బ్రహ్మజ్ఞానం పొందడానికి, సద్గతులు కలగడానికి అనువైన సమయం సంక్రాంతి . వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పుణ్యకాలం.
భోగి అనగానే మనకు గుర్తొచ్చేవి భోగి మంటలు. భోగం నుంచి వచ్చిన పదం భోగి. భోగం అంటే సుఖం, అనుభూతి అనే అర్థాలున్నాయి. అంటే భోగాలు అనుభవించే రోజని భావం.
సూర్యుడి నుంచి ఆరోగ్యాన్ని, యజ్ఞపురుషుడి నుంచి భోగాలను, మహేశ్వరుడి నుంచి జ్ఞానాన్ని, విష్ణువు నుంచి మోక్షాన్ని కోరి పొందాలన్నది భావం.
బుద్ధిని వృద్ధి చేసుకోవడం అనేది సంక్రాంతి పండుగలోని ఆంతర్యం. అందుకే ఈ రోజున బుద్ధికి అధిదేవత అయిన సూర్యుణ్ణి ఆరాధించాల్సిన రోజుగా నిర్ణయించారు పెద్దలు. ఈ శుభ ఘడియల్లో చేసే పూజలు, దానాలతో పుణ్యం కలుగుతుంది.
భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి మూలమైనవి వేదాలు, శాస్త్రాలు. భగవంతుని శ్వాస నుండే ఉద్భవించాయి అని శాస్త్రం చెబుతుంది
మకర సంక్రమణంతో దేవతలకు పగటి కాలం మొదలవడం వల్ల ఈ కాలంలో దేవతలు మేల్కొని ఉండి, కోరిన కోర్కెలు తీరుస్తారని.. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని నమ్మకం.
తరుణి పాఠకులకు, రచయితలకు, శ్రేయోభిలాషులకు భోగి, మకర సంక్రాంతి,& కనుమ పండుగ శుభాకాంక్షలు
– డా. కొండపల్లి నీహారిణి, సంపాదకులురాలు