చదువు సంస్కారం లో ఆమెకి ఆమేసాటి.గర్వం భేషజం లేని డాక్టర్.ప్రాక్టీసు పెట్టిన 5ఏళ్ళకే భరత్‌నగర్ లో మంచి హస్తవాసి ఉన్న పిల్లల వైద్య నిపుణురాలుగా పేరు తెచ్చుకున్న డాక్టర్ ఆర్.దీప్తి !
ఎవరినైనా ఆదరంగా పలకరించటం రోగుల్ని ఖంగారుపెట్టకుండా పంపడం ఆమెనైజం. పసిపిల్లల తో వచ్చే అమ్మ నాన్నలు సంతోషంగా వెల్తారు.అమ్మ నాన్నల బాల్యం కష్టాలు నష్టాలు తెలుసుకున్న దీప్తి చదువులో చురుకు.బాగా చదివి డిగ్రీ కాగానే కుటుంబం ని ఆదుకోవాలని ఆమె సంకల్పం.అమ్మ నాన్న డిగ్రీలున్నవారు.కానీ వారిద్దరూ బాల్యంలోనే తండ్రులు పోవడంతో బంధువుల నిరాదరణకు గురైనారు.అందుకే దీప్తి కి అమ్మమ్మ బామ్మ తఆతలప్రఏమ ఆప్యాయత తెలీవు.సర్వస్వం అమ్మ నాన్న లే!
తండ్రి ఉద్యోగరీత్యా చాలా ఊళ్లు తిరిగారు.చీరాల్లో చదువుతూ డాన్స్ కొద్దిగా నేర్చారు. కరాటేలో గ్రీన్ బెల్ట్. స్పోర్ట్స్ లో ముఖ్యంగా కోకోలో ఎన్నో బహుమతులు గెల్చారు.త్రోబాల్ కూడా ఆడుతూ చదువులో టాప్ టెన్ లో ఒకరు.నాన్నతెచ్చే జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు పేపర్లు రోజూ చదవటం అలవాటైంది.రేపల్లె లో పుట్టిన ఈమెకి లెక్కలు లో వందశాతం కానీ లాంగ్వేజెస్ లో 70_80శాతం మార్కులు వచ్చాయి.గుంటూర్ లో టెన్త్ పాసై తండ్రి ప్రోత్సాహం బలవంతంపై అమలాపురం మెడికల్ కాలేజీ లో ఫ్రీసీట్ తో చదువు తో పాటు ఇంటర్ కాలేజ్ స్పోర్ట్స్ లో బహుమతులు గెలుచుకున్నారు.చదువంతా కో ఎడ్యుకేషన్.అబ్బాయిలు రాగింగ్ లేదు.డ్రాయింగ్ ముగ్గులు మహాఇష్టం.ఆపై పెడియాట్రిక్స్ ఇ.ఎన్.టి.లో 2 గోల్డ్ మెడల్స్ పొందారు.పి.జి.దావణెగెరె లో చేశారు.HOD డాక్టర్ సి.ఆర్. బాణాపుర్ మఠ్ ఆదరణ ఆప్యాయత పొందిన విద్యార్థినిగా ఆ అనుభూతి చెప్పలేను అని అంటారు ఆమె.DCH కోర్స్ చేశారు.అమలాపురం తను చదివిన కాలేజీ లో జాబ్ చేసి బెంగళూరు లోDNB లో పి.జి.చేశాక APSC లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది.ఆల్ఇండియా 95 వరాంక్ పొందారు.కానీ తనకు కల్గిన చేదు అనుభవం తో ప్రభుత్వ ఉద్యోగం కి రిజైన్ చేశారు.
2019 లో డాక్టర్ రాజేష్ తో పెళ్ళి 5 ఏళ్ల నుంచి ప్రైవేటు ప్రాక్టీస్ తో ఆమె హైదరాబాద్ లో భరత్ నగర్ లో మంచి పేరు పొందారు.పసిపిల్లలతల్లులు క్యూ కడతారు రోజూ.విసుగు అలసట లేకుండా చిర్నవ్వుతో పిల్లల్ని పలకరిస్తూ చెకప్ చేస్తారు.3ఏళ్ల చిన్నారి పాప తల్లి గా గృహిణిగా ఆమె రాణిస్తున్నారు .