పల్లవి || కుహూ కుహూ యని కోయిల పాడే..
ఆహా ఆహా యని మది పులకించే ..
కుహూ కుహూ యని కోయిల పాడే ..
ఓహో ఓహో యని మనసేమో మురిసే .. ||కుహూ ||
చరణం|| తొలి చిగురులతో .. కొమ్మలు రెమ్మలు
వసంత గీతికి.. డోలలు ఊగే..
నవ చైతన్యమే పల్లవి పాడే.. ||కుహూ ||
చరణం|| చైత్రపు శోభతో.. ప్రకృతి మురియగ..
నవీన సృష్టికి నాంది పలుకుతూ..
ఉగాది సందడి వెల్లివిరిసెనే .. ||కుహూ ||
చరణం|| జీవన సారమే .. ఆరు రుచులుగా
క్రొoగొత్త ఆశల కలబోతలతో..
ఉరకలు వేసే ఉత్సాహముతో.. ||కుహూ ||
చరణం|| పచ్చదనాలు పరీమళాలతో – సంతోషాలు సంబరాలతో
ఉప్పొంగి పొరలే .. కవి హృదయముతో ||2 ||
కొత్త దనాలను స్వాగతించుతూ
కుహూ కుహూ యని కోయిల కూసే ||కుహూ ||