ఓ మహిళా

కవిత

R. భాగ్య

పూవు ఓలే పుట్టి
పరిమళాలను పంచుతుంది
ఆనందాల అంచులకు తీసుకెలుతుంది
బంధాలను పెంచుతుంది
బంధవ్యాల ను నిలుపుతుంది
అందచందలతో, అణుకువతో
అందరిని తన పాదాక్రాంతం చేసుకుంటుంది
అందరి కలలను తన కనుపాపలా తలచి
అహర్నిశలు కష్టించి
అవమానల్ని సహించి
కష్టాల కడలి దాటి
ఆత్మీయతానురాగాలను పంచి
సుఖ సంతోషా లనే వాకిళ్ళు గా
ఆనందాలనే లోగిళ్లుగా చేసి
తన ఇంటిని నందనవనం చేసే
ఓ మహిళా నీవే శక్తి వి!

మహిళా మణు లందరికి
🌹అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు 🌹

Written by R Bhagyalaxmi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్త్రీ పర్యా య పదాల తో అల్లిన కవనం

మహిళామణి