“పెట్రో గ్రాడ్” రోడ్ – స్ఫూర్తివంత కథనం

వ్యాసం

                    శుక్తిమతి

మహిళల విముక్తి కోసం వందల సంవత్సరాల నుండి ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. స్త్రీల అణచివేత కు కారణం పురుషులని, ఎల్లప్పుడూ వారిపై తమ ఆధిపత్యాన్ని చూపాలనే ఆలోచన పురుషునిదని, ఈ వ్యవస్థను మార్చాలంటే అన్ని వర్గాల లోని స్త్రీలు అందరూ కలిసి అన్ని వర్గాల పురుషులందరికీ వ్యతిరేకంగా పోరాడాలని లింగ ప్రాతిపదిక మీద విభజన జరిగిందని ఫెమినిజం భావిస్తే, ఇందుకు భిన్నంగా వర్గ ప్రాతిపదిక మీద ప్రపంచాన్నివిభజన జరిగిందని మార్క్సిస్టు దృక్పథం.
ఒక మహిళ అణచివేతకు అర్థం శారీరక హింస, లైంగిక దోపిడి తో పాటు పిల్లలను ఆమె నుండి బలవంతంగా దూరం చేయడం. సామాజికంగా చట్టపరంగా కట్టడి చేయడం. ఆమె అనుమతి లేకుండానే లైంగిక చర్యలకు పాల్పడటం.
శ్రామిక మహిళలకు అయితే శ్రమదోపిడి ,విరామం కఠోర శ్రమ, ఆ శ్రమ ఫలితంగా గర్భవతుల పసికందుల దుర్మరణాలు.
ఇంగ్లీష్ విప్లవం తో స్త్రీ స్వేచ్ఛా నినాదం అంకురించింది. ఈ విప్లవం మహిళలను చరిత్ర పుటలలో చేర్చడంతో పాటు సామాజిక వ్యవస్థకు సంబంధించిన అంశాలను లేవనెత్తింది
అమెరికన్ మహిళా ఉద్యమం బానిస సమాజం నిర్మూలన కోసం జరిగిన ఉద్యమాల నుండి పుట్టింది. వేలాది మంది స్త్రీ పురుషులను వెట్టిచాకిరీ చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి బానిసలుగా మార్చారు. వారి విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో తెల్లజాతి మహిళలు కూడా పాల్గొన్నారు దీనివల్ల ఆ మహిళలు బహిరంగ సభలో మాట్లాడడం తమ కోర్కెలను డిమాండ్లుగా ప్రచారం చేసుకోవడం మొదలగు స్వేచ్ఛను పొందారు.
మానవ చరిత్ర పురుషులు స్త్రీల స్వేచ్ఛను అపహరించడంతో ఆమె పై దౌర్జన్యం చేయడంతో నిండిపోయి ఉంది. ఈ బృహత్తర పోరాటంలో ఎదుర్కోవలసిన కష్టాలు నష్టాలు వెక్కిరింతలు అపార్థాలు,తప్పుడు ప్రచారాలు ఎదుర్కొనేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా గమ్యం చేరేవరకు విశ్రమించం”. అని స్త్రీలు సభలో తెలియపరిచారు. ఈ సభలోనే తమ పవిత్రమైన ఓటు హక్కు సాధించుకోవడం ప్రతి మహిళ బాధ్యత అని తీర్మానం చేశారు.
నిజం చెప్పాలంటే చరిత్రలో మహిళల పోరాటాలు ఎంతో గొప్పగా ఎంతో విశాలంగా ఉన్నాయి. పర్వత శిఖరాగ్రం నుండి ఒక లోతైన లోయ పూర్తిగా ఎలా చూడగలమో అలాగే చరిత్రలోఈ పోరాటాల ఉచ్చ దశ నుండి మహిళల చరిత్ర చూడగలం. 17వ శతాబ్దంలో ఇంగ్లీష్ విప్లవం మొట్టమొదటిసారిగా మహిళల స్వేచ్ఛపై కొత్త ఆలోచనలు ఉదయించిన సమయమది. కొత్త లైంగిక నీతి ఆవిర్భవించిన సమయం కూడా. ఆ తర్వాత 18వ శతాబ్దంలో వచ్చిన ఫ్రెంచ్ విప్లవం లోనూ, 19వ శతాబ్దపు పారిస్ కమ్యూన్ లోనూ మహిళలు అపారమైనపోరాటపటిమను చూపించారు.
1917లో జరిగిన రష్యన్ విప్లవం మహిళల విముక్తిలో ఒక మైలు రాయి. మొట్టమొదటిసారిగా చరిత్రలో స్త్రీ పురుష సమానత్వాన్ని రాజకీయాల్లో ఆర్థిక రంగంలో లింగ భేదం లేని సమసమాజ స్థాపన అజెండాలో పెట్టింది యుగయుగాలుగా సాగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక కుటుంబపరమైన అసమానతలను ఒక్క కలం పోటుతో రద్దు చేసి వాటి స్థానంలో కొత్త చట్టాలను తెచ్చి స్త్రీలకు ఓటు హక్కు నిచ్చింది. విడాకుల చట్టం తెచ్చింది. వివాహాన్ని స్వచ్ఛందంగా ఏర్పర్చుకొనే బంధంగా గుర్తించింది. చట్టపరమైన పిల్లలు చట్టవ్యతిరేకమైన పిల్లలనే తేడాను తుడిపి వేసింది
ఫ్రెంచి విప్లవానికి మానవ చరిత్రలో గొప్ప స్థానం ఉంది. ఈ విప్లవం మానవ నాగరికతను మానవుల జీవితాలను ఎంతో ప్రభావితం చేసింది రాజుల నిజం కుశ త్వం కింద నలిగిపోయిన స్త్రీ పురుష భేదం లేకుండా చేసిన తిరుగుబాటు వలన రాజ్యాలు పోయి ప్రజాస్వామ్య పరిఢవిల్లింది. నిరంకుశత్వం స్థానంలో స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వం నెలకొల్పబడ్డాయి.
మహిళలు ఈ విప్లవం లో కీలక పాత్ర వహించారు. కుటుంబ గౌరవం కాపాడటం కుటుంబానికి వారసులను అందించటమే కర్తవ్యంగా భావించిన కులీన వర్గ స్త్రీలు ఈ విప్లవం లో ఉదాసీనంగా ఉన్నారు.
బూర్జువా వర్గానికి చెందిన స్త్రీలు సంప్రదాయపు సంకెళ్ళను తెంచుకొని తమ కోర్కెలను ఫిర్యాదులను ఆలోచనలను పిటిషన్ల గా తయారు చేసి తమ ఫిర్యాదులను తామే రాజు వద్దకు పంపటం ఈ పిటిషన్లలో ఎక్కువ భాగం రాజకీయ హక్కుల కోసమే తయారు చేయబడ్డాయి.
పురుషులకున్న విశేషాధికారాలన్నీ రద్దు చేయాలని, రాజకీయ కార్యక్రమాలలో స్త్రీలకు ప్రవేశం కల్పించాలని, విఫలమైన వివాహాలపై మహిళల ఆవేదనలు, ఫిర్యాదులు” అనే పిటిషన్ పై మొన్తియెర్ అనే పత్రిక తన సమీక్షను ప్రచురించింది. అందులో ఆనాటి వివాహ చట్టాలు విమర్శించ బడ్డాయి.
ఇకపోతే శ్రామికమహిళలకు వీటన్నింటికంటే అధిక ధరలు, నిరుద్యోగం, ఆకలి వంటి బతుకుతెరువు సమస్యలు తీవ్రమైనవి. కావున ఆహారం కోసం డిమాండ్ ముఖ్యమైన డిమాండ్. ఈ పోరాటంలో శ్రామిక మహిళలు ముందుండి ఈ పోరాటాల ఫలితంగా ధరలు నిలకడగా ఉండటమే కాకుండా కొంత వరకు తగ్గాయి ప్రజల జీవన స్థితి రొట్టె కోసం వీధిలోకి వచ్చి చేసే స్థితి తగ్గింది.
1871 లో జరిగిన పారిన్ కమ్యూన్ మహిళలు చేసిన పోరాటాల అన్నింటిలో అత్యంత వీరోచితమైనది.
జర్మనీలో సోషలిస్టు మహిళల ఉద్యమం కూడా ప్రధానమైనదే. మహిళలను సోషలిజం వైపు నడిపించాలంటే అందుకు ప్రత్యేకమైన మార్గాలు, పద్ధతులు కార్యాచరణ అవసరం కనుక మహిళలు చైతన్యవంతులై సోషలిజం కోసం పోరాటాలలో పాల్గొనేందుకు ప్రత్యేకమైన సంఘాలు నేర్పరచి శిక్షణా తరగతులను నిర్వహించాలని, దీనికి ప్రధానంగా మహిళల నాయకత్వం నిర్వహణ బాధ్యత ఉండాలని జట్కిన్ అను మహిళ మహిళల కోసం మహిళా ఉద్యమం కోసం ప్రసంగించారు.
మహిళలకు కేవలం ఓటు హక్కు మాత్రమే పరిమితం కాకుండా పని హక్కు కోసం, పురుషులతో సమానంగా వేతనం కోసం వేతనంతో కూడిన ప్రసూతి సెలవు కోసం, ఉచిత పిల్లల సంరక్షణ కోసం, విద్య కోసం పోరాడాలని ఉద్యమకారుల డిమాండ్.
1917 విప్లవ మొదలుపెట్టింది పెట్రో గ్రాడ్ స్థానిక మహిళలే. మార్చి 7వ తేదీన పెట్రోగ్రాడ్ నగర మహిళలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు మార్చి 8వ తేదీ కొత్త పరిశ్రమలో సమ్మె ప్రారంభించబడింది. మార్చి 9వ తేదీ పోలీస్ బోల్షివిక్ పార్టీ సమ్మెకు పిలుపునిచ్చిన సరికి రెండు లక్షల మంది కార్మికులు సమ్మెలో ఉన్నారు. యుద్ధంతో ను ఆకలితో ను విసిగి పోయిన మహిళలు తుఫానుల ఎగిసిపడి అడ్డు వచ్చిన వారిని అందరిని టుడే పీకే సార్ యుగయుగాల అణచివేతకు వ్యతిరేకంగా కదం తొక్కుతూ మొదలైన ఈ శ్రామిక మహిళల దండు విప్లవ జ్వాల కు అగ్నికణం అయింది. వస్త్ర పరిశ్రమలో పని చేస్తున్న శ్రామిక మహిళ లు చుట్టుపక్కల పరిశ్రమలలో పనిచేస్తున్న వారినందరిని సమ్మెకు మద్దతు ఇవ్వని కబురు పంపి కూడగట్టారు. అంటే విప్లవం అట్టడుగు వర్గాల నుండి దోపిడీకి అణచివేతకు గురవుతున్న వర్గం నుండే ప్రారంభమైంది. ఈ మహిళలే సైనికులను తమపై అధికారుల ఆజ్ఞలను సైతం పాటించకుండా చేయగలిగారు. వారు తుపాకులకు ఎదురొడ్డారు. భద్రత వలయాలు ఛేదించారు. సైనికులను తామెంతో సిగ్గుపడే పనిచేస్తున్నట్టు ఒప్పించి తుపాకీలను కింద పడ వేయించారు. అడుగడుగునా సైనికులను ఎదిరించి ముందుకు నడిచారు.
మహిళలే తమ అంతర్జాతీయ మహిళల దినోత్సవం రోజు మొట్టమొదట పెట్రోగ్రాడ్ రోడ్లమీదకు వచ్చారు.
మహిళలకు జేజేలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి జేజేలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒక్క రోజైనా…

కామం లేని ప్రేమ కోసం