ఉగాది కవితలు

క్రోధి వత్సరమున కోరిక తీర్చవే
సత్ప్రవర్తనంబు సౌఖ్య సంతు
సంపదల నొసగుము సర్వ జనులకును
విద్య వినయ మిమ్ము వేదమాత

క్రొత్త వర్షమొచ్చె క్రొంగొత్త ఆశలు
సకల సంపదలను సౌఖ్యమివ్వు
సర్వలోకమునకు శాంతి నిమ్ము జననీ
కరుణ జూపు మమ్మ కల్పవల్లి

నూత్న వత్సరముననూతనత్వముజూపి
మంచిమనసుతోడమమత పెంచి
విద్యవినయములను విద్యార్థులందున
పెంచి మంచిబాట వేయు మమ్మ

క్రొత్త వత్సరమునక్రొంగొత్త కోరిక
పద్య రచన యందు
ప్రతిభ పెంచు
జ్ఞాన శక్తినిచ్చె జ్ఞాన దాయిని నీవె
దరికి చేర్చి నన్ను దయనుజూపు

క్రోధివత్సరముననను కోరి కలను
తీర్చు కోవలెజనులకు తీపి కబురు
చెప్పె మాటలను వినిపింప జేయు తల్లి
సంత సంబున నొకరి కోసం బొకరుగ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఉగాది నాడు-నేడు

మన మహిళామణులు