Practicals
Dt: 13th December, 2023
MEDICINAL SECRETS OF YOUR FOOD – Dr. AMAN
గారి బుక్ నుండి సేకరించి రాసినది
*కొన్ని కాయకూరలుగురించి తెలుసుకుందాము.
ఇవి అందరికీ ఆరోగ్య జీవనానికి
ఉపయోగపడి
ఆ యురారోగ్యములతో సుఖ జీవనముగడపాలనీ
*
బెండకాయ*
కాన్స్టిట్యూషన్ – b
చల్లదనము మరియు తేమ 2°
విత్తనములు లేని తాజా లేత బెండకాయలు 2,
రోజుకు రెండుసార్లు పటికీబెల్లంతో కలిపి తీసుకోవటం వల్ల, తెల్ల బట్ట, వీర్య నష్టం, వీర్యం సన్నబడటం, క్రియాత్మక నపుంసకత్వం, మధుమేహం, మలబద్ధకం, శుక్ల కామెర్లు, అరికాళ్ళలో మంటలు, కళ్ళల్లో మంటలు, శరీరమంతటా మంటలు మొదలైనవి నయం చేస్తాయి.
బెండకాయ యొక్క గుజ్జు:ఇగుజ్జు గోరుచుట్టు, పుండ్లు, సర్పి మొదలైనవాటిని నయం చేయడానికి పై పూతగా రాస్తే చాలా చల్లగాహాయిగాఉంటుంది. దీన్ని రోజూ రాత్రి పడుకునే అరగంట ముందు ముఖం మీద అప్లై చేసి, కడిగితే చర్మాన్ని మృదువుగా చేస్తుంది, మొటిమలను నయం చేస్తుంది మరియు చర్మాన్ని తెల్లబరచి అందం ఇనుమిడింప చేసే సహాయకారిగా పనిచేస్తుంది. బెండకాయ గుజ్జుతోజుట్టు కడిగిన , చుండ్రు మరియు ఇతర సమస్యలు లేకుండా ఉంటుంది.
బెండకాయ యొక్క ఆకులు మృదువైనలేపనంగా(పై పూత గా )ఉపయోగపడతాయి. ఈ ఆకులను జిడ్డు చర్మం మరియు జుట్టును కడగడానికి సబ్బుగా ఉపయోగిస్తారు.
విత్తనాలు లేదా ముదిరిన కాయలను కాల్చి కాఫీగా ఉపయోగిస్తారు.
ఆహారము ఎప్పుడూ కూడా వ్యక్తిగతమైనది – మాస్టర్ R.K*