గుండు గుండు మల్లెలన్నీ

తెలుగు భాష పాట

గుండు గుండు మల్లెలన్నీ దండ చేసి
దండలోన మాటలన్నీ ఏర్చి కూర్చి
నిండుగా పాడుతాం తెలుగు పాట
గుండె నిండా నింపుదాం తెలుగు భాష/

కు కు కు కోకిలమ్మ
నీ పాట కన్నా తీయన తెలుగు పాట
చిట్టి చిట్టి మాటలాచిలకమ్మ
నీ మాట కన్నా కమ్మన తెలుగు మాట
పారేటి ఏరుల సాగే జలతారులా
నిత్యమై సాగేను తెలుగు భాష
నిఖిలమై వెలిగేను తెలుగు భాష/

నన్నయ్య నీ రూపు మెచ్చినాడు
తెలుగు కవులకే అన్నయ్యగా నిలిచినాడు
తిక్కన్న, సోమన్న, పోతన్న ,వేమన్న
నీ రూపు రేఖలే దిద్దినారు
పడితి కినేరలా,పల్లె పడుచు ఎంకిలా,
జానపద భామల కల్లకపటం ఎరుగని తల్లి భాష
భాషలన్నింటా వెలిగేటి తెలుగు భాష/

చక్కనైన పద్యాలు, చిక్కనైన గేయాలు
నీ పలుకుకు సొగసులు దిద్దినాయి,
అందాలు చిందేటి నీ భాష చందాలు
సొగసులు దిద్దినాయి/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సమర సేనాని సరిజోడు… కౌసల్యాదేవి !

ఎడారి కొలను