ఓ శివ………..
ఏమని వర్ణింతు నీ ఆహార్య విలాసాలు……
నెత్తిన ఉరుకుల పరుగుల గంగను ముడివేసి కట్టడి చేశావు…
మా కది పంపావు సంకేతంగా … ప్రవహించే ఆలోచనలు కట్టడి చేయమని….
శరీరమంతా విభూతి అలుముకుంటావు……..
చివరకు మిగిలేది ఇదే అని మాకు చూపడానికి……….
.దుష్టుల దనుమాడుటకు నుదుట నున్న మూడవ కన్ను తెరుస్తావు కాలాగ్ని రుద్రుడవై …..
కళ్ళుండి గుడ్డి వాళ్ళ మైన మాకు జ్ఞాన నేత్రము తెరిపించి …. మంచి చెడ్డలు బేరీజు తెలుపుతావు….
కంఠాన గరళము ధరించావు లోకాల కోసం…
. దాని ద్వారా మాకు ఎత్తి చూపిస్తున్నావు ప్రేమ దయ కలిగి ఉండాలని……..
విష నాగులను ఆభరణములుగా అలంకరించుకున్నావు…
విషయ వాసనలు దగ్గరగా ఉన్నా మమ్ము చలించకుండా ఉండమని హెచ్చరించడానికి …..
ఆకాశమే అంబరముగా ఉన్న నీవు చర్మాంబరములను
ధరించి నిరాడంబరత్వాన్ని చాటుతున్నావు…. ఈ శరీరం అనే వలువలు శాశ్వతం కాదని మాకు తెలపడానికి …..
నీవు ధరించే త్రిశూలం చూపించి…. మమ త్రిగుణాలను దాటమంటున్నావు…….
డమరుకం మ్రోగించడం ద్వారా… అక్షరాలను వెలికి తీశావు… మాకు విద్య గరపడానికి…..
నటరాజువై నాట్యం చేసి చూపిస్తూ……
మీ దేహాలన్నీ….. నేను ఆడించే మరబొమ్మలని జ్ఞప్తి కి తెస్తావు….
ఏమి! నీ లీలా విలాసమూ…. ద్వైతంలో అద్వైతివైతివి అర్ధనారీశ్వరుడువై…..
స్మశానమే నా నివాసమంటావు…..
ఆత్మవై అన్నిట నేనున్నానంటావు……
సృష్టికి లయకారుడవై మరో సృష్టికి శ్రీకారం అందిస్తున్నావు ….
ఏమని పొగడద శివయ్యా…. నేనేమని పొగిడద శివయ్య….