అయిదున్నర అడుగుల
మనిషికి
మనసు అనేది ఉండదా?
అనేక నిత్య పోరాటాల మధ్య
ఆమెలో సృజన అదృశ్యమైందా…
లేదు లేదు…
ఓ పెద్ద పండుగ మాసంలో
ఉత్తేజపూరిత వేకువలెన్నో
ఆమె ఒత్తిడి తొలిగించి
సాంత్వన నిస్తూ…!
పూలూ లతలూ వేసుకొని
పుట్టిల్లు జ్ఞాపకాలతో..
చుక్కల ముగ్గు ఎంత కష్టమో, అంత ఇష్టం!
అమ్మ నేర్పించింది మరి..!
పక్కింటి కిష్టమ్మ వేసే తాంబేలు..
ఎదురిల్లు నాగేశ్వరి కాకర పందిరి..
విష్ణు చక్రం.. గాలి పటాలు
ఏ ముగ్గుయినా కొట్టిన పిండే!
వాళ్ళ.
ఒక చక్కని సంకల్పంతో
ప్రతి వేకువా,
కళ్లింతలు చేసుకొని చూస్తూ
ధరణి ధరించిన రంగుల
మేలిముసుగు కింద
రమణీయ హస్తాల కృషికి
ఇతోధిక బహుమతులుగా!
క్రుంగిన మనసుకీ
తానో గోవర్థన గిరిధారిగా…!!