పువ్వును నేను!
భక్తితో భగవంతుని పాదాలపై వాలి ముక్తిని పొందాను,
పువ్వును నేను!
ఆలయ ద్వారానికి తోరణమై పరవశమందాను!
పువ్వును నేను,
మహాత్ముని మెడలో
హారాన్నయి గౌరవాన్ని
అందుకున్నాను!
పువ్వును నేను,
ఇంతి తలలో చామంతినై పులకరించాను!
పువ్వును నేను,
వధూవరుల కంఠసీమనలంకరించి
తన్మయ మొందాను!
పువ్వును నేను,
నూతన దంపతుల పడకపై పరుపునై
సిగ్గుల మొగ్గయి నాను!
పువ్వును నేను,
చనిపోయిన వారిపై వాలి సంతాపం తెలిపాను!
పువ్వును నేను,
విటుడి పాదాల క్రింద నలిగి తనువు ను చాలించాను!