నలిగి పోయిన
చిన్న కాగితం
నాకు దొరికినా చాలు
పగిలిన ఒక భావం
దానిపై
కవితగా వెలుగుతుంది!
చిరిగిపోయిన
చిన్న పుస్తకం
నాకు కనబడినా చాలు
చెదిరి పోయిన
ఒక సంఘటన
దానిలో
కథగా రూపుకడుతుంది!
చెత్తకుప్పలో పడేసిన
ఒక కలం
నాకు దొరికినా చాలు
ఉత్తమమైన ఆలోచన
మదిలో మెదిలి
స్వచ్ఛమైన గేయమై
కదులుతుంది!
సాహిత్య ధ్యాసలో
నా శ్వాస
నిరంతర భావమై
చరిస్తుంటుంది
అంతర్మథనంలో
అక్షర జ్వాల రగిలి
ఇలా
కవితగా ప్రజ్వలిస్తుంది !.