నీ పుట్టుకే ఒక ఉగాది
చిగురించడం మొదలుపెట్టింది జీవితపు పునాది,
నీలో వచ్చాయి షడ్రుతువుల లాంటి షడ్ లక్షణాలు..
షడ్రుచులు లాంటి అభిరుచులు,….
రూపులేని రేపు కొరకు ఆశల తలంపులు,….
కాల గమనంలో మరో మజిలీకి ప్రయాణం……
వస్తోంది…ఉగాది…
ప్రకృతి మాతను వెంటపెట్టుకొని….
మోక్కా..మెటిక కొత్త చిగురు ధరించి ముస్తాబై ఆహ్వానం పలుకు తున్నాయి…..నవ శకానికి నాంది పలుకుతూ..
అలాగే నీ పుట్టుకకు ఆనందిస్తూ నీ వాళ్లు ఎదురు చూస్తుంటారు…
నవ పల్లవాలు తిన్న కోయిల మత్తెక్కి కూ కూ… అంటూ కమ్మని రాగాలు పలుకుతూ ఉగాది పురుషునికి ఉల్లాసం కలిగిస్తోంది……
లాలి పాటలు పాడుతూ నిన్ను సుఖాల ముంచుతారు… నీవాళ్లు
పిల్లల తల్లి వలె చెట్లన్ని పువ్వులతో,లేత పిందెలతో నిండి యుగపురుషుడికి ఆహ్వానం పలకాలని ఉవీళ్ళూరుతున్నాయి…
అలాగే మీ వాళ్ళు నీకు అన్ని అమర్చాలని ఏ లోటు ఉండకూడదని ఆరాటపడతారు….
కానీ మిగతా ఋతువులకు వసంతాన్ని చూచి అసూయ ప
డతాయి….తామెక్కడ ఉనికిని కోల్పోతామో నని…….,…
ఎదుగుదల చూసి ఓర్వలేని వారు చెడు మార్గంలో పెడతారేమోనని భయంతో….
నిన్ను సరి అయిన మార్గంలో పెట్టడానికి తహతలాడుతారు నీవాళ్లు…
కానీ మిగతా ఋతువులకు తెలియదు ముందుది స్థానభ్రంశమైతే…..తర్వాత తన వంతేఅని….. అప్పుడు తమ ప్రతిభకనపడుతుందని …..
కానీ నీవు పట్టుదలతో పైకి ఎదిగి
ఎనలేని సంతోషాన్ని కుమ్మరిస్తావ్
యుక్త వయస్సు వచ్చింది … జీవితపు మలుపులు చూపడానికి….
ప్రకృతి మాతకే తప్పలేదు ఒడిదుడుకులకు తలవంచడం…
నీ ఎదుగుదలలో మరో దశ ప్రారంభమైంది……
ఇకనుంచి నీ జీవితం అంతా ఒడిదుడుకుల వంకర బాట
మానవ జీవితం ఇంతే అని తెలుసుకుంటావు ……
కష్ట సుఖాల కావడికుండల మోతని ….
షడ్ వికారాల సమ్మేళనమని ……
కానీ నిరాశ చెందకు ……..
షడ్ గుణాలను ప్రోదిచేసుకుని ……
నవరసాలను పండిస్తూ……..
జీవిత మాధుర్యాన్ని జుర్రుకుంటూ….
అందరితో కూడి ఒక్కడివై…..
సాక్షిగా చూస్తూ స్థితప్రజ్ఞుతతో నిలవడమే…..
ఉగాది పండగ నీకు నేర్పే పాఠం…