిరుగుతున్నా వేడిగానే వుంది
మాలతికి.చదువుతున్నపుస్తకంఅర్ధంకావడంలేదు.ఇంతలోతలుపుతట్టిన చప్పుడు అయింది.కొత్తగా ఏర్పడుతున్న కాలనీ  కావడం వలన కాస్త నిర్మానుష్య౦గాఉ౦టు౦ది.
ఆకతాయి పిల్లలు కాలింగ్ బెల్ కొట్టి పారిపోతూ౦టారు,తనని డిస్త్రబ్ చేసిన౦దుకు కోప్పడాలో,వాళ్ళబాల్యచేస్ట కు నవ్వుకోవాలో తెలియదు మాలతికి.
మళ్ళీ చప్పుడు అయింది.ఆమె తలుపు తీసింది.భాగీరిధమ్మ గారు….తన స్నేహితురాలు చారుమతికి అత్తగారు.తలుపు పూర్తిగా తీసి’’రండి..రండి మంచి ఎండలో వచ్చారు.’’అంది మాలతి. ఇ౦టిలో చల్లగా వుండటం చూసి ఆవిడకు ప్రాణం లేచివచ్చింది.’’అదృష్టం మీ ఇంటిలో అయినా కరెంటు ఉందమ్మా మా వరుస ఇళ్ళల్లోదేనిలో కరెంటు లేదు.అందుకే మీ ఇంటికి వచ్చాను.’’
‘’అలాగాఉండ౦డి.మంచినీళ్ళు ఇస్తాను.’’అందిమాలతివంటఇంట్లోకివెడుతూ.
‘’ఐస్ బీరువా లో నీళ్ళీయ్యామ్మా.’’మాలతికి నవ్వొచ్చింది.ఆవిడ ఫ్రిజ్ ను ఐస్ బీరువా అన్న౦దుకు.’’చారుమతి ఆఫీస్ కు వెళ్ళిందా౦డి.’’
‘’ఆ వెళ్లి౦దమ్మా…ఏం ఉద్యోగాలో ఏమో సాయ౦త్రం  అయ్యేసరికి డస్సిపోతున్నాడు మా వాడు.’’మాలతికి బాధనిపి౦చి౦ది.ఆవిడ కొడుకు మాత్రమే కష్టపడుతున్నాడా ఆ మాటకొస్తే అతనిని ఆఫీస్ బస్సు వచ్చితీసుకేడుతుంది.తీసుకొస్తుంది.చారుమతి బస్ లలోతిరిగివస్తుంది.’’ఆ మా అల్లుడు గారు ఇంట్లో లేరుకదా నేను గట్టిగా మాట్లాడుతున్నాను.’’
అన్నారు భాగీరధమ్మ గారు.
‘’లేరులెండి ఆయనకు బ్యాంకు వుంది,’’
‘’మరి మీ పిల్లలు.’’
‘’మా ఆడపడుచుతీసుకువెళ్ళింది,వాళ్ళ పిల్లలకు కూడా వేసవి సెలవులుకదా.’’
‘’అదీ ,ఆడపడుచు,వదిన అంటే అలా వుండాలి.మా చారూ వుంది ఉప్పు,నిప్పులా…’’మాలతికి చిరాకొచ్చింది.తన ఫ్రెండ్ ను తన ఎదురుగా విమర్శి౦చి న౦దుకు. పెద్దావిడను ఏమీ అనడ౦ ఇష్టం లేదు.
‘’కాస్సేపు నడుమువాల్చ౦డి.’’అంటూ కూలర్ దివానువైపు తిప్పి౦ది.
‘’నా తల్లే,నాఅమ్మేపెద్దలంటేనీకెంతభక్తీ,ప్రేమ.కృష్ణా.’’అన్నారావిడ నడుము వాలుస్తూ.
‘’అన్నట్టు మీ మనవలేరివాళ్ళనూతీసుకురావలసింది.’’
‘’ఆ..ఇక్కడకెందుకులేఅల్లరిచేస్తారు.పక్కింట్లో ఆడుకు౦టున్నారు.’’
ఆవిడ దివాను మీద పడుకున్నారు,మాలతి చదువుతున్న బుక్ తీసుకుని వెనక బెడ్ రూమ్ లోకి వచ్చేసింది.తెరిచివున్న కిటికీ లో ను౦చి పక్కి౦ట్లో మామిడి చెట్టు మీద ఒకదాని వెనక ఒకటి పరుగెడుతున్న ఉడతలు కనిపి౦చాయి.వాటినిచూస్తే చిన్నప్పుడు తనూ,చారుమతి స్నేహంగా తిరగడం గుర్తుకొచ్చి౦ది. ఉరికే జలపాతం లాటిమాలతికి,ని౦డుగోదావరి లాటి చారుమతికి స్నేహం ఏమిటి? అని అందరూ ఆశ్చర్యపోయేవారు.దానికీచారుమతి మాట్లాడేది.కాదు.మాలతే’’ మీకు తెలియదులెండివిభిన్న ధ్రువాలు ఆకర్షి౦చుకు౦టాయి.’’అనేది.వారి స్నేహం జూనియర్ కాలేజి వరకు బాగానే నడిచింది.ఇంటర్మిడీయెట్సెకండ్ఇయర్ లో చారుమతి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయింది. స్నేహితు లిద్దరూ చెరొక వూళ్ళో వున్నా ఇద్దరి మధ్యా ఉత్తరాలు మంచి జోరుగా నడిచాయి.సెకండ్ ఇయర్ పూర్తికాకుండానే చారుమతికి పెళ్లి కుదిరింది.ఆ విషయం తెలిసి మాలతి ఆశ్చర్యపోయింది.ఇ౦త తో౦దరగా పెళ్లిఎందుకుఅని చారుమతిని ప్రశ్ని౦చింది.
చారుమతి కుటుంబం మధ్యతరగతి కి చెందినది,వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ లో వున్న చిన్న ఉద్యోగి. చారుమతి తరవాత ఇంకా ఇద్దరు పిల్లలు వున్నారు,వాళ్ళ చదువులు అవీ వున్నాయి.ఇంక తను చెప్పినా చారుమతి వినదని ఆమె పెళ్ళికి  తల్లి,తండ్రిని బతిమాలి,అన్నగారు రాను అంటున్నా బతిమాలి అతడిని తీసుకుని పెళ్ళికి వెళ్ళింది మాలతి.తీరావెళ్ళాకా ఎందుకు పెళ్ళికి వచ్చానా అనిపి౦చింది.ఈ భాగీరధమ్మగారు.ఆ పెళ్ళిలో  చేసిన యాగీఇంతా,అంతాకాదు,చారుమతి భర్త రాఘవ చెప్పినా కూడా ఆవిడ వినలేదు.మొత్తానికి పెళ్లి జరిగిపోయింది,తర్వాత కూడా స్నేహితులిద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు.చారుమతి పెళ్లి అయ్యాకా ప్రైవేటు గా చదివి బి.ఏపాసైంది.రాఘవ ఏ వూళ్ళోవుద్యోగం చేసినా తను ఆ వూళ్ళో చిన్న వుద్యోగంఅయినా చూసుకునేది.ఆమెకు ఇద్దరు పిల్లలు. మాలతి కూడా డిగ్రీ పాసయ్యింది.వెంటనే శ్రీధర్ తో పెళ్లి అయ్యింది,ఆమెచైత్యన మానసిక వికలా౦గుల కేంద్ర౦లో టీచర్ గా పనిచేస్తుంది.
కాలగమన౦లో ఈ బాధ్యతల మధ్య మిత్రులిద్దరిమధ్యాఉత్తరాలుపల్చబడ్డాయి.
మళ్ళీ మిత్రులిద్దరూ కలుసుకోవడం కూడా గమ్మత్తుగా జరిగింది.
ఒకసాయ౦త్రం కేంద్రానికి వెళ్లి నడుచుకుంటూ ఇంటికి వస్తున్న మాలతికి తన ముందు నడుస్తున్న వ్యక్తిలో చారుమతి పోలికలు కనిపించాయి ఆమె రెండదుగులు ముందుకు వేసి చూస్తే చారుమతే.ఇద్దరికీ కలిగిన ఆన౦ద౦ ఇంతాఅంతాకాదు.
అప్పటిను౦చీ వీలైనప్పుడు కలుసుకుని కబుర్లు చెప్పుకునేవారు.నెమ్మదిగాశ్రీధర్,రాఘవ కూడా మిత్రులయ్యారు.పిల్లలు ఒకే స్కూల్ కాబట్టి వాళ్ళ స్నేహం కలిసిందని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు.
ఇంతలో మళ్ళీ తలుపు తట్టిన చప్పుడు కిఆలోచనల లో ను౦చి,గదిలో ను ౦చి బయటికి వచ్చింది మాలతి.వచ్చింది చారుమతి పిల్లలు ధరణి,ధరిత్రి.ఈ అలికిడి నిద్ర లేచినభాగీరధమ్మ గారు వాళ్ళను చూసి మొహం చిరాగ్గాపెట్టారు.’’నాయనమ్మా నువ్వు ఇక్కడ వున్నవా మేము నీకోసంవెతుకుతున్నాము.కరెంటు వచ్చింది ఇంటిలో ఉండడానికి భయం వేసింది.’’
‘’ఇంక నేను బయలుదేరుతనమ్మా.’’
‘’ఉండ౦డి,కాఫీ తాగివెడుదురుగానీ.’’మాలతికి ఆవిడకుకాఫీ,పిల్లలకుబోర్నవిటా కలిపి ఇచ్చింది.వాళ్ళు మొహమాట పడుతూ తాగారు.కాస్తమిక్సరు,మైసూర్ పాక్ స్టీల్ బాక్స్ లో ఇచ్చిందిమాలతి.’’వద్దా౦టి అమ్మ తిడుతూ౦ది.’’
‘’నేను ఇచ్చానని చెప్పండి.ఏమీఅనదు.’’వాళ్ళు వద్దు అంటున్నాకళ్ళల్లో ఆకలి చూసి మాలతికి జాలేసింది,ఈభాగీరధమ్మాకాలక్షెపం కోసం ఇల్లిల్లూతిరగకపోతేఆ పిల్లలకు ఏమైనా చేసి పెట్టకూడదు.

****************************************
‘’అమ్మా..అమ్మా చారుమతి ఆ౦టీ వస్తున్నారమ్మా.’’అన్నాడు శ్రీకర్.
‘’అబ్బా రానీయరావస్తున్నదిచారుమతి కాదు చిరుతపులి అన్నట్టు అరుస్తావే౦.’’అంది మాలతి.సాయ౦త్ర౦ వంట చేస్తోంది. అరటికాయ వేపుడులోకి ఉల్లిపాయలు తరుగుతున్న ఆమెకు కళ్ళవెంట నీళ్ళు కారుతున్నాయి.
‘’అదికాదమ్మా ఆ౦టీ ఏడుస్తూవస్తున్నారు.’’అసలువిషయంచెప్పిందికూతురు.శ్రీలేఖ.
‘’ఉల్లిపాయలు నేను తరుగుతు౦టే చారుమతి కళ్ళల్లోనీళ్ళా.’’మాలతి చేతులు కడుక్కునినేప్కిన్ తో చేతులు తుడుచుకు౦టూ హాల్లోకి వచ్చింది.అప్పటికే గేటు దాటి లోపలికి వచ్చింది చారుమతి,’’రా,,రా నువ్వు వస్తున్నావని పిల్లలు చెప్పారు.’’
‘’నేను మీ ఇంటిలో కాస్సేపుకూర్చోవచ్చా….మీ వారు.’’సందేహ౦గా అడిగింది చారుమతి.
‘’అయన లేరు,వున్నా మన గురించి పట్టించుకోరు.నిలబడే మాట్లాడుతున్నావ్ కూర్చో.’’అంది మాలతి ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో పెట్టి.ఇంతలోచల్లటిమంచినీళ్ళు తెచ్చి ఇచ్చాడు శ్రీకర్.’
‘’ఏం జరిగింది చారుమతి..మనసేందుకుకష్టపెట్టుకున్నావ్.’’
‘’ఏముంది మాలాటిఇళ్ళల్లో గొడవలు డబ్బుగురించివస్తాయి,మర్యాదల గురించి వస్తాయి’
‘’అలాగా,మీ,అత్తగారు ఏమంటారు?’’
‘’అయ్యో గొడవ మొదలైంది తల్లీకొడుకులకే.ఆ తర్వాత నా మీదకిమళ్ళింది తుపాను.’’
మాలతికి డబ్బు ఇబ్బ౦దులు తెలియవు,కాస్త వున్న వాళ్ళి౦ట్లో పుట్టింది.ఇటు శ్రీధర్ కుటు౦బం కూడా డబ్బు గలదే,అందుకే మాలతికి డబ్బు ఇబ్బ౦దులు కొత్త.
‘’నేనేమైనా నీకు సాయం చెయ్యగలనా నీకు అభ్య౦తరం లేకపోతె వివరంగా చెప్పు.’’అంది మాలతి.
‘’అభ్య౦తరం వుంటే మీ ఇంటికి రానేరాను.అసలేంజరిగి౦ద౦టే మాలతి….’’’
మాలతి పిల్లలిద్దరూ టెన్నిస్ ప్రేక్షకుల్లాగామిత్రులిద్దరినిచూస్తున్నారు.’’మీకెందుకు ఈ పెద్ద వాళ్ళ విషయాలు,లోపలిగదిలో కి పోయి చదువుకోండి.’’అందిమాలతి,వాళ్ళిద్దరూ బుక్స్ తీసుకు వెళ్ళిపోయారు.
‘’చూసావా నీ క్రమశిక్షణ.చెప్పగానే నీ మాట విన్నారు అంది చారుమతి.
‘’అది కొ౦తవరకేలే మనసు కాస్త ఇటేవుంటుంది.’’
‘’అయినా విన్నారుగా,ఇలాగే పెద్దవాళ్లు కూడా మన౦ చెప్పిన మాట వి౦టే ఎంతబాగు౦డును.నీ కేమీపనిలేదుగా.’’
‘’ఇప్పుడే వస్తాను.’’మాలతి కూర కదిపి వచ్చింది.
‘’ఈవేళ సాయ౦త్రం ఆఫీస్ ను ౦చి వచ్చాను మాలతి…..’’చారుమతి కధ చెబుతున్నట్టు మొదలు పెట్టింది.చారుమతి ఇంటికి వచ్చిస్నాన౦ చేసి వచ్చి కాఫీ కలుపుకు౦దాముఅనుకునేసరికి అత్తగారు కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు.ఆమెఆశ్చర్యపడింది,ఎప్పుడూ లేనిఈప్రేమకి.కాఫీతాగి ఇంట్లో పని మొదలుపెడదామనుకు౦టు౦డగా వచ్చాడు.రాఘవ.
‘’ఏరా డబ్బు తెచ్చావా.’’రాగానే అడిగింది భాగీరధమ్మ గారు.
‘’ఏం డబ్బమ్మా.’’
‘’అదేరా పదివేలు.’’
‘’పదివేలు ఎక్కడిను౦చి తెస్తానమ్మా.ఐదువేలు అయితే సరిపోతు౦దనుకు౦టున్నాను.’’
ఈడబ్బు ఎందుకో చారుమతికి అర్ధం కాలేదు.ఆమెకు తెలియకు౦డా తల్లీకొడుకులిద్దరూ కొన్ని విషయాలు మాట్లాడుకు౦టారు.’’ముష్టిఐదువేలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటేలే’’ అంది భాగీరధమ్మగారు.పోనీ మొదట ఐదువేలు ఇద్దా౦,తరవాత ఐదువేలు ఇద్దాము.’’ అంది కాస్త సర్దుబాటు చేసుకుంటూ.
‘’అలాగైనాకష్టమేనమ్మా.ధరణిచదువుకిఖర్చుపెట్టాలి.’’
‘’కుర్రవెధవ వాడి చదువుకి అంత డబ్బె౦దుకు,’’
‘’వాడి భవిష్యత్తు బాగుండాలి అంటే ఇప్పటిను౦చీ ఖర్చుపెట్టాలి.అదృష్టంబాగుండి వాడికి నా తెలివితేటలు రాలేదు వాళ్లమ్మ తెలివి వచ్చింది.మునుపటిలాగా కాదు ట్యూషన సెంటర్ లకు చాలా ఫీజు కట్టాలి.’’’
‘’నిజమేగానీ ఈ ఏడాది వాడు స్కూల్ ఫైనలేకదా (టెన్త్ క్లాస్) వచ్చే ఏడాది చూద్దాం వాడి సంగతి.’’
‘’ఏమిటమ్మా అంత బాధ్యత లేకుండా మాట్లాడతావు.చదువు అనేది ఎప్పటికప్పుడు చదవాలి.ఏకారణంగానైనా వాడికి ఆసక్తి తగ్గింద౦టే ఆబాధ మనకేగా.’’
‘’పోనీలేరా ఇవ్వడం నీకే ఇష్టం లేనట్టుంది,దానికి వాడి చదువు అడ్డం పెట్టుకోవడం ఎందుకు.’’నిస్టూర౦గా అందావిడ.
‘’అలా కోపం తెచ్చుకుంటే నేనేమీ చేయలేనమ్మా,పదివేలంటే మాటలా…ఇక్కడ ఇళ్ళస్థలాలేవోచవగ్గావస్తున్నాయటేను…..’’నసుగుతున్నాడురాఘవ.వింటున్నచారుమతి తల పట్టుకుంది.ఆస్థలంకొంటారోకొనరో కానీ ఆ విషయం చెప్పే సందర్భం ఇదా.’’అదీ అలా చెప్పు భార్యాభర్తలిద్దరూ కూడబలుక్కుని ఈ మాట చెబుతున్నారు.దానికి ఆ కుర్రవెధవ చదువు అడ్డ౦ పెట్టుకు౦టారెందుకు.’’భాగీరధమ్మగారికి కోపం చాల వచ్చింది.
‘’అదికాదమ్మా అక్కా వాళ్ళు వున్నా వాళ్ళు,వాళ్ళకి మన౦ ఇచ్చేఈ ఐదువేలు ఒక లెక్క లోకి రావు.’’
‘’అందుకని పుట్టి౦టి ను౦చి ఏ మర్యాదలు జరపవద్ద౦టావా మహారాణికైనా పుట్టి౦టి ఆశఉ౦టు౦ది,’’
‘’ఇయ్యననిఅనడంలేదమ్మా ఐదువేలు సరిపోతు౦దనుకు౦టున్నాను.’’
‘’అంత ఏడుస్తూఆఐదువేలుఇవ్వనవసరంలేదులే.’’ఆవిడ అంత మాట అంటు౦దని అనుకోని రాఘవ,చారుమతి బాధపడ్డారు.
‘’ఎందుకమ్మాఅంతలేసిమాటలు..ఇప్పుడేం తక్కువ జరిగింది,చేయవలసిన మర్యాదలన్నీ చేస్తూనే వున్నాము.నా చిన్నతన౦  లోనే నాన్నగారు పోయారు.అందుకని నాకు పెద్ద చదువులు చదివే అవకాశ౦ రాలేదు.నేని౦కా వున్నాను నా పిల్లల్ని పెద్ద చదువులు చదివి౦చాలనిఆశ.నా పరిస్థితి నా పిల్లలకు రాకూడదని నా బాధ.అది తప్పా.’’
‘’తప్పుకాదురా,,కానీ సమయం వచ్చినప్పుడు ఖర్చు పెట్టాలిగా,ఇన్నాళ్ళబట్టి ఉద్యోగాలు చేస్తున్నారు.ఆ మాత్రం డబ్బు లేదా?వున్నా ఇవ్వడం ఇష్టం లేదని చెప్పు.నీ పెళ్ళాం ఇవ్వొద్ద౦దని చెప్పు.’’
ఇంక చారుమతిఊరుకోలేకపోయింది.’ఇ౦దాకటి ను౦డి  నేను వి౦టున్నాను.మీ ఇద్దరూ వాది౦చుకుని నన్న౦టారేమిటి?అసలు వదినగారికి మన౦ పదివేలు ఇవ్వడంఏమిటి?నాకు ఆ విషయమే తెలియదు.’’
‘’ఆడపడుచు సింగపూర్ వెడుతోందిమనమేమైనాఏర్పాట్లు చేయాలా అనిఅడుగుతావమోఅని నేను చూస్తున్నాను.అసలునీకా ఉద్దేశ్యమే లేదు.అడిగితె ఎక్కడ ఏఖర్చు మీద పడుతూ౦దోఅని నీ భయం.’’
..వదినగారు సింగపూర్ వెడుతున్నారా ఆ సంగతి నాకు తెలియదు.మీరూ చెప్పలేదు.’’
‘’ఏమిటి నీకు చెప్పేది.వాడునాకొడుకు కాబట్టి నేను వాడినిస్వత౦త్ర౦గా అడుగుతున్నాను.అయినా మర్యాదల సంగతి నీకేంతెలుసు,మీపుట్టింటివాళ్ళుమావాడికేంమర్యాదలుచేసారని.?మర్యాదలు తెలుసు౦డాలి చేసే మనసు వు౦డాలి. అవి లేనివాళ్ళు నీలాగేమాట్లాడతారు.’’
‘’మీరు మాటకి ముందు మావాళ్లని అనకండి.వాళ్ళు౦డేది దూర ప్రా౦త౦ అనినా వెనుకే తనూ వస్తేమీరు ఒ౦టరిగా ఉ౦టారని,ఏమైనా అనుకు౦టారని అయన భయపడతారు.ఇంక మర్యాదలు ఎవరికీ చేయాలి.’’చారుమతి అంది.
‘’చూసావురా ఆ మాటలు ఇదంతా నువ్విచ్చినఅలుసుకదూ.’’
‘’నువ్వు౦డు చారుమతీ ఏదేదోమాట్లాడతావేమిటీ?అన్నాడు రాఘవ.
‘’మీరూ నన్న౦టారేమిటి?ఈ విషయం లో నా ప్రమేయం ఏమైనా ఉందా?’’అంది చారుమతి.
‘’అందుకే నేను మాట్లాడుతున్నాను,అమ్మాఆఖరుగా చెబుతున్నానువిను ఐదువేలకంటే నేను ఎక్కువ ఇవ్వలేను.’’
‘’అదికూడా ఇవ్వనవసరంలేదు,ఇంటికిమగవాడివిఅంటూనువ్వున్నావనిఆమర్యాద,గౌరవం నీకు దక్కాలని నేను అలోచి౦చాను.నా గొలుసు ఉందిగా అది అమ్మేస్తే ఈ  పదికాదుపాతికవేలు వస్తాయి దానితో ఈ ఖర్చు మహారాజులా వెళ్ళిపోతుంది.’’
రాఘవఖ౦గారుపడ్డాడు.తల్లికి పట్టుదల జాస్తి.’’అంతపనే౦దుకు నేనేదోచూస్తాలే.’’అన్నాడు నసుగుతూ.
చారుమతికి చిరాకొచ్చింది.భర్తమీద .’’ఏమిటండీఅంతభయపడతారు?బ్యాంక్ లో ఉన్నదే పదిహేనువేలు…అందులో పదివేలు ఇచ్చేస్తేఎలాగ.?పాపా ఆడపిల్ల అది పెద్ది అవుతోంది.ఇప్పటివరకు దానికి మన౦ ముక్కుపుడక అయినా చేయించలేదు.స్థలం కొనాలని మీరే అంటారు,ఇన్ని ఖర్చులు మనకివుండగా పదివేలు ఇవ్వడం సాధ్యమా.’’
‘’ఏదో మేము ఆలోచిస్తున్నా౦గా.’’అన్నాడు రాఘవ.
ఏమిటి మీరు అలోచి౦చేది.అన్నీవున్న వాళ్ళనిఅందలాలెక్కించిఏమీతెలియని పిల్లలని అన్యాయం చేయడమా.’’
‘’అవునూ ఇన్నాళ్ళకి నువ్వూ నీ పిల్లలు వచ్చారని వాడిని రక్తసంబ౦ధం వదులుకోమ౦టావా.’’
‘’అదికాదు…’’చారుమతి ఏదో చెప్పబోయింది.
‘’నువ్వునోర్మూసుకో ఆఫీస్ ను౦డి రాగానే ఏదో ఒకటి మొదలుపెడతారు.’’చిరాగ్గాఅనేసి రాఘవ లోపలి  కి వెళ్ళిపోయాడు.భాగీరధమ్మ గారి కళ్ళల్లోవిజయరేఖ తొంగిచూసింది.
ఆఖరికితల్లీ,కొడుకు ఒకటై తనను పరాయి దాన్ని చేస్తారనుకోలేదు.
ఆడపడుచు అంటే తనకె౦ ద్వేష౦ లేదు.వాళ్ళు వచ్చినప్పుడల్లా మర్యాదలు బాగానే చేస్తుంది.అందుకు ఆడపడుచు కూడా సంతృప్తిని వ్యక్తం చేస్తుంది,కేవలం ఈ పెద్దావిడ తన గొప్పతనం,పెద్దరికంచూపించుకోవడానికి కొడుకుని వాడుకు౦టో౦ది.అది తెలియని ఈ పెద్దమనిషి తల్లిని బాధ పెట్టడం ఎందుకని అన్ని౦టికీ ఒప్పుకుంటున్నాడు.చారుమతికి భర్త ని చూస్తె కోపం రాలేదు జాలేసింది,’’అదీ మాలతి జరిగినది.అంది చారుమతి జరిగిన విషయ౦ మాలతికి చెబుతూ.
‘’మీ ఆడపడుచు వాళ్ళు డబ్బుగలవాళ్ళు,అటువంటివారికిఈ డబ్బెందుకు ఇవ్వాలో నాకూ అర్ధం కావడంలేదు.’’అంది మాలతి.
‘’చెప్పానుగా కొంతమంది ఆడవాళ్ళకి మా పుట్టింటివాళ్ళు ఇలా౦టి కానుకలు ఇచ్చారనిచెప్పుకోవడంకొదరికిగొప్ప,సంతృప్తి.వీలైనా కాకపోయినా ఇవ్వడం మరికొందరికిసరదా.అది మన లాటివాళ్ళకి ఎంతఇబ్బందో ఎవరూ గుర్తి౦చరు.’’అంది చారుమతి,
‘’మరిఇప్పుడు ఏం చేస్తావ్.’’
‘’ఏముంది నా కోరికల్ని,ఆశల్ని చంపుకుని ఒక్కో రూపాయి కూడబెడతాను.’’అంది చారుమతి.
‘’అమ్మా నాన్నగారు నిన్ను రమ్మ౦టున్నారు.’’అంటూ వచ్చాడు ధరణి.
‘’ఎక్కువ ఆలోచి౦చి మనసు పాడుచేసుకోకు,ఇద్దరు పిల్ల లతండ్రిమీవారు ఆ మాత్రంబాధ్యత తెలియద౦టవా.ఆయనే ఏదో ఒకటి అలోచిస్తారులే,’’అంది మాలతి స్నేహితురాలికి వీడ్కోలు చెబుతూ.
వంట చేస్తున్న మాలతికి చారుమతి ఏంటి పరిస్థితి బాధగా వుంది,ఇద్దరివి ప్రైవేటు ఉద్యోగాలు.ఇంటర్మిడియెట్ తో చదువు ఆపకుండా చారుమతి ప్రైవేటు గా చదివి బి.ఏపాస్అయ్యింది.రాఘవఏవూరిలోవుద్యోగం చేసినా తనూ ఆ వూరిలో వుద్యోగంవెతుక్కునేది.అతనికి కూడా చెడు అలవాట్లు లేవు,మనిషినెమ్మదస్తుడు,అందుకే తల్లి ఏం చెయ్యమంటే అది తన కిష్టం లేకపోయినా చేస్తాడు.భాగీరదమ్మ గారు కూడా గొప్పలకు పోకుండా వున్న౦తలో సర్దుకుపోవచ్చుగా….రాఘవ,అతని కుటు౦బం ఆవిడవికావా…ఒకవేళ తల్లిచాదస్తంకొద్దీఇచ్చినా అక్కగారు ఎలా తీసుకు౦టు౦ది.?అతని ఆర్ధికపరిస్థితి అక్కకు మాత్ర౦ తెలియదా?బ్యాంకు లో వున్నవేపదిహేనువేలంటే చారుమతి ఆర్ధిక పరిస్థితి మీద బాధ కలిగింది మాలతికి…పోనీ భాగీరధమ్మ గారెకి నచ్చచెబితే?…..వద్దు…వద్దు వారి వ్యక్తిగతవిషయాలలో తను కలిపి౦చుకుంటే రాఘవ బాధ పడవచ్చును.చారుమతిని ఓదార్చడం తప్ప తనేమీ చేయలేదు.
వారం రోజులు గడిచిపోయాయి. ఈవారం లో మిత్రులిద్దరూ కలుసుకోలేదు.ఆసాయ౦త్రంమాలతి ఇంటికి వచ్చింది చారుమతి.ఇంటికి తాళం పెట్టి ఉండటంతో వెనుతిరిగింది,మాలతి ఆటో లో౦చి దిగుతోంది.’’రాలోపలి తాళం తీస్తాను,కేంద్రం వార్షికోత్సవం దగ్గరపడుతోందికదూ,మా విద్యార్ధుల చేత పోగ్రామ్స్ రిహార్సల్ తో లేట్అయింది.’’ఇంట్లోకి వచ్చాక అంది మాలతి.
‘’నేను మొన్న వచ్చానునువ్వువూరికి వెళ్ళావని మీవారుచెప్పారు.ఎందుకు అంత హఠాత్తుగా వెళ్లావు?’’
‘’మా తమ్ముడుకికూతురుపుట్టింది. మా మరదలికి సిజేరియన్ చెయ్యాలి అనేసరికి మా అమ్మకి ఖంగారు,నాకు ఫోన్ చేసింది.సిజేరియన్ అవసరం లేకపోయిందిలే నార్మల్ డెలివరికూతురుపుట్టింది.మా అమ్మ రెండురోజులువుండమంటేవుండి.వస్తున్నాను.’’అంది మాలతి.
‘’అలాగా నీ తరవాత ఇంతకాలానికి మీ ఇంట్లో ఆడపిల్ల అన్నమాట.మీవాళ్ళందరూబాగున్నారా.’’
‘’బాగున్నారుకాస్త వేడిగా కాఫీ ఇస్తాను.’’
‘’మీవారు పిల్లలు కనిపి౦చడం లేదేం మాలతి.’’
‘’స్కూళ్ళుతెరిచారుకడూ,పిల్లలకి బుక్స్ కొనడానికిఆయనవాళ్ళనుతీసుకువెళ్ళారు.వచ్చేటప్పుడు చపాతీలు తెస్తాను అన్నారు అందుకని ఇప్పుడు వంట బాధ లేదు,ఆరోజు ఏదో బాధ పడుతూ వచ్చావు.మీరెలావున్నారు.మీ పిల్లలకి బుక్స్ అవీ కొన్నారా?’’అంది మాలతి.
‘’మావారు,పిల్లలూ సినిమాకి వెళ్ళారు,నన్నూరమ్మన్నారుకానీ నా మనసే౦ బాగుండలేదు. వెళ్ళాలనిపించలేదు.నీతోమాట్లాడాలనిపించి ఇలా వచ్చాను,తాళం చూసి వెడుతున్నా లక్కీ గా నువ్వు వచ్చావు.’’
‘’మనసు బాగు౦డనప్పుడేకదా సినిమా.మీ అత్తగారిని వదిలి వెడితే బాగు౦డదని,వెళ్లలేదని చెప్పు.’’కాఫీ ఇస్తూ నవ్వుతూ అంది మాలతి.
‘’మా అత్తగారు ఉంటేకదా.’’
‘’అంటే ఏమైంది మీ అత్తగారికి,;;ఖంగారు పడింది మాలతి.
‘’ఏమీ కాలేదు ఆవిడ చేసే హఠ౦ భరించలేక ఓల్డేజిహోంలోచేర్చారుమావారు,‘’ఆ…’’ఆశ్చర్యం తో నోరు తెరిచింది మాలతి.’’ఆవిడ అక్కడ ఎలా వుంటారు చారుమతి.’’
‘’ఆ మాటే నేను చెబితే ఆయన వినలేదు,ఒకరోజు మా ఇంట్లో గొడవ జరిగి౦దని మీ ఇంటికి వచ్చాను గుర్తుందా?ఆగోడవచిలికి,చిలికి గాలివాన అయింది.ఎంత చెప్పినా తల్లీ కొడుకులుఇద్దరూ నా మాట వినలేదు.డబ్బుగురించిచాలావాదోపవాదాలు జరిగాయి తల్లిని ఓల్డేజి హోం కి వెళ్లిపొమ్మన్నారు ఆయన ,అలా అనగానే పంతం వచ్చి వెళ్లిపోతానని’’ కూర్చొన్నారు ఈవిడ,
‘’మీ వారు నెమ్మదిగా ఉ౦టూనే ఇంత పనిచేస్తారనుకోలేదోయ్.’’
‘’అవును మాలతి వాళ్ళిద్దరూ బాగానే విన్నారు మధ్యలో నన్ను ఆడిపోసుకు౦టో౦ది లోకం.ఒక్కకోడల్నిఅయివుండి అత్తగారిని హోం కి పంపి౦చానని.’’
‘’అంతేలేఒక్కోప్పుడు మన తప్పు లేకపోయినా మన౦ బాధపడాల్సివస్తుంది.’’
‘’మా అత్తగారూ నన్ను ద్వేషి౦చారేమోగానీ,నేనెప్పుడూ ఆవిడనుద్వేషి౦చలేదు.’’
‘’నెమ్మదిగా వుండేమీవారికిఇ౦త కోపం రావడంఆశ్చర్యమే.’’
‘’ఏం చేస్తారు ఆవిడ బాధ్యతారాహిత్యాన్నిభరించలేకపోయారు.,నేను మాత్రం ఆవిడకు అంత సిక్ష వేయడం చూడలేకపోతున్నాను,’’చారుమతి కళ్ళల్లో నీళ్ళు.
‘’అయ్యో బాధ పడకు చారుమతి.’’ఓదార్పుగా అంది మాలతి.
‘’ఏం చెయ్యమ౦టావ్ మాలతి,ఏసహాయం,సలహాలేకపోయినాఏదో పెద్దావిడ ఇంట్లో వున్నారులే  అనే ధైర్యం వు౦డేది.’’
‘’మరిప్పుడే౦ చేస్తావ్.’’అడిగింది మాలతి
‘’అదే అర్ధం కావడలేదు.’’
‘’సరే, ఏదోఒకటిఆలోచిద్దాము.అదేవిషయం.అలోచి౦చిమనసుపాడుచేసుకోకు.’’
‘’నువ్వు ఇలా ధైర్య౦గా మాట్లాడతావనే నీ దగ్గరికి వచ్చింది.’’
‘’మనశక్తీమనకితెలియనట్టే మన తప్పులు మనకు తెలియవు,మనుషులు దూర౦గా వుంటే విలువ తెలుస్తుంది.’’అందిమాలతి.ఆమె మనసులో ఏవో ఆలోచనలు..
ఇంతలోశ్రీధర్,పిల్లలు రావడంతో తన ఇంటికి బయలుదేరింది చారుమతి,ఆమెకు తన అత్తగారు హోం కివెళ్ళిన పరిస్థితులు గుర్తుకొచ్చాయి.

***************************************
డబ్బు గురించి గొడవ జరిగిన నాలుగైదు రోజులకు ఆరోజెందుకో ఆఫీస్ కు వెళ్ళాలనిపించక సెలవు పెట్టి ఇంట్లో వుంది చారుమతి.ఆ గొడవ జరిగిన దగ్గర ను౦డి అత్తగారితో,భర్తతోమనసువిప్పి మాట్లడలేకపోతో౦ది.ఇంతలో రాఘవ ఆఫీస్ ను౦డి మధ్యాహ్నమే ఇంటికి వచ్చాడు ఇంట్లో తల్లి కాకుండా భార్య కనిపి౦చడం తో ఆశ్చర్యపోయాడు.’’ఎప్పుడూ ఆఫీస్ మానని నువ్వు ఇంట్లో వున్నావేమిటి..’’
‘’ఆఫీస్ కు వెళ్ళాలనిపించలేదు.’’
‘’ఎందుకు ఒ౦ట్లో బాగులేదా.’’
‘’బాగానేవుంది,ఇంతకీ మీరుఈవేళప్పుడు ఇంటికి వచ్చారెందుకు.లంచ్చేసారా ‘’చేసాను.ఇంతకీ మా అమ్మేది.’’
‘’పక్కింటి మాస్టారింటికిచుట్టాలోచ్చారు.అందరూ కలిసి సాంఘినగర్ వెళ్ళారు.’’
‘’అలాగా మా అమ్మ నాతోచెప్పనేలేదు.ఆవిడకిడబ్బుఎక్కడిది.’’
‘’నన్ను వందరూపాయలుఅడిగారుఇచ్చాను.’’
అతని ముఖం కాస్తచిన్నబోయింది,’’నెలాఖరు ఇప్పుడు వెళ్ళవద్దనిచెప్పెలేకపోయావా.’’
‘’అలా చెబితే నన్ను బతకనిస్తారా,మాకోడలు నన్ను గుడికి వెళ్ళనివ్వదు అ౦టూ గొడవ చేస్తారు.’’
‘’ఆవిడఅన్నిసార్లు అడుగుతో౦ది అని బ్యాంకు కి వెళ్లిఐదువేలుతెచ్చాను,’’చారుమతిమాట్లాడలేదు.’’ఏం మాట్లాడవు?’’
‘’మీరేగానోర్మూసుకో అన్నారు.’’
‘’ఓహో ఆరోజు అన్న మాటకి నీకు ఈరోజు కోపం వచ్చినట్టుంది,’’
‘’ఆ రోజూ కోప౦ రాలేదు.కుటు౦బం అందరి గురించీ  ఆలోచి౦చి నేను మాట్లాడితే కేవల౦నన్ను మీరిద్దరూ వేరు చేసి మాట్లాడారు.నాకు బాధగా అన్పి౦చి౦ది.’’
‘’ఏంచెయ్యను మా అమ్మ మొ౦డితనం నీకు తెలుసుగా వున్నా ఒక్క గొలుసుఅమ్మేసి మా అక్కకు ఆడబ్బుఇచ్చేస్తుంది.’’
‘’ఇవ్వనివ్వ౦డి.తల్లిబంగారం కూతురికేగాఇస్తారు.’’
‘’కానీ మనిద్దరం స౦పాదిస్తుండగా ఆవిడనిఖర్చుపెట్టమనడం ఏంబాగు౦టు౦ది.’’
‘’అయితేఈసారితోఈఖర్చుఅయిపోతుందా.’’
రాఘవమాట్లడలేదు.’’చూడండిఈసంభాషణమీరేతీసుకొచ్చారుకాబట్టినేను మాట్లాడుతున్నాను,మీఅక్కగారువాళ్ళుమనకంటేఆర్ధికంగావున్నవాళ్ళు…వాళ్లకిమన౦ఏదోరూప౦ లోఇ౦తి౦తడబ్బులు ఎందుకివ్వాలోనాకర్ధం కాదు.’’
‘’మనవైపును౦డిమాఅక్కకుమర్యాదలుఘన౦గా వుండాలని మాఅమ్మఆశ,’’
‘’ఇలాఎన్నాళ్ళు,ఒకటి,రెండేళ్లలోమీఅక్కకూతురికిపెళ్లిఅవుతుందిఅప్పుడుమేనమామగామీరేమైనాకానుకఇచ్చినాఅర్ధంవుంది.మన౦ఎలావున్నామర్యాదలుచేయాలంటే సాధ్యమా.నేను మాపుట్టి౦టి ను౦డిఈమర్యాదలుఆశిస్తున్నానా?మీఅమ్మగారిని లోకంఏమనుకు౦టు ౦దో అని అలోచి౦చడం మానేసి ఏది న్యాయోమో అది ఆలోచి౦చమన౦డి.’’
‘’అయితేఈఐదువేలుబ్యాంకులోవేసేయ్యనా.’’
‘’ఏమిటండి అంత సొంతఆలోచన లేనట్టు మాట్లాడతారు.ఆవిడడబ్బుకావాలంటేతేవడం నేను వద్దు అంటే బ్యాంక్ లోవేయడంఇదేపనా.’’
‘’నువ్వన్నదినిజమేచారుమతి,,,కానీ మా అమ్మకు పట్టుదల జాస్తి.’’
‘’ఎందుకు ఆవిడకుపట్టుదలఎక్కువఅనిభయపడతారు.దాన్ని పట్టుదల అనరు.పంతంఅంటారు నేను చేయమన్న పని వీళ్ళుఎందుకు చేయరు అని.’’
‘’పోనీ అదేఅనుకో.’’
‘’అయితేపదివేలుఇస్తూన్నారా.’’
‘’లేదు ఐదువేలుఇస్తున్నాను.’’
‘’మిగతాఅయిడువేలకోసంగొడవచెయ్యరా.అసలుఈడబ్బుఇస్తున్నట్టు మీ అక్కగారికి తెలుసా.’’
‘’తెలియదు.సర్ప్రైజి౦గా ఇవ్వాలని.’’
‘’ఆటువంటప్పుడుఈడబ్బు మాత్రంఇవ్వడందేనికి.మన౦ ఇల్లు కొంటె అందులో మీ అమ్మగారు మనతో పాటు వుంటారు.పుట్టినప్పటి ను౦డిఅద్దెఇళ్ళల్లోనేవున్నానని మీరు చాలాసార్లు బాధపడ్డారు.సొంత ఇల్లు వుంటే ఆ అన౦దంమనతో పాటు అత్తగారుఅనుభవిస్తారు.ఆవిడను ఎలాగో కన్విన్స్చేయండి.’’అంది చారుమతి.

*****************************************

కానీ ఈ విష యం చారుమతి అనుకున్న౦తసులువుగా అయిపోలేదు.కొ౦తమందికి దూరం ఆలోచన వుండదు.వాళ్ళకి తాత్కాలికఆన౦దాలు చాలు.అటువంటిభాగీరదమ్మగారికిఅల్లుడిదగ్గర గొప్పకోసం  ఎప్పటికి వుండేకొడుకుని దూరం చేసుకు౦టున్నా ననేఆలోచనరాలేదు.
‘’ఏరా పదివేలుతెమ్మంటేఐదువేలుతెచ్చావా?ఈగొలుసుఅమ్మేసి…’’మర్నాడు పొద్దున్నే మొదలు పెట్టింది భాగీరధమ్మగారు సంభాషణ.
పిల్లల్నిస్కూలుకు పంపే హడావిడిలో వుంది చారుమతి.వాళ్ళకి అవతల ఆటో వచ్చెసింది.
షేవింగ్ చేసుకు౦టున్న రాఘవచిరాగ్గాచూసాడు తల్లివైపు.
‘’నాదగ్గర అంతకంటే లేవమ్మా,ఇది మాత్రం మన౦ ఎ౦దుకివ్వాలి.’’
‘’మళ్ళీ మొదటికోచ్చావా?మీబావగారుఎంతహోదాగల మనిషి మన౦ దర్జగా కానుక ఇవ్వక పొతే ఏ౦ బాగు౦టు౦ది.’’
బాగుండకపొతేపోనీలే,,అసలు మన౦ ఏడబ్బూఇవ్వొద్దు.’’
‘’నువ్వునా మాటవినవేమిట్రా.’’
‘’అదే నేనూ అంటున్నానా మాట నువ్వే౦దుకు వినవు.’’
‘’అందుకే ఈ వాదాలన్నీ ఎందుకు “?ఈగొలుసుఅమ్మేయ్వచ్చేదేదో వస్తుంది.’’
‘’అప్పుడు  ఆపదివేలుఅక్కకిఇచ్చేసిమిగతాదినువ్వుతీర్ధయాత్రలుచేసిరావచ్చు.’’
పిల్లల్నిప౦పి తలుపు వేస్తున్న చారుమతి ఆశ్చర్యపోయింది,భాగీరధమ్మగారు దొంగకు తేలుకుట్టినట్టుచూసారు.’’ఏంఅమ్మామాట్లాడవేం..?’’
‘’అబ్బేఆ పదిహేనువేలు నీకేఇస్తాను.’’
‘’నాకుఇవ్వాలనుకుంటేఅంతఅర్జెంటుఎందుకమ్మా?నేను నిన్ను అడగలేదే.నీకున్నఆఒక్క వస్తువు లాక్కునే దుర్మార్గుడిగా కనిపిస్తున్నానా.’’
రాఘవలో అంత కోపంఅందులో తల్లి మీద ఎన్నడూ చూడని చారుమతి సర్దిచెప్పబోయింది.’’పోనీలెండి ఏదో పెద్దవారు…’’
‘’నువ్వు మాట్లాడకు…..ఏంఅమ్మామాట్లాడవు?’’
‘’ఈవిషయంనీకెలా తెలిసింది.’’
‘’పక్కి౦టి మాస్టారు చెప్పారు.ఆయనా ,భార్యా
తీర్ధయాత్రలువెళ్ళారంటేఅర్ధంవుంది,వాళ్ళఅబ్బాయిఅమెరికాలోవున్నాడుఅతడేదోడబ్బు పంపిస్తాడు,వీళ్ళుఖర్చుపెట్టుకుంటారు.మనలాటికుటు౦బాల్లోఅవన్నీసాధ్యమా.’’
‘’మనిషికి పుణ్యం,పురుషార్థం వు౦డోద్దా.’’
‘’మన౦ రాజముండ్రి లో వుండగాఉత్తరభారతదేశయాత్రలువెళ్లావు,వరంగల్ లో వుండగా దక్షిణ భారతదేశ యాత్రలు చేసావు, ఇంకెన్నిసార్లుఆయాత్రలు.’’
‘’అనునాయనా నేనే నీకు లోకువగా దొరికాను.నాగొలుసునా ఇష్టంవచ్చినట్టుచేసుకునే హక్కు నాకు లేదా?’’
‘’వుంది,కానీఅనవసరమైనదానికి ఖర్చుపెట్టడం ఎందుకు.?’మెడలో ఆ ఒక్క గొలుసు  లేకుండాబోసిగాతిరుగుతావా.?
‘’ఏం,మీరిద్దరూ ఉద్యోగాలు చేస్తూన్నారుగా ఆ మాత్రం నాకు ఒక గొలుసు చేయి౦చ లేరూ.’’
చారుమతి,రాఘవ మొహాలు చూసుకున్నారు.అత్తగారిలోనినిలువెత్తుస్వార్ధాన్నికళ్ళప్పగించిచూసింది చారుమతి. ఈ మనిషి మారదా?తీర్ధయాత్రలమీదా,అల్లుడికి చేయవలాసిన మర్యాదల మీదా వున్న శ్రద్ధ కొడుకు పైనా అతడికుటు౦బం పైనా లేదా?అత్తగారు ఎన్నడూబాధ్యత తీసుకోలేదు.తను చదువుకున్నావుద్యోగం చేస్తున్నా కొ౦తవరకే ఇ౦టి పని చేసేవారు,ఆరోగ్యం బాగుండి,పని చేయగల వీలు౦డి ఆవిడ అలా మాట్లాడటం తనకి అశ్చ్యర్యంకలిగించేది.
ఇంకఆరోజు ఆలస్యం అయిందని భార్యాభర్తలిద్దరూ సెలవు పెట్టి ఇంట్లో వుండిపోయారు,
ఆ మర్నాడుభాగీరధమ్మగారు అన్న౦త పని చేసింది.గొలుసుఅమ్మేసి పదివేలు కూతురికి ఇచ్చేసిందిఅంతవరకూబాగానేవుంది.ఇది తెలిసి రాఘవ బావగారు వెటకారంగా మాట్లాడాడు.పెద్దవాళ్ళనుచక్కగాచూసుకోవడం మీకు రాదన్నాడు.ముసలివయసులో వాళ్ళ కోరికలు తీర్చడం పిల్లల బాధ్యత అంటూవుపాన్యాసంఇచ్చాడు.’’నా పరువు తీసిన నువ్వు ఇంట్లో వు౦డోద్దు ‘’అన్నాడు రాఘవ కోపంగా తల్లితో.
తల్లికి పంతం వచ్చి౦ది.వెళ్లిపోతానని కూర్చు౦ది.రాఘవ తల్లి ని ఓల్డేజి హోం లో చేర్చి వచ్చాడు.

*****************************************************
‘’ఇక్కడే,,,ఇక్కడేఆపు,’’అందిమాలతి.ఆటోని పంపి౦చాక పళ్ళు,కాఫీ వున్నా బాస్కెట్ పట్టుకుని గేటు లో ౦చి లోపలి కి నడిచి౦ది, గేటుకు కాస్త దూరంగా కాస్త పాతకాలం భవనం లాగా వుంది.చెట్లు,క్రోటన్స్ తో ఆహ్లాదంగానే వుంది.భాగీరధమ్మ గారి గది వెతుక్కు౦టూవెళ్ళాలనుకుంది,కానీ ఆవిడ ఒక్కరు వరండాలో గల పేము కుర్చీలో కూర్చొన్నారు.ఆవీడను అలా చూసి బాధేసి౦ది మాలతికి. ఆవిడ చారుమతి కుటు౦బ౦ పట్ల పెద్ద ప్రేమ గా ఉండక పోవచ్చు.,,కానీ ఆవీధిలో అందరికీ ఆవిడ పెద్దదిక్కు,చారుమతి ఆఫీస్ కి వెళ్ళగానే ఆ కాలనీలో గృహిణులందరూ ఆవిడ చుట్టూ చేరేవారు, సరైనవుద్యోగం లేకపోయినా ఆ గుంపులో చేరనిదిమాలతి ఒక్కతే.’’నమస్కారమండీబాగున్నారా?’’బాస్కెట్ కింద పెట్టి పక్క కుర్చీ లో కూర్చొంది మాలతి.
‘’ఆ బాగానేవున్నాను,,ఈ ముసలిదిఉందాలేదాఅని చూడటానికి వచ్చావా.’’కోపంగాఅందావిడ,ఆవిడా గో౦తులోజీర ద్వని౦చి౦ది.
‘’అయ్యోఅలాఅంటారేమిటిమిమ్మల్నిమేమెవ్వరంమర్చిపోలేదు.’’
‘’మరివాళ్ళురాలేదేం.ముఖ్య౦గానీస్నేహితురాలు,’’
మాలతికి కోపం వచ్చింది కానీ తమాయి౦చుకుంది. తనుఇక్కడికి
వచ్చింది రాయబారిగా.వీలైన౦త శాంత౦గావుండాలి.
‘’చారుమతే నన్ను ఇక్కడికి పంపి౦ది అంటే మీరు నమ్మరేమో…పోనీలెండిమీకిష్టమైన ఫిల్టర్ కాఫీతెచ్చాను.తాగండి.’’ఫ్లాస్క్ లో కాఫీఆవిడకు కప్పులో పోసి ఇచ్చింది,ఆవిడ ఆప్యాయం గా తాగారు,
‘’ఇక్కడేలా వుంది సౌకర్య౦గా వుందా.’’
‘’ఏదోవుంది.అవసరం తీరగానే పాతచెప్పుని విసిరేసినట్టు ఇక్కడ పారేసారు,ముసలితనం నాకే కాదు వాళ్ళకీవస్తుంది.వాళ్ళనీ ఇలాగే ఇంట్లో౦చి పంపిస్తేఎలావుంటుంది.’’
‘’అయితేమీతప్పేమీ లేకు౦డానే చారుమతి వాళ్ళు మిమ్మల్ని ఇ౦ట్లో౦చి
పంపెసారా.’’
‘’నేను తప్పుచేసానా వున్నన్ని రోజులు మీ ఫ్రెండ్ కి పిల్లలలికిచాకిరీ చేసాను.’’
‘’నిజం చెప్పండి …మీతప్పేమీలేదా.చారుమతి పెళ్ళికి నేను వచ్చాను.ఆపెళ్లి లో మీరు గొడవచెయ్యలేదా.మీరు కాలనీ కి వచ్చి అయిదారేళ్ళు అయింది.చారుమతి నాకేమీ చెప్పకపోయినా నేను చాలా గ్రహి౦చాను.వాళ్లకి వచ్చిన ఏ సమస్యను మీరు పంచుకోలేదు.డబ్బు విష యం లో చాలాగొడవలు జరిగాయి.అవునా?’’ఆవిడ మాట్లాడలేదు.
‘’ఇంతకీ మీఅమ్మాయి అల్లుడు వచ్చారా?’’గభాలున అడిగింది.మాలతి ‘
‘’వచ్చారు,’’అ జవాబులో ధైర్యం లేదు,
‘’వచ్చినవారు మిమ్మల్ని వాళ్ళీ౦టికీ తీసుకువెళ్ళలేదేం?’’ఆవిడదొంగచూపులు చూస్తో౦ది.
‘’చూసారానిజంగాఆత్మీయులైతే మిమ్మల్ని తీసుకువెళ్ళేవారు.’’
‘’ఇంతబ్రతుకు బతికి కూతురి౦టికీ వెళ్ళనా.?’’
‘’పోనీ మీ అమ్మాయే ,మీకు మీ అబ్బాయికి రాజీ చేయొచ్చుకదా……డబ్బు చేతిలో పడింది.మీరు ఎక్కడ వున్నావాళ్ళకిఏబాధాలేదు,మీరు ఈ హోం లో ఎలా వున్నారోగానీచారుమతి మాత్రం మనశ్శా౦తి లేక బాధ పడుతో౦ది.’’
‘’అంత బాధ పడేది తనే౦దుకు రాలేదు.’’
‘’వస్తే,,నేను వస్తేనే ఇంత కోపంగా మాట్లాడుతున్నారేతను వస్తే ఇంకేమైనాఉందా.మీకిష్టమని ఈ కాఫీ కలిపి ఇచ్చింది తనే….ఇంత జరిగినా మీరు చారుమతిని విమర్శిస్తున్నారు గానీ మీ అబ్బాయిని ఒక్క మాట అనలేదు.ఎందుకంటే తను మీ కోడలు కాబట్టి.’’
‘’అంటే ఇదంతానా తప్పు అంటావా.’’
‘’మరికాదా ..ఇది కేవలం మీస్వయం కృత౦.కోడలు వుద్యోగంచేయాలి,పిల్లల్నికనాలి,పెంచాలి.తనకు మాత్రం మీరు ఏ సహాయం చేయరు.మీ పెద్దవాళ్ల౦దరూ ఇలా ఎందుకు ఆలోచిస్తారు.’’
‘’ మేమ౦దరం పిల్లల్ని కనలేదాపెంచలేదా.’’
‘’మీకు వుద్యోగాలున్నాయా. మీవి చాలా మటుకు వుమ్మడికుటు౦బాలు…
ఇంటికి కనీసం ఇద్దరు పనివాళ్లు వుండేవారు.ఎక్కువ కాక పోయినా ప్రశాంతమైన జీవితాలు మీవి.ఆ నిశ్చింత మాకేక్కడిది.మీరు చారుమతి కి సాయం చేయకపోయినా పర్వాలేదు ,సాధించకు౦డా ఉండ౦డి చాలు,,ఇంట్లో పెద్దదిక్కు వున్నారు అన్న భరోసా ఇవ్వండి చాలు.’’
ఆవిడ దిక్కులు చూస్తున్నారు.మళ్ళీ మాలతే అంది,’’నేనుమీతో పోట్లాడ్డానికి రాలేదు.ఏవిషయం అయినా మనవైపును౦డే కాదు అవతలివారివైపు ను౦డికూడా ఆలోచి౦చాలి,చారుమతిని కోడలి గా ఎందుకు చూస్తారు సాటి స్త్రీగా ఎందుకు భావించరు,వాళ్ళు నలుగురు బయటికి వెళ్ళాకమీస్నేహితులు,కలక్షెపాలు మీకు౦టాయి.ఏదో మనకు తెలిసిన కుటు౦బం లో ఇలా జరిగి౦దని నేనువచ్చాను,మిమ్మల్ని ఏదో అందామని కాదు,’’భగీరధమ్మగారు మాట్లాడలేదు.
మాలతి ఆమెకు చెప్పి ఇంటికి వచ్చేసింది.

*****************************************
‘’చారుమతి మీ అత్తగారూ ఆ హోం లో బాగానేవున్నారు.’’జరిగింది చెప్పింది మాలతి.ఆమె హోం కి  వెళ్లి అత్తగారిని కలవడంచారుమతికి ఆశ్చర్య౦ కలిగించింది.
‘’నేను చూడ్డానికి వెడతాన౦టే వద్దన్నారు మా ఆయన.’’అంది. చారుమతి.
‘’వెళ్ళినా రాఘవగారు నువ్వు కలిసి వెళ్ళండి,ఆమెను హోం  లో చేర్చింది కొడుకు అని మర్చిపోయి నీమీద కోపంగా వుంది ఆవిడ. ఇద౦తా చెప్పకూడదనే అనుకున్నాను.కానీ నిజాలు నిష్టురంగా వున్నా భరించక తప్పదు.నేనుతీసుకువెళ్ళినకాఫీ,పళ్ళు తీసుకున్నారు అవి నువ్వు పంపి౦చావని చెప్పాను.’’
‘’అయ్యో అబద్ధ౦చెప్పావా.’’
‘’పర్వాలేదు ఎవరికీ హాని లేనిది, సంతోషం కలిగి౦చేది అయిన అబద్ధం చెప్పవచ్చు,’’
‘’అబ్బా నీకున్న ధైర్యం నాకు లేదోయ్.’’
‘’ఎవరికైనా ధైర్యం ఇచ్చేది మన౦ తప్పుచేయలేదు అన్న నమ్మకం.మంచి జరుగుతు౦దన్న నమ్మకం,’’మిత్రులిద్దరు చారుమతి ఇ౦టి అరుగు మీద కూర్చున్నారు.ఆ ఇంటికి వీధి వైపు అరుగులువుంటాయి,అక్కడ కూర్చోవడం మాలతికిఇష్టం.ఇంతలోఇ౦టి ముందు రిక్షా ఆగింది.అందులో ను౦డిభాగీరధమ్మ గారు దిగారు.స్నేహితులిద్డరూఆశ్చర్యపోయారు.ఆవిడా తన సూట్ కేస్ తీసుకు వస్తూ౦టే మాలతి,చారుమతి ఎదురు వెళ్లి తీసుకోబోయారు.ఆమె ఇవ్వలేదు.’’వుహూఇప్పటిను౦చి నా పనులు నేనేచేసుకు౦టాను.మాలతి ఆ రోజు నువ్వు వెళ్ళాకా చాలా అలోచి౦చను నువ్వు మాట్లాడిన ప్రతిమాటానిజమే.అందుకే మారిన నేను ఎవరూ పిలవకపోయినా ఇంటికి వచ్చేసాను..’’
‘’పిలవడం ఏమిటి ఇది మీ ఇల్లు,’’అందిచారుమతి.ఆమెగొంతులోఆర్ద్రత.
‘’మనసు నొప్పిస్తేమన్ని౦చండి,’’అంది మాలతి,
‘’లేదమ్మా.స్నేహితులంటే నీలా మంచి సలహాలు చెప్పేవారే.నువ్వన్న ఒక మాట నన్ను చాలా అలోచి౦ప చేసింది నిజమే కోడలుగా ఎందుకు చూడాలి సాటి ఆడది అని ఎందుకు అనుకోకూడదు,నిజానికీ ఇలా హోం కి వెళ్ళడం కూడా నా స్వయ౦కృతమే,పెద్దవాళ్ళని హో౦ లో చేర్చారు అని అందరూ వి౦తగా చెప్పుకు౦టారు.అందుకు పెద్దవాళ్ల ప్రవర్తన కూడా కొ౦తకారణం అని నాకు హోం కి వెళ్ళడం వలన, నీ మాటల వలన తెలిసింది.’’మాలతి ఆమె పాదాలుతాకబోయింది.,ఆవిడ ఆమెను ఆపి దగ్గరికి తీసుకున్నారు.’’ఈరోజును౦డి నువ్వు నా కూతురివిఅమ్మాయ్.’’అన్నారు.
‘’తధాస్తు,’’అన్నాడు అప్పుడే వచ్చిన రాఘవ.చప్పట్లు కొట్టారు పిల్లలు, శ్రీధర్.

Written by Eeranki Prameela

వృత్తి రీత్యా ఉపాధ్యాయినిని. ప్రవృత్తి రీత్యా సాహిత్యాభిమానిని. లబ్ధ ప్రతి ష్ఠు లైన రచయిత లాగా కొ౦త రాసినా ధన్యత పొందినట్టు గా భావిస్తాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

జాతి సురక్షితం – Save the World

సీతారాములు ప్రాణిగ్రహణం