ఓ స్వాతి కథ

కథ

లలితాచండి న్యాయవాది /రచయిత్రి

ఫోన్ రింగ్ అయ్యేటప్పటికి
“హలో” అన్నాడు రామనాధం అవతలి నుండి.
“నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకొని వెళ్లు ” అన్న కూతురు స్వాతి మాటకు అలాగే నంటూ పోన్ పెట్టి ఆలోచనలో పడ్డాడు.

స్వాతి, నీరజ్ ల పెళ్లి అయి మూడు వారాలు అయింది. వున్నట్లుండి ఈఫోన్ కాల్ ఏమైవుంటుందబ్బా?
అనుకుంటూ బయలు దేరాడు కూతురి అత్తాగారింటికి వెళ్ళేటప్పటికి రెడిగా వున్నా కూతుర్ని, ఆమె మోహంలోని భావనను గ్రహించి నాలుగు రోజులు తీసుకు వెడతాను అని వియ్యంకుడికి చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు.
రాగానే కూతురు ” నాన్న వాళ్లు అబద్ధం ఆడారు నాన్నా “అంటూ తండ్రి ఒళ్ళో తలదూర్చి ఒక్కసారిగా బావురమంది.
స్వాతి తల నిమురుతూ మౌనం గానే ఒదార్చాడు రామనాధం కాస్త దుఃఖం ఉపశమించాక నాన్నా వాళ్లు అబద్ధం ఆడారు అతనికి అన్నీ అలవాట్లు వున్నాయి. అది తెలిసి తట్టుకోలేక పోతున్నా అంటూ మరోసారి వెక్కి వెక్కి ఏడ్చింది.
స్వాతి కడిగిన ముత్యంలా కళకళ లాడుతూ వుంటుంది . సన్నగా పొడుగ్గా చూడచక్కని రూపం మంచి నడవడిక కలిగిన అమ్మాయి .విద్యా వంతురాలు కార్పొరేట్ కంపెనిలో పెద్ద ఉద్యోగం పైగా మంచి జీతం కూడా,

స్వాతి వాళ్ళది మధ్య తరగతి కుటుంబం తల్లితండ్రులైన రామనాధం సుశీలకు ఇద్దరు సంతానం
స్వాతి మరియు శేఖర్ ఇద్దరూ.
ప్రేమాభిమానలతో మంచి విలువలతో పెరిగారు. స్వాతికి సంబంధాలు చూస్తూన్నారు , ఆన్లైన్ లో మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించారు. రిక్వైర్ మెట్స్ లో నాన్ వెజ్, మధ్యపానము స్మోకింగ్ నిషిద్దం అని..అండర్లైన్ కూడా చేసారు.
చివరకి ఓ అమెరికా సంబంధం అన్నిరకాలుగా సరిపడిందనుకొని కుదుర్చుకున్నారు నిశ్చితార్థం జరిగిన వారం తిరక్కుండా పెళ్లి కూడా జరిగింది.
ఆడపెళ్ళివాళ్లు పెద్ద కళ్యాణ మండపం బుక్ చేసి పెళ్లి ఘనంగా చేసారు. పెళ్లి కాగానే అందరిలా స్వాతి అత్తగారింటికి వెళ్లింది.
మొదటి మూడు రోజులు బాగానే గడిచాయి నాలుగో రోజు పెళ్లి కొడుకు నీరజ్ ఫ్రెండ్స్ ఇచ్చే పార్టీకి
స్వాతిని తీసుకొని వెళ్లాడు. అక్కడ నీరజ్ నాన్ వెజ్ తినడం, స్మోక్ చేస్తూ డ్రింక్ చెయ్యడం చూసి తట్టుకోలేక పోయింది. వాళ్ళతో సరదాగా గడపలేక పోయింది.
ఇంటికి రాగానే అదే అడిగింది స్వాతి “అబద్ధాలు ఎందుకు ఆడారు? మా షరతులు నిబంధనలు ముందే తెలిపాము కదా! అవును చూసామని కూడ అన్నారు “…
“ఇది సహజమేకదా ! నువ్వు ఇంత ప్రాధాన్యత ఇస్తావని అనుకోలేదు”
అంటూ తేల్చేసాడు నీరజ్…
మర్నాడు ఉదయాన మామగారికి,అత్తగారికి ఇదే విషయం తెలిపితే వాళ్లు కొడుకును సమర్ధించారు .
పైగా ” నువ్వు చదవుకున్నా దానివి బయటకు వెళ్లి ఉద్యోగం చేస్తున్నావు ఇవ్వన్ని సొసైటిలో కామన్ కదా! ఎక్కువగా పట్టించుకో కూడదు సద్దుకు పోవాలి” అంటూ తేల్చేసారు .
మారుతారేమో అని మరో మూడు వారాలు తరువాత భర్తను అడిగి చూసింది.
చిన్న నవ్వు నవ్వి” లైట్ తీసుకో డార్లింగ్ జాబ్ చేస్తున్నావు కదా! ఆమాత్రం ఎడ్జ్ స్ట్ కాలేవా?” అన్నాడు.
తన అభిరుచికి ఇక సరిపడదని అర్ధము చేసుకొని తండ్రి ఫోన్ చేసింది.
విషయం మంతా విన్న రామనాథం కూతురిని ఓదార్చాడు.
“ఏం చేద్దాం చెప్పుతల్లీ”
” అతనితో కలిసి బ్రతకటం కష్టం నాన్న రోజు తనకు నచ్చినవి వండిపెట్టలేను, తినలేను తనతో కలిసి హోటల్ కు వెళ్లలేను తను స్మోక్ చేస్తుంటే వూరుకోలేను అందరిలా ఎలా వుండటం “
సర్దుకు పోవటం అంటే ఎదుటివారికి నచ్చినట్లు వుంటూ బాధపడుతూ వుండటమేనా?
నా అభిరుచులను ఇష్టాలను చంపుకోవడమా ?
రేపు పిల్లలు పుట్టాక వాళ్ల భవిష్యత్తు కోసం నాజీవితం అంతా రాజీ పడడమేనే?…..
కొన్ని నిర్ణయాలు వెంటనే తీసుకంటేనే మంచిదని నా అభిప్రాయం నాన్న ” అంటూ తన నిర్ణయం తెలిపింది…….
“రేపు వెళ్ళి వాళ్ళ తో మాట్లాడదాం” .అన్నాడు సాలోచనంగా రామనాథం.
స్వాతికి శాఖాహారం చిన్నప్పటీ నుండి అలవాటు ఇష్టం.
జీవితమంతా ఆఅలవాటు లేని వ్వక్తితో కలసి బ్రతకటం ఎంత కష్టం
జీవితం చాలా చిన్నది ఉన్నలో ఉన్నంత సంతోషంగా ప్రశాంతంగా బ్రతకాలి, సమస్యలు వుంటే సామరస్యంగా వెంటనే పరిష్కారించుకోవాలి,కాని ఎప్పుడో ఎవరోమారుతారని ఎదురుచూస్తూ నిత్యం గొడవలతో జీవించడం స్వాతికి అసలు ఇష్టం లేదు.
అదే తండ్రికి చెప్పింది .
“నాన్న…నా నిర్ణయం ఆలోచించి తీసుకున్నదే ఇక అతనితో కలిసి నేను జీవించలేను” అంది స్వాతి
రామనాథం కూతురి నిర్ణయంపై నమ్మకం వుంది పై పెచ్చు సర్దుకుపో అని చెప్పే మనస్తత్వం అంతకన్నా కాదు. నిత్య జీవితంలో భార్యాభర్తల నడుమ ఆహార అలవాట్లలో తేడా వుంటే అది నిత్యం వేధించే సమస్యే ! తనకూ నచ్చదు …
“అలాగే స్వాతి రేపు వెళ్లి అడిగి చూద్దాం లేకుంటే నువ్వు చెప్పినట్లు డివోర్స్ కు వెడదాం” అన్నాడు రామనాధం.
మర్నాడు ఇద్దరూ వెళ్ళి మాట్లాడటం వాళ్లు వెంటనే సరే అనటం జరిగింది. పెళ్ళికి అయిన ఖర్చులే కాదు ఇంకో పది లక్షలు ఎక్కవ ఇస్తామని అన్నారు.
దానికి ఆభిమానం దెబ్బతిన్న రామనాధం “మీరు ఆడిన అబద్ధానికి పరిహారం ఇస్తున్నారా? లేక నా కూతురు శీలానికి వెల కడుతున్నారా ?”
మాకు ఒక్కరూపాయి కూడా ఎక్కువ వద్దు మాఖర్చులు మాకు ఇస్తే చాలు అంటూ బాధపడ్డాడు.
పదినెలలు తిరక్కుండా విడాకులు వచ్చాయి. ఒక్క అబద్దం ఓ నిండు జీవితానికి ఎంత వేదనను ఇచ్చిందో,
ఒక్కప్పుడు వంద అబద్ధాలు ఆడైనా పెళ్లి చెయ్యమన్నారు.
నేడు అదే అబద్ధం జీవితాలను విడతీసింది మార్పు కాలంలోనా మనుషలనలోనా?
స్వాతి తీసుకున్న నిర్ణయం రేపు ఆమె జీవితాన్ని ఎటు నడిపిస్తుదో అనుకున్నాడు రామనాధం.

Written by Lalitha Chandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనసు తెలుసు

నా కాలు