పెరిగిన నగరీకరణతో అడుగంటిన పచ్చదనం
పరిశ్రమల వెల్లువలో పల్లెలన్ని గల్లంతు
కృత్రిమ సాగుల ఫలితం భూసారపు క్షీణత్వం
రాబడి నోచని రైతుల అయోమయపు భవితవ్యం
జలవనరుల విధ్వంసం కరువుకు నిలయంగా ధరణీతలం
జాడ లేని వానలతో బీడుపడ్డ
నేలతల్లి
అపర భగీరథుడికై ఆశతో చూస్తున్నది
అడవితల్లి వేదనతో తల్లడిల్లిపోతున్నది
కాపాడే నాథుడికై కన్నీళ్ళు పెడుతోంది
జంతుజాలమేకమయ్యి
గొంతెత్తి అరుస్తోంది
నిలువ నీడ లేకుంటే మనుగడెలాగంటున్నది
కాలుష్యపు కోరల్లో శల్యమైన దేహాలు
భారమైన బ్రతుకులతో
ఛిద్రమైన భవితవ్యం
వాహనాల కాలుష్యం
రహదారుల దిగ్బంధం
సేదదీరే క్షణం లేక
భూమాత కుంగుతోంది
భూమిమీద కాలుష్యం
గాలిలోన కాలుష్యం
జలమంతా కాలుష్యం
జగమంతా కాలుష్యం
భూతాపం పెరిగిపోయి
శుష్కించిన జీవరాశి
పర్యావరణం ప్రశ్నార్థకమై
పుడమితల్లి ఏడుస్తోంది