అమ్మ గా ప్రాణం పోస్తుంది!
అందిస్తుంది అభిమానం సోదరిగా!!
ఇల్లాలిగా నిలిచేను కష్టసుఖాలలో తోడుగా!!
ప్రేమాభిమానాలను చూరగొంటుంది బిడ్డగా!!
ఇల్లాలే లేకుంటే
వెలవెలబోతాయి గృహాలన్నీ
మానవుని మనుగడే ప్రశ్నార్థకం మహిళ లేకుంటే!
మగువకు అడుగడుగున అవరోధాలే!!
త్యాగానికి మారుపేరు మహిళ!
అన్నపూర్ణగా ఆదరిస్తుంది!
కష్టాలు ఎన్ని ఉన్న చిరునవ్వే ఆయుధంగా చేసుకొని!!
అన్ని అవలీలగా ఎదుర్కొనే శక్తి స్వరూపిణి !!
అన్ని రంగాలలో ఇప్పుడు పురుషునికి దీటు!
అన్ని సవాళ్లను ఎదుర్కొని చేసుకుంటున్నది విజయాన్ని కైవసం !!
అయినా సమాజంలో……
ఈ నాటికీ….
కట్నాలంటూ కాల్చుకు తింటున్నారు!
అడుగడుగునా అవమానాలు చేస్తున్నారు!
చీత్కారాలు ,బలత్కారాలను ఎదుర్కొంటు…
పయనం కన్నా…
స్త్రీ పురుషులంతా చేయి చేయి కలిపి
సమ సమాజాన్ని స్థాపిద్దాం!!
మనుషుల ఆలోచనలో ఈ మార్పు సాధికారత కు ఓ చేర్పు!!
అసాధ్యాలు సుసాధ్యం!!