వాలు కుర్చీ!

కవిత

రంగరాజు పద్మజ

వాలు కుర్చీ కదా! వారింటి ఘనత చెప్పు !

వాలినంతనే – మదిలోన మంచి ఆలోచనలు రేకెత్తించు !

చింతదీర్చి – చిరుకునుకు పట్టించి, అమ్మ ఒడి మరిపించు!

మూలాల సంప్రదాయాల మూర్తీభవించు ఆ మూర్తి
ఆఇంటిమూలవాసమైఆనవాలుగ నిలుచు!

వాలిన పొద్దులో – అంతరంగమే ఆవిష్కరించు !

సుఖదుఃఖాలైనా-శ్రమవిరామాలైనా;

ఆ వాలు కుర్చీ నే ఊతమై ఊరటచెందు !

భావి దర్శించి,ప్రణాళిక లెన్నో రచించు-ఆ వాలు కుర్చీ…

పరువముడిగిన చాలు- పడకచేరు ముదిమి !

వాలు కుర్చీ ఖాళీయై- బోసిబోయి పురావస్తుగ నిలిచి,దానిపై కండువా నాన్నై పలకరించు!

తాతల నాటి కాలాల ఒకనాటి
జీవన చిత్రమై…చరిత్రగ చెప్పు !

ఆనాడు జీవించి ఉండిన- ఎంతభాగ్యమని
యెద తలచి, కన్ను చెమ్మగించు!

నీరు పల్లానికే – ప్రవహించునట్టు,

నేటి మనవడు- రేపు తాతగును కద !

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

 ఎడారి కొలను