శాంతి, శక్తి, చైతన్యమై..

కవిత

బండ అరుణారెడ్డి

ప్రకృతి ప్రతిబింబం స్త్రీతత్వం అయితే
పసికందుల చిదిమే రాక్షసత్వాన్ని చీల్చిచెండాడే
శక్తిని ఇవ్వమ్మ శివానీ…
నవదుర్గా ఇవ్వమ్మా మాకు ధైర్యాన్ని
ఉగ్రం, వీరం నీలోని మేము
లాలిత్యం, మాతృత్వమూ అయినాము.
శరదిందు శుభ్రాం దేవీ… శర్వాణీ…
అనుగ్రహింపు వేదవాణీ.
తమస్సునుండి జ్యోతివైపు
నాదాక్షరమై, జ్ఞానమై
చలనశీలమై, చైతన్యమై
సాధించనీ.. మహిళా సాధికారతను.
వంటింటినుండి అంతరిక్షందాక
మాటలనుండి మౌనందాక
పూజలనుండి ధ్యానం దాక
దుఃఖంనుండి వేద జ్ఞానందాక
లక్ష్మీ.. తేజోరూపిణీ.. జననీ..
ఐశ్వర్యమై, ఆరోగ్యమై, ఆనందమై
అన్నిసంపదలు నీవే అయి
మాలోనిండిపో, మాతో ఉండిపో.
వసుధైకకుటుంబ భావనమై
శాంతి, సంతోష, సంతుష్ట స్నేహితవై
ఇచ్ఛా,క్రియా, జ్ఞాన శక్తులను
సదా కురిపించు అనుగ్రహధారలుగ…

Written by Banda Aruna Reddy

బండ అరుణారెడ్డి
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,
MGKLISP నాగర్కర్నూల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మంచు తుఫాన్ లో బామ్మామనవరాలు!

ధ్యాస