ఓ స్త్రీ మూర్తి

కవిత

ఓ స్త్రీమూర్తీ!
ఈ విశాల విశ్వానికి మూలం నీవు
జన్మ దాతవు నీవు
నీ గొప్పతనంపొగడగనావశమా
దేశమంటే నీవు
భాష అంటే నీ వు
భూదేవి అంటే నీవు
ప్రకృతి అంటే నీవు
ఓర్పు, సహనంఅంటేనీవు
విద్యా బుద్దులు నేర్పి
పిల్లలను ఆదర్శప్రాయులుగా జెస్తావు
వెన్నెలవంటి చల్లనిచూపుతో
కన్న ప్రేమను కురిపిస్తావు
ఆలిగాభాద్యతలనుపంచుకుంటావు
కుటుంబభారంమొసిఅలసిసొలసినా
నీకన్నులలోతృప్తి వెలుగుతుంది
విద్యలు నేర్చి విజ్ఞాని వై
అంతరిక్షంలో ఎగురు తున్నావు
మానవత్వం, సౌబ్రాతృ త్వం నీ
ద్వేయం
భావిత రాలకువారధిగా
ఓ స్త్రీ మూర్తి
ఈ శ తాబ్దం తీరుని అందుకుంటున్న నేటి స్త్రీ మూర్తి
పరిస్థితులను నీకనుకూలంగా
మలచుకో
అన్ని పదవుల్లోను
అన్నివిద్యలలోనూ
ఆకాశమంతఎత్తుకుఎదుగుతున్నావు
నీచుట్టూమానవమృగాలున్నాయి
నేటిలోనూభవితలోనూఆమృగాలను వేటాడి
ఆడదిఅబలకాదనినిరూపించుకో
ప్రతీ మహిళా ఒకమహాశక్తి గాఎ దగాలి
చేతులు కలపినడుద్దాము
జయ జయ నినాదాలు పూరించండి
అంతర్జాతీ య దినోత్సవ సందర్బంగా
మహిళలందరికీశుభాకాంక్షలు

Written by R Ramadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పట్టుదల – perseverance

జయము జయము భరతమాత