మన అందరికీ తెలుసు ఋతువుల మార్పు వలన వాతావరణం లో వచ్చే గుణ దోషాలకు అనుగుణంగా మనమే ఆచారాలను సంప్రదా యాలను ఏర్పరుచుకున్నామని! చైత్ర వైశాఖ మాసాలను వసంత రుతువు గా నిర్ణయించుకొని నెలలో మొదటి రోజైన చైత్ర శుద్ధపాడ్యమి మినాడు కొత్త సంవత్సరం ప్రారంభంగా నిర్ణయించుకుని ఉగాది పేరిట పండుగను జరుపుకుంటాము.60 పేర్లతో ఏర్పరచుకున్న సంవత్సరాల లో ఈ సంవత్సరం ‘క్రోధి’ అనే పేరుతో వస్తుందని ముందే తెలుసు. ప్రకృతి శోభకు మనిషి ఆలోచన తోడై మహోత్సవాలుగా జరుపుకుంటాం. లోలోపల ఉన్న అంతర్గత ఆరు శత్రువులను చేయించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనే అంతఃశత్రువులను జయించాలని, పెద్దలు చెప్పిన విషయాలకు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని కొందరు చాలా శ్రద్ధగా పాటిస్తూనే ఉంటారు. పాటించని వాళ్లకొరకు గుర్తు చేసుకుంటూ మళ్లీ మళ్లీ
ఇలాంటివి చదువుకుంటుంటాం. ఆరు రుతువులు, ఆరు రుచులు ఒకసారి తలుచుకుంటాం నిజమే కానీ నిత్యం ఆచరించేప్పుడు వీటికి దూరంగా ఉండగలుగుతున్నామా వీటితో కలిసి నడుస్తున్నామా,వీటిలోని మంచి ఎంత చెడు ఎంత అనే వివేచన చేసుకుంటూ సాగాలి.కుటుంబంలోని మనుషులందరికీ… పిల్లాజెల్లా అందరూ అర్థం చేసుకునే లాగా ప్రయత్నాలు కూడా చేయాలి.
ఉగాది పచ్చడిలోని ఆరు పదార్థాలలో నిబిడీకృతమై ఉన్న గుణాలను సరిగ్గా అర్థం చేసుకున్నామా సరిగ్గా పిల్లలు పాటించేలా చేయిస్తున్నామా అనే ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. శాస్త్రీయంగా సైంటిఫిక్ గా ఎందుకు ఈ పదార్థాలను తీసుకుంటున్నాము అనే అవగాహన పెద్ద వాళ్లకు ఉంటే ఆటోమేటిక్ గా పిల్లలకు అందుతుంది. భక్తి భయాన్ని కలిగించదు భారం అనిపించదు ఇష్టంగా, గౌరవంగా పూజ చేసే అలవాటు పెద్దలకు ఉంటే అలవోకగా అందరూ పాటిస్తారు. అందుకే మనం ఆచరిస్తున్న పద్ధతులను గురించి చులకనగా మాట్లాడడం పనిచేస్తునంతసేపు విసుక్కోవడం
పక్కింటి వాళ్ళను ఎదురింటి వాళ్లను పోలుస్తూ విమర్శ చేయడం, చుట్టాలనీ బంధువులని గ్రహస్తులని కించపరిచినట్టు మాట్లాడడం వంటివి ఎవరైతే చేస్తారో వాళ్ళ సంతానం అవే నేర్చుకుంటారు. తెలియక, వాళ్ళు గమనిస్తారని అనుకోక, మాట్లాడితే పర్యవసానం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించాలి. వాళ్లు పెరిగి ,ఎదురు తిరిగితే ఆశ్చర్య పోవడం తల్లిదండ్రుల వంతు అవుతుంది,తాతా నానమ్మల వంతవుతుంది,తాత అమ్మమ్మల వంతు అవుతుంది.
గతం గతః అంటారు కానీ గతం ఎప్పుడూ మన వెంటే నడుస్తుంది. పోనీయండి ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే లాభం లేదు కాబట్టి కనీసం ఇకనైనా …ఇకనైనా …ఇకనైనా ..మేల్కొని మాట్లాడేప్పుడు, లో ప్రవర్తించేప్పుడు ఆత్మ విమర్శ చేసుకుంటూ బ్రతకాలి. అప్పుడే కొత్త సంవత్సర ఉగాది పండుగకు అర్థం పరమార్థం తెలుస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం లేదు.
క్రోధి అంటే అర్ధాన్ని బట్టి చూసి ఇదంతా ఏంటో వ్ణఎలా అనిూ, ఈ ఏడాదింతా ఎలా గడుస్తుంది అని చింతిస్తూ కూర్చునే బదులు. ఈ క్రోధిని తమ ఆలోచనల వైపు తిప్పుకున్నప్పడే విజయం సాధించిన వాళ్ళం అవుతాం. మనుషుల మధ్య కోపపతాపాలు పోవాలని ఏడాది ఇది ఒక పాజిటివ్ దృక్పథంతో ఆలోచించుకొని తగిన విధంగా ముందు జాగ్రత్తగా సాగాలి అందుకే ఇవన్నీ ఏర్పరిచారు పెద్దలు . ఇవే మనుషుల లోని మంచిచెడులను బహిర్గతం అయ్యేటట్లు చేస్తాయి.ఎదుటి వాళ్లకు కోపం రాకుండా ఉండేలా ప్రయత్నించడం తనంతట తాను కోపంగా మాట్లాడకుండా ఉండడం ఇతరులకు హాని చేయకుండా వంటివన్నీ కూడా ఈ పేరు తోటే ముడిపడి ఉన్నాయి ఇది అర్థం చేసుకుంటే సాఫీగా సాగుతుంది .