విద్యా ప్రదాయిని వీణాపాణి

విద్యా ప్రదాయిని వీణాపాణి
విరించిరాణీ వేద విహారిణీ
అజ్ఞాన తిమిర సంహారిణి,తోషిణీ
సురనుత సుందర సుమధుర సుభాషిణి
విధాత జిహ్వాగ్ర సంచారిణీ,
వాంఛిత ఫలదాయినీ, సుహాసిని
మధుర మంజుల గాన లోలా స్వరూపిణి
మంజీర నాద వినోదిని,పావని

కమలసులోచని, కమలాసను రాణీ
కరుణామయీ వాగ్దాయిని, జననీ
శ్వేతాంబరధర శ్రితజన పోషిణి
శాంతమయీ శరణాగతి రక్షిణీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దేవులాట

ఎన్ని అడుగులు?