సాంకేతిక పరిభాష
పరిచయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1974లో వరంగల్ జిల్లా (వ.జి.)కు చెందిన 142 శాసనాలను ముద్రించింది. 1985కు పూర్వం ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు తాలూకాలుగా విభజింపబడి ఉండేవి. ఈ కారణంగా ఆ యా గ్రామాలకింద తాలూకా పేరు ఉంటుంది. వరంగల్ జిల్లాలో ఉన్న 142శాసనాలు దిగువ తెలిపిన అరవైనా లుగు (64) గ్రామాలల్లో లభించాయి. అత్యధిక శాసనాలు వరంగల్ తాలూకాలో ఉన్నాయి. అందులోనూ ఒక వరంగల్
కోటలోనే దాదాపు ఇరవై (20) శాసనాలున్నాయి, హనుమకొండలో పదిహేను (15) శాసనాల లభించాయి.
ఆ యా శాసనాల వివరాలను తెలుసుకున్న తర్వాత శాసనాలలోని సంవత్సరాల గురించి తెలుసుకుందాం.
శాసనాల వివరాలు:
అకారాది క్రమం ప్రకారం 63 గ్రామాలు – 142శాసనాలు
1) అయ్యనవోలు (శా.సం. 23, 103)
2) అశోక్ నగర్ (శా.సం.116)
3) ఆకునూరు (శా.సం.3,37)
4) ఇంగుర్తి (శా.సం. 49, 59, 60. 76,106)
5) ఉరుసుగుట్ట (శా.సం. 99, 100)
6) కంఠఆత్మకూరు (శా.సం.75)
7) కందికొండ (శా.సం. 194,105)
8) కాజీపేట (శా.సం. 1,4,15)
9) కుందవరం (శా.సం. 58)
10) కుమరపల్లి (శా.సం. 13)
11) కొండపర్తి (శా.సం. 48, 142)
12) కొరవి (శా.సం.6,137,138, 139, 140)
13) కొలనుపల్లి (శా.సం. 87,88)
14) గిర్మాజిపేట (శా.సం. 61,93)
15) గుండాల (శా.సం. 78, 117)
17) గుర్జాల (శా.సం. 32)
18) గూడూరు (శా.సం. 27)
19) గోబిచెర్ల (శా.సం. 120, 121,122)
20) గోవిందపురం (శా.సం. 26)
21) ఘనపూర్ (శా.సం. 82,114,115 )
22) చిట్యాలపాడు (శా.సం. 52)
23) చీర్యాల (శా.సం. 112,133)
24) జఫర్ ఘడ్ (శా.సం. 2)
25) తాటికొండ (శా.సం. 30)
26) డిచ్చకుంట (శా.సం. 55,56)
27) ధర్మారావుపేట (శా.సం. 69)
28) ధర్మసాగర్ (శా.సం. 74)
29) నరసం పేట (శా.సం. 16)
30) నర్సింలుపేట ( శా.సం. 9)
31) నవాబుపేట (శా.సం. 5,134)
32) నారాయణగిరి (శా.సం. 10,135,136)
33) నిడిగొండ (శా.సం. 7.17,57)
34) నీలకుర్తి (శా.సం. 77)
35) పర్కాల (శా.సం.81)
36) పాకాల (శా.సం. 67)
36) పాకాల (శా.సం. 67)
37) పాలంపేట. (శా.సం. 50, 79)
38) పెంబర్తి (శా.సం. 126)
39) పెద్దాపూర్ (శా.సం. 125)
40) పొన్నవోలు (శా.సం. 10)
41) బనాజిపేట (శా.సం. 14)
42) బెక్కల్లు (శా.సం. 20,38,42)
43) బైరాన్పల్లి (శా.సం. 18,19)
44) మచ్చపురం (శా.సం. 51,54)
45) మట్టెవాడ (శా.సం. 33,68,130)
46) మహబూబాద్ (శా.సం.84,90)
47) మాటేడు(శా.సం. 24, 25,86)
48) ముప్పవరం (శా.సం. 70)
49) మేడపల్లి(శా.సం.21,118,119)
50) మొగలిచెర్ల (శా.సం. 123,124)
51) మొరిపిరాల (శా.సం. 40)
52) యెల్లంపేట (శా.సం. 39)
53) యెల్కుర్తి (శా.సం. 73,91)
54) రాంపూర్ (శా.సం. 85)
55) రాఘవాపురం (శా.సం. 11)
56) రామన్నపేట (శా.సం. 53)
57) రాయపర్తి (శా.సం. 66, 83)
58) రాజులకొత్తపల్లి (శా.సం. 92)
59) వరంగల్కోట శాసనాలు మొత్తం = 20
(3.30. 34,41,46,47,62,63,65,71,89,95, 96, 97, 98, 102, 108, 109, 111,131,132,141 =
20శాసనాలు
60) వర్దన్నపేట (శా.సం. 72)
61) వెంకటాపురం (శా.సం. 31)
62) శామీర్ పేట (శా.సం. 98)
63) సాయంపేట (శా.సం. 110)
64) హన్మకొండ (శా.సంఖ్యలు)
హన్మకొండశాసనాలు మొత్తం = 15 (శా.సం. 22, 23, 29, 35, 36, 43, 44,45,80,94,101,113,127, 128, 129).
శాసనాలుతాలూకాలు:
ఈ శాసనాలను తాలూకాల పరంగా విభజించిచూస్తే, అత్యధికంగా 72శాసనాలు వరంగల్లు తాలూకా లో లభించాయి. 23శాసనాలు మహబూబాబాద్ తాలూకాలో, 19శాసనాలు జనగాంతాలూకాలో, 15శాసనాలు నరసంపేట తాలూకాలో, 9శాసనాలు ములుగు తాలూకాలో, మూడు (3) శాసనాలు పర్కాలలో లభించాయి. ఒకే ఒక శాసనానికి రామన్నపేటశాసనం (53) తాలూకా పేరు లేకుండా ఉన్నది.
శాసనాలు – గ్రామాలు
శాసనాలను గ్రామాలపరంగా చూసినపుడు అ) అత్యధిక శాసనాలున్న గ్రామాలు, ఆ) ఐదు శాసనాలు ఉన్న గ్రామాలు, ఇ) మూడుశాసనాలున్న గ్రామాలు, ఈ) రెండు శాసనాలున్న గ్రామాలు, ఉ) ఒక శాసనమున్న గ్రామాలు అని విభజించవచ్చు.
ఈ విభజన వల్ల ఆయా గ్రామాల వైశిష్ట్యం, గ్రామాల ప్రాచీనత, ఆ యా గ్రామాలలో ఉన్న వ్యక్తులు, జరిగిన సంఘటనలు,వ్యక్తులఇంటిపేర్లు, వృత్తులఆపాధాన్యత, వారి కిచ్చిన లేదా పొందిన హక్కులు మొదలైన అంశాలు, వాటి ప్రాచీనతలు, ప్రాముఖ్యతలు తెలుస్తాయి.
అ) అత్యధిక శాసానాలున్న గ్రామాలు:
20 శాసనాలు – వరంగల్ కోట
(8.30.34,41,46,47,62,63,65,89,95,96, 97, 98, 102,108,109,111,131,132,141)-
వరంగల్ తాలూకా
15 శాసనాలు: హనుమకొండ
శా. సం. 22, 28, 29, 35, 36, 43, 44, 45,80, 94, 113,127, 128, 129 – వరంగల్ తాలూకా
ఆ) ఐదు శాసనాలు:గ్రామాలు:
కొరవి (శా.సం. 6,137,138, 139, 140) మహబూబాబాద్ తాలూకా
ఇనుగుర్తి (49, 59, 60,76,106) మహబూబబాద్ తాలూకా
ఇ) మూడు శాసనాలున్న గ్రామాలు:
1) నిడిగొండ (శా.సం. 7,17,57) జనగాంతాలూకా
2) చేర్యాల(శా.సం. 8,112,133) జనగాంతాలూకా
3) బెక్కల్లు (శా.సం. 20,38,42) జనగాం తాలూకా
1) మాటేడు (శా.సం. 24, 25, 86) మహబూబాబాద్ తాలూకా
2) నర్సింలుపేట (శా.సం. 107,135,136) మహబూబాబాద్ తాలూకా
1) మేడపల్లి (శా.సం.21,118,119) నరసంపేటతాలూకా
1) ఖాజీపేట (శా.సం. 1,3,15) వరంగల్ తాలూకా
2) మట్టెవాడ (శా.సం. 33, 68, 130) వరంగల్అలూకా
3) గోబిచెర్ల (శా.సం. 120,121,122) వరంగల్అలూకా
ఈ) రెండు శాసనాలున్న గ్రామాలు:
1) ఆకునూరు(శా.సం. 3,37) జనగాంతాలూకా
2) నవాబుపేట (శా. సం. 5,134) జనగాంతాలూకా
3) బైరాన్ పల్లి (శా.సం. 18,19) జనగాంతాలూకా
1) మహబూబాబాద్ (శా. సం. 84,90) మహబూబాబాద్లోలూకా
2) కందికొండ(శా.సం. 104,105) మహబూబాబాద్ లూకా
1) పాలంపేట (శా.సం. 50, 79) ములుగు తాలూకా
2) మాచపురం (శా.సం. 51,54) ములుగు తాలూకా
1) గుండాల (శా.సం. 78,117) నరసంపేట తాలూకా
2) దిచ్చకుంట (శా.సం. 55,56) నరసంపేట తాలూకా
1) మొగిలిచెర్ల (శా.సం. 123, 124) వరంగల్ తాలూకా
2) అయ్యనవోలు (శా.సం. 23,103) వరంగల్ తాలూకా
3) ఉరుసుగుట్ట (శా.సం. 99,100) వరంగల్ తాలూకా
4) కొండపర్తి (శా.సం. 48,142) వరంగల్ తాలూకా
5) రాయపర్తి (శా.సం. 66, 83) వరంగల్ తాలూకా
6) కొలనుపల్లి (శా.సం. 87,88) వరంగల్ తాలూకా
7) యెల్కుర్తి (శా.సం. 73,91) వరంగల్ తాలూకా
8) గిర్మాజిపేట (శా. సం. 61,93) వరంగల్ తాలూకా
ఉ) ఒక్క శాసనమున్న గ్రామాలు
1) శామీర్పేట (శా.సం. 12) జనగాంతాలూకా
2) గూడూరు (శా.సం. 27 ) జనగాంతాలూకా
3) కుందవరం (శా.సం. 58) జనగాంతాలూకా
4) పెంబర్తి (శా.సం. 126) జనగాంతాలూకా
1) ఎల్లంపేట (శా.సం. 39) మహబూబాబాద్లూకా
2) నీలకుర్తి (శా.సం. 77) మహబూబాబాద్లూకా
3) రాజులకొత్తపల్లి (శా.సం. 92) మహబూబాబాద్లూకా
1) వెంకటాపూర్ (శా.సం. 31) ములుగు తాలూకా
2) చిట్యాలపాడు (శా.సం.52) ములుగు తాలూకా
1) ఖాన్ఆత్మకూర్ (శా.సం. 75) పర్కాల తాలూకా
2) పర్కాల (శా.సం.81) పర్కాల తాలూకా
3) సాయంపేట (శా. సం.110) పర్కాల తాలూకా
1) ధర్మారావుపేట (శా.సం. 69) నరసంపేట తాలూకా
2) రాంపూర్ (శా.సం.85) నరసంపేట తాలూకా
3) అశోక్ నగర్ (శా.సం. 116) నరసంపేట తాలూకా
4) గుర్జాల (శా.సం. 32) నరసంపేట తాలూకా
5) పాకాల (శా.సం. 67) నరసంపేట తాలూకా
6) బానాజిపేట (శా.సం. 14) నరసంపేట తాలూకా
7) నరసంపేట (శా.సం. 16) నరసంపేట తాలూకా
8) గోవిందపురం (శా.సం. 26) నరసంపేట తాలూకా
1) రామన్నపేట (శా.సం.53) తాలూకా పేరు లేదు
1) జాఫర్ ఘడ్ (శా.సం. 2) వరంగల్ తాలూకా
2) నారాయణగిరి (శా.సం. 9) వరంగల్ తాలూకా
3) పున్నవోలు (శా.సం. 10) వరంగల్ తాలూకా
4) రాఘవపురం (శా.సం.11) వరంగల్ తాలూకా
5) కుమర్పల్లి (శా.సం. 13) వరంగల్ తాలూకా
6)పెద్దాపూర్ (శా.సం. 125) వరంగల్ తాలూకా
7) సిద్ధేశ్వరగుట్టహనుమకొండ (శా.సం.101) వరంగల్ తాలూకా
8) మొరిపిరాల (శా.సం. 40) వరంగల్ తాలూకా)
9) ఖుషీమహల్ వరంగల్ (శా.సం.71) వరంగల్ తాలూకా
10) వర్ధన్నపేట (శా.సం. 72) వరంగల్ తాలూకా
11) ధర్మసాగర్ (శా.సం. 74) వరంగల్ తాలూకా
12) ముప్పవరం (శా.సం. 70) వరంగల్ తాలూకా
13) తాటికొండ (శా.సం. 30) వరంగల్ తాలూకా
శాసనాలు – సంవత్సరాలు
ఈ నూటనలభైరెండు(142) శాసనాలలో 87 శాసనాలకు సంవత్సరాలు లేవు. ఇక మిగిలినవి 55 శాసనాలు. అందులో ఒక శాసనంలో శక సంవత్సరం గాకుండా కలియుగసంవత్సరాన్ని పేర్కొన్నారు, శక సం వత్సరం పేర్కొనలేదు.
ఇక మిగిలిన 54శాసనాల్లో కొన్నిట్లో కేవలం తెలుగు అంకెల్లో శక సంవత్సరాన్ని పేర్కొన్నారు. ఇలా ఇలా రకరకాల విభజనలు పోగా పహేను (15) శాసనాలలోని సంవత్సరాలకు ‘సాంకేతిక పరిభాష’ను వాడార 3. అందులోనూ ఒకటి శిథిలరూపంలో ఉంది. ఇక మిగిలిన పద్నాలుగు 14) శాసనాలు స్పష్టంగా ‘సాంకేతిక పరిభాష’లో ఉన్నాయి.
మిగిలిన 54శాసనాలలో కొన్నిటిలో శకసంవత్సరం గాకుండా చాళుక్యవిక్రమశకం లేదా ఆయా రాజుల పరిపాలనా కాలాన్ని(సంవత్సరాన్ని) పేర్కొన్నారు. కొన్నిటిలో చాళుక్యవిక్రమశకం మరియు శక సంవత్స రాన్ని తెలుగుఅంకెల్లో పేర్కొన్నారు.
కొన్నిట్లో కేవలం శక సంవత్సరాన్ని తెలుగు అంకెల్లో పేర్కొన్నారు. ఇలా ఇలా రకరకాల విభజనలు పోగా పదిహేను(15) శాసనాల్లో సంవత్సరాలకు ‘సాంకేతిక పరిభాష’ను వాడారు. అందులోనూ ఒకటి శిథిల రూపంలో ఉంది. ఇక మిగిలిన పద్నాలుగు 14) శాసనాలు స్పష్టంగా ‘సాంకేతిక పరిభాష’లో ఉన్నాయి. ఈ వ్యాసంలో ఆ పద్నాలుగు(14) శాసనాల సాంకేతికపరిభాష గురించి, సంవత్సరాల గురించి వివరించడం జరిగింది.
ఈ పరిభాషను కుడి నుండి ఎడమకు చదవాలి, రాయాలి. అలా వచ్చిన శక సంవత్సరానికి 78 కలిపి తే వచ్చేది (కామన్ ఎరా = సి ఇ). ఇప్పుడు మనం వాడుకుంటున్న సాధారణ సంవత్సరం అంటే క్రీ.శ. వరంగల్ జిల్లా శాసనాలు-సంవత్సరాలు-సాంకేతిక పరిభాష:
1.సముద్ర పుర భేందుమితే శకాబ్దే
(మేడిపల్లిశాసనం.21, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 52)
సముద్రం = 4
పుర = 3
ఖ = ఆకాశం= 0
ఇందు=చంద్రుడు= 1
శక సంవత్సరం 1034, క్రీ.శ. 1112
- సక(శక)మహీపాలాబ్దనికరంబు నయజలనిధినభోవిధు సంఖ్య (మాటేడు శాసనం. 24, వరంగల్ జిల్లా
శాసనాలు, పుట. 68
నయ = కండ్లు = 2
జలనిధి=సముద్రం=4
నభ = ఆకాశం = శూన్యం = సున్న (0)
విధు = చంద్రుడు =
శక సంవత్సరం 1042, క్రీ.శ. 1120
- రత్నాంబోధి వియత్శశాంక గత శాకాబ్దే
(గోవిందపురం శాసనం. 26, వరంగల్ జిల్లా శాసనాలు,పుట. 74)
రత్నం = త్రిరత్నాలు= 3
(బుద్ధం, ధర్మం, సంఘం శరణం గచ్ఛామి)
అంబోధి = సముద్రం= 4
వియత్ = ఆకాశం= 0
శశాంక=చంద్రుడు= 1
శక సంవత్సరం 1043, క్రీ.శ. 1121
- శాకాబ్దే తత్వరురదైరిమతిమతి రుధిరోద్గారి
(కొండవర్తి శాసనం. 48, వరంగల్ జిల్లా శాసనాలు, పుట.136)
తత్వ = పంచభూత తత్త్వాలు (5×5) = 25
రుద్రైః = ఏకాదశ రుద్రులు = 11
శక సంవత్సరం 1125, క్రీ.శ.1203
- శాక్యేహ్యర్కేందు సంఖ్యే
(ఇనుగుర్తి శాసనం. 49. వరంగల్ జిల్లా శాసనాలు, పుట.141)
అహి =నాగులు = 8
అర్క = సూర్యుడు = 12
ఇందు = చంద్రుడు =1
శక సంవత్సరం 1128, క్రీ.శ.1206
- శరలోకేందు భూసంఖ్యే శాకాబ్దే|
(పాలంపేట శాసనం. 50, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 149)
శర = మన్మథుని బాణాలు = 5
లోక = త్రిలోకాలు =3
ఇందు = చంద్రుడు = 1
భూ = భూమి =1
శక సంవత్సరం 1135, క్రీ.శ.1213
- శరలోకేందు భూసంఖ్యే శాకాబ్దే
(చిట్యాలపాడు శాసనం. 52, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 156)
శర = మన్మథుని బాణాలు = 5
లోక = త్రిలోకాలు =3
ఇందు = చంద్రుడు = 1
భూ = భూమి =1
శక సంవత్సరం 1135, క్రీ.శ.1213
- చంద్రాబ్ధీశమితే ప్రమాధిని శకస్యాబ్ధౌ
(నిడిగొండ శాసనం. వరంగల్ జిల్లా శాసనాలు, పుట.171)
చంద్ర = చంద్రుడు = 1
అభి= సముద్రం =4
ఈశ = ఈశులు = 11
శక సంవత్సరం 1141, క్రీ.శ.1219
- ప్రమాధిని శకస్యాబ్దే, (త్ర ——) శిథిలం
(కుందవరం శాసనం, 58, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 176)
- రామాబ్ధి రుద్రగణితే శాకేబ్దే వృషసంజ్ఞకే|
(ఇంగుర్తి శాసనం. 59, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 176)
రామ= ముగ్గురు రాముళ్లు = 3
అబ్ధి = సముద్రం = 4
రుద్ర=ఏకాదశరుద్రులు = 11
శక సంవత్సరం 1143, క్రీ.శ. 1
- నేత్ర రసేందు భూ పరిమితే శాకాబ్దకే
(కొండపర్తి శాసనం. 64, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 198)
నేత్ర = కండ్లు=2
రస = ఆరు రసాలు= 6
ఇందు = చందుడ్రు= 1
భూ= భూమి= 1
శక సంవత్సరం 1162, క్రీ.శ.1240 – 1
- శాకాబ్దే గిరి తర్క భూ శశి మితే
(వరంగల్కోటశాసనం. 65, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 2000)
గిరి= సప్తగిరులు= 7
తర్క= ఆరు శాస్త్రాలు= 6
భూ= భూమి= 1
శశి =చందుడ్రు= 1
శక సంవత్సరం 1167, క్రీ.శ. 1245
- శాకాబ్దే శశినంద భాస్కరమితే
(అయనవోలుశాసనం. 103, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 273)
శశి = చంద్రుడు = 1
నంద = నందులు = 9
భాస్కర = సూర్యుడు = 12
(ద్వాదశ ఆదిత్యులు)
శక సంవత్సరం 1291, క్రీ.శ.1369
- శాకేద్రి రంధ్ర నేత్రేందు సంఖ్యే రాక్షసహాయనే
(కందికొండశాసనం. 104, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 279)
అద్రి= పర్వతాలు =7
రంధ్ర = మానవశరీరంలోని రంధ్రాలు= 9
నేత్ర = కండ్లు
ఇందు= చందుడ్రు = 1
శక సంవత్సరం 1297, క్రీ.శ.1375,
- శాకాబ్దే తత్త్వ దేవవ్రజి(జ) విభుగణితే రక్తసంవామి వర్షే (వరంగల్కోటశాసనం. 111, వరంగల్ జిల్లా శాసనాలు, పుట. 291)
తత్త్వ = పంచభూత తత్వాలు = 25
దేవ= 4
ప్రజి= కృష్ణుడు =1
శక సంవత్సరం 1425, క్రీ.శ. 1504,
వరంగల్ జిల్లాలోని పై శాసనాలను పరిశీలించినపుడు క్రీ.శ.12వ శతాబ్దపు ప్రారంభ కాలం నుండి అంటే పావులూరిమల్లన కాలం నుండి క్రీ.శ.14వ శతాబ్ది అంతం వరకు దాదాపు మూడు శతాబ్దాలు శాసనాల లో ఈ సాంకేతిక పరిభాషను వాడినట్టు తెలుస్తున్నది.
(ఈ వ్యాసం ఇంతకు ముందు వ్యాసానికి పొడిగింపు అని గమనించగలరు)