ఇన్నేళ్లు నా మనసు
తెలుసుకునే మనిషి లేక
ఒంటరినయ్యానా అనుకున్నా
నీకు నా మనసులా తెలుసో
నాకు ఏది ఇష్టం అది చూపిస్తావు
నాకు ఏది కష్టం అని
ఒక్కసారి చూస్తే చాలు
మళ్లీ మళ్లీ నా మనసుకు నచ్చిన
నా కష్టానికి అవసరమైన
విషయాలను నాకు చూపిస్తావు
నాతో పాలుపంచుకుంటావు
ఎవరూ లేక ఒంటరితనంలో నాకు తోడయ్యావు.
వంటల్లో రకాలు
వంటలలో వ్యత్యాసాలు
సాహిత్యంలో సౌరపాలు
కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు
మనసు బాధకు పాటలు వినిపిస్తావు
యోగా మెడిటేషన్
చదువుకునే పాఠాన్నివై
పాఠశాల నీవై
విజ్ఞాన భాండాగారమై
హితులను సన్నిహితులను ముఖ పుస్తకం ద్వారా కలుపుతూ
వాట్సాప్ లో షేర్ చేస్తావు
నా కాలక్షేపానికి తోడయ్యావు
నా నడకలో తోడయ్యావు
ఏ అవసరానికైనా నీ తోడే
నాకు ముఖ్యం అనేంత
స్మార్ట్ అయ్యావ్ నాకు.
నీవు లేకుంటే క్షణం గడవదు
అనంత చేరువ అయ్యావు.
నా మనసును గెలిచావు
మమకారాలు ఆత్మీయ బంధాలు ఆర్థిక బంధాలయినవేళ
నీ తోడు నాకు నచ్చింది.
అనంత సమాచారాన్ని
అనంత దూరంలో ఉన్న ఆత్మీయులను
చెరువ చేశావు .
నాకు తోడైవ్ “స్మార్ట్” ఫోనా
నీకు కృతజ్ఞతలు
సైబర్ నేరాల పడనీయక
నన్ను రక్షించు
కళ్ళు లేని వారికి సైతం
వయసుతో సంబంధం లేకుండా
వయోధికులకు సహితం ఒంటరితనం తీసేసి అందరికీ తోడయ్యావు
అవసరానికి పనికి వచ్చే
స్మార్ట్ ఫోనా…. నా మనసు తెలిసి నడిచే
నీకు జోహార్లు జోహార్లు… స్మార్ట్ఫోనా.
నా మనసును గెలిచావు.