ఒడిదుడుకుల కలబోత
ఉగాది పచ్చడి ఆరు రుచుల కలయిక
తీపి చేదు జ్ఞాపకాల సమ్మేళిత మైన
కష్ట సుఖాల గెలుపోటముల జీవితనౌక
కొనసాగుతూ నవ వసంతాన్ని ఆహ్వానిస్తుంది
అందాల బృందావనాన్ని ముంగిట్లో దించుతుంది
జీవితమంటే అందమైన హరివిల్లులా
పురి విప్పి ఆడే నాట్య మయూరి లా
తెల్లనైనా సన్నజాజి పూల పరిమళం లా
కమ్మనైనా చిలుకమ్మ పలుకు లా
ఉండాలనే తలపులతో చిరు ఆశల కుతూహలం తో
నిండు పున్నమి లోని వెండి వెన్నెల్లో
జల జల పారే సెలయేటి సవ్వల్లో
వినిపించే సప్త స్వర రాగ సుధ ల్లో
నా మనసు తెలియాడే నవ రస భావాల్లో
ఈ జీవితమే రాగ రంజితమవ్వాలని
చైత్ర మాస శుభ వేళ మామిడి చిగురులతో
తీయనైనా కోకిలమ్మ కుహు కుహు రాగాలతో
ప్రకృతమ్మ ఒడిలోకి క్రోది నామ ఉగాది
నూతన వత్సరానికి స్వాగతం పలుకుతున్నది
నును వెచ్చని సూర్య కిరణాలతో వందనం సమర్పిస్తున్న