మానవత్వం

అమ్మ చెప్పిన కథలు

మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.

అమ్మ…,అమ్మ… అమ్మ …అమ్మ… అంటూ తల్లి కోసం ఇల్లంతా వెతుకుతున్నాడు పదేళ్ల చింటూ. వాడి పేరు విశ్వాస్ .వాడి అరుపులకు పెరట్లో గిన్నెలు అడుగుతున్నలక్ష్మి గబగబా చేతులు కడుక్కుని ఒక్క ఉదుటున ఇంట్లోకి వచ్చింది. ఏంటి రా ఆ గావుకేకలు!!! చెవి కోసిన మేకల అంది లక్ష్మి. ఏం లేదమ్మా పక్క సందులో ఉన్న రవి వాళ్ళ ఇంటికి వెళ్ళానా ఆడుకోవటానికి, ఆ అయితే!! వాళ్ళింట్లో పెద్ద గొడవ జరుగుతుంది .వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో పిల్లలకు రెండుపూటలా పిడికెడు తిండి కూడా పెట్టలేని స్థితిలో ఉండి నీకు ఇదేం బుద్ధ య్యా! పిల్లలను అలా పస్తులు పెట్టి ఏ పూటకాపూట ఇలా తాగి రావటానికి నీకు మనసెలా ఒప్పింద య్యా!! నీకు అసలు జాలి, దయ, మానవత్వమే లేదా అని ఏవేవో తిడుతుందమ్మ. అసలు జాలి, దయ ,మానవత్వం అంటే ఏంటమ్మా? అని అడిగాడు చింటూ.
ఓ అదా!! నీకు ఇప్పుడు జాలి ,దయ ,మానవత్వం అంటే ఏంటో చెప్పాలి అంతే కదా! సరే రా ఇలా కూర్చో అని కొడుకు ని పక్కన కూర్చోపెట్టుకొని ఒక కథ చెప్పనా ఆరంభించింది తల్లి లక్ష్మి. సిరిసిల్ల అనే ఊర్లో ఒక ప్రైవేటు పాఠశాల ఉండేది. అందులో డబ్బున్న వారి పిల్లలు చదువుకునే వారు. అక్షయ్, రాజు ,అఖిల, ఆధ్య నలుగురు ఒక జట్టుగా ఉండేవారు. బాగా చదివే వారు కూడా .ఆటపాటల్లో, చదువుల్లో ,అన్నిట్లో ముందుండేవారు. ఒకరోజు వారి పాఠశాలలో ఒక పాటల ప్రోగ్రాం ను ఏర్పాటు చేశారు పాఠశాల యాజమాన్యం .ఆ ప్రోగ్రాం లో పాటలు పాడటానికి వచ్చిన వ్యక్తికి 16 సంవత్సరాలు ఉంటాయి. అతని పేరు రాంబాబు. వాళ్ల నాన్న గుడ్డివాడు. వాళ్ళ అమ్మ కు ఆరోగ్యం బాగాలేక ఆస్పత్రికి తీసుకెళితే 10 వేలు ఖర్చు అవుతుందని చెప్పారట. వాళ్ళ అమ్మను బతికించుకోవడానికి వేరే మార్గం లేక, ఇలా అక్కడక్కడ పాఠశాలల్లో, ఆఫీసుల్లో, రోడ్డుమీద అ పాటలు పాడుతూ ఎవరికి తోచింది వారు ఇస్తే ఆ డబ్బు జమ చేసి తల్లికి వైద్యం చేయించాలని అనుకున్నాడు రాంబాబు.
ఒకరోజు ఆ పిల్లలు చదువుకునే పాఠశాలలో పాటలు పాడే ఏర్పాటు చేశాడు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు. అంతా అయిపోయాక అన్ని తరగతుల పిల్లలంతా ఇచ్చిన చిల్లర మొత్తం పోగు చేస్తే 300 రూపాయలు అయ్యాయట .అది చూసిన అఖిల కు బాధేసింది .ఇంతసేపు కష్టపడితే ఇంత కొంచెం డబ్బులు వస్తే, వాళ్ళ అమ్మను హాస్పిటల్ కి ఎలా తీసుకు వెళ్తాడు అని కాసేపు ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చింది అఖిల.
సాయంత్రం ఇంటికి వెళుతూ రాంబాబు ను తనతోపాటు వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది. వాళ్ళ అమ్మను పిలిచి అతని గురించి, అతని పరిస్థితిని గురించి అంతా చెప్పి ,మనమేమైనా అతనికి సహాయం చేద్దాం అమ్మ అని అడిగింది. అందుకు అఖిల వాళ్ళ అమ్మ అఖిలను కోప్పడి, వారిని తిట్టి పంపించింది. అది చూసి అఖిల చాలా బాధపడింది. ఆ విషయాన్ని అంతటితో వదిలేయక తండ్రికి చెప్పి బాధపడిoది. అఖిల ఏంటి రా! మీ అమ్మ గురించి నీకు తెలియదా ?ఆమె అంతే మనం చేసేది మనం చేద్దాం. నువ్వు ఏడుపు ఆపు ముందు. ఇలా రా అని కూతురు ని దగ్గరకు తీసుకొని నీకు ఇప్పుడు ఏం కావాలి? రాంబాబుకు ,వాళ్ల తల్లిదండ్రులకు సహాయం చేయాలి అంతే కదా!! ఆ అవును నాన్నా. చేసేద్దాం అనగానే కిలకిలా నవ్వింది అఖిల.😊😊
ఇంతకు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారు? మా స్కూల్కి కొద్ది దూరంలోనే వికాస్ హై స్కూల్ ఉంది కదా నాన్న. రేపు వాళ్లు అక్కడ ప్రోగ్రాం చేస్తారట అన్నది సంతోషంగా అఖిల. మర్నాడు ఉదయం తండ్రి కూతురు ఇద్దరూ వికాస్ హై స్కూల్ కి వెళ్లి వారిని కలిశారు .అఖిల వాళ్ల నాన్న ఆఫీస్ అడ్రస్ ఇచ్చి సాయంత్రం కలవమని చెప్పి వచ్చారు. ఎంతో ఆశగా వచ్చిన రాంబాబును సాదరంగా ఆహ్వానించి ,అన్ని వివరాలు కనుక్కున్నాడు అఖిల తండ్రి. తనకు తెలిసిన ఒక డాక్టర్ నెంబర్ కు ఫోన్ చేసి తను ఒక అబ్బాయిని పంపుతున్నాను అని, అబ్బాయి తల్లికి వైద్యానికి కావలసిన డబ్బు తను కడతానని, మెరుగైన వైద్యం అందించాలని, వారు తమకు బాగా కావలసిన వారని చెప్పి ఫోన్ కట్ చేసాడు .
చూడు బాబు మీ అమ్మకి ఏం పర్వాలేదు తొందరలోనే కోలుకుంటుంది. ఇకపోతే నీకు మా ఆఫీస్ బాయ్ గా పని చేయటం ఇష్టమేనా? నాలుగింటి వరకు ఆఫీస్ లో ఉండు. తరువాత ఇంటికెళ్లి మీ అమ్మా,నాన్నలను చూసుకో. వీలు కుదిరినప్పుడు చదువుకో .నీతో ఓపెన్ డిగ్రీ కట్టిస్తాను సరేనా అన్నాడు. ఆ పిల్లవాడు అఖిల తండ్రి కాళ్లపై పడ్డాడు కన్నీళ్లు పెట్టుకుంటూ …అవి ఏడిస్తే వచ్చే కన్నీళ్లు కాదు ,ఆనందంతో వచ్చిన కన్నీళ్లు. ఆనంద భాష్పాలు. ఇప్పుడు చెప్పు జాలి, దయ, మానవత్వం అంటే ఏంటో అర్థమైందా!! ఓ బాగా అర్థమైంది అమ్మ! ఎదుటివారు కష్టాలలో ఉన్నప్పుడు వారిని చూసి, వారిపై జాలితో కథలో అఖిల, వాళ్ళ
నాన్న లాగా ఆప్యాయంగా పలకరించడం ,వారి పరిస్థితిని చూసి చిరాకు పడకుండా, వారికి ఎదురైన కష్టాన్ని చూసీచూడనట్లు వదిలేయకుండా, మనకు తోచిన సహాయం చేసి వారిని ఆదుకోవడం అంతే కదమ్మా అన్నాడు చింటూ. సరిగ్గా అంతే నాన్నా. కథ నీకు బాగా అర్థం అయినట్టుంది అంది తల్లి చింటూ తో. అవునమ్మా నాకు బాగా అర్థమైంది అన్నాడు చింటూ. అప్పటినుండి చింటూ కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ముందు ఉంటూ, తనకు తోచిన సహాయం చేస్తూ, తన తోటి వారిని కూడా అదేవిధంగా చేయమని చెప్తూ ఉండేవాడు.

Written by Madhavi Sreenivas rao Nellutla

పేరు :- మాధవి శ్రీనివాసరావు. నెల్లుట్ల.
ఊరు :- జనగాం.
చరవాణి నెంబర్ :-9848090705

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

నువ్వుచెప్పినదే