లీపియర్ – ఫిబ్రవరి

తరుణీ సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి సంపాదకురాలు

సంవత్సరంలో ఫిబ్రవరి నెల చిన్నం నెల అంటే 28 రోజులు మాత్రమే ఉంటాయి కానీ లీపు సంవత్సరంలో leap year లో ఫిబ్రవరి నెలలో 29 రోజులు ఉంటాయి.
ప్రకృతి రీత్యా డిసెంబర్ జనవరి నెలలోని విపరీతమైన చలి, తెలిమంచు కురిసే రోజుల నుండి చల్లని గాలుల నుండి సూర్య రష్మి కాస్త వెచ్చగా ఉండే రోజుల్లోకి అడుగెడతాం.
కాబట్టి ఫిబ్రవరిని వాతావరణ మార్పులకు ముఖ్యమైన నెలగా భావిస్తారు.
Wetlands and biodiversity ప్రణాళిక ఏర్పరచుకొని చిత్తడి నేల దినోత్సవం గా ఫిబ్రవరి 2ను అంటూ ఉంటారు. ఇకపోతే ఫిబ్రవరి 4 ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. దీన్ని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, నిర్ణయించింది. గతంలో చెప్పుకున్నట్టు ఉత్సవం అంటే ఏంటి సంతోషాలుగా సంబరాలుగా జరుపుకునేవి ఉత్సవాలు. నేల చిత్తడి అవడం, క్యాన్సర్ వ్యాధి సంతోషాలు కాదు కానీ వీటి వల్ల కలిగే విషాదాల నుంచి బయటపడడానికి ఒకరోజు ఏర్పాటు చేసి చైతన్యాన్ని కలిగించడం ఒక అవగాహన కలిగించడం. వరకు వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, పాఠశాలల్లో విద్యార్థులకు తెలియజేయడం సంస్థల ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. Prevention is better than cure అనే ప్రఖ్యాత నానుడి తెలిసిందే కదా! జబ్బు చేసిన తర్వాత తగ్గించుకునే ప్రయత్నాల కంటే జబ్బు చేయకుండా ముందు జాగ్రత్తగా ఉండడం అవసరము అని ఉద్దేశం. క్యాన్సర్ అనే జబ్బు శరీరం లో చేరిందంటే వేగంగా మనిషిని కబళించపడేస్తుంది. శాస్త్రవేత్తలు
” Cancer is a heterogeneous group of diseases that result from abnormal cell growth and have the potential to spread to other parts of the body” అంటారు.
అయితే ఇదంతా శరీరానికి పట్టే జబ్బులు గురించి. కానీ బుద్ధి కి పట్టే జబ్బులు ఒకటా రెండా!
అదిగో చిన్నపిల్లల కు చెందిన చాక్లెట్ లలో డ్రగ్స్ పెట్టి ఇస్తున్నారని టీవీ లలో వార్తలు చూస్తున్నాం. పసి వాళ్ళు పాషాణ హృదయుల టార్గెట్ అయ్యారు. భావి భారత పౌరులు కదా. ఎట్లా వీళ్ళ రక్షణ ?
తల్లిదండ్రుల బాధ్యత నే ఇది. పిల్లలకు సమాజం లో ఇటువంటి దుర్మార్గులుంటారని అర్థం చేయించాలి.ఎలాంటి జాగ్రత్త లు తీసుకోవాలని చెప్పాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఎడారి కొలను 

ఇక నిశ్చింతగా….