“ఏమిచేస్తున్నావు వక్కయ్యా”
“ఇది గో !”
“కళ్ళ తో చూడగూడదా”
….”అంటే చూడకుండానే అడిగానంటావా?”
“…….. కాకపోతే?”చుశావుగా!చెప్పాలంటావా”?
“ఎందుకే! రుసరుసలాడుతూన్నావు”
“ఎప్పుడు? ఏదో పని ఈ బతుక్కి”
..….”ఏమైదక్కా?”
“రోజు ఉండే బాగోతమేగా!”
“ఏంటక్కా?” పొద్దుపొద్దున్నే నువ్వు బావ… గొడవ పడ్డారెంటీ?” బావకు నీతో గొడవ పడే! ధైర్యం లేదే…!”
….”చా! చాల్లేవె?”
“మీ బావ పట్ల నీ ప్రేమ!” మీ బావగారు బయట పనులు ఎన్నైనా చేస్తారు కానీ ఇంట్లో మాత్రం?”వంటింట్లోకి రారు. వంటపనంతా ఆడవారిదే అంటారు” దీన్ని ఏమంటావె? మీ బావగార్ని?”
…..కాదక్కా! బావగారు చేసేవాళ్లేమో! కానీ వాళ్ళమ్మాఊరుకోదు గా!
“ఆడవాళ్లు వంట చేయాలని! మగవాళ్ళు సంపాదించాలని నియమం ఉంది కదా! బావొళ్ల మ్మా! వంట చెస్తే ఊరుకుంటుందా? గుర్రున చూస్తుందికల్లెర్రచేస్తుంది.అందరూపెళ్ళాం చాటు మొగుడిని వెక్కిరిస్తారు? అందుకే? బావ చేయ్యరాక్క.?”
“లేదే!… చాతకావటంలే.. పడుకుంటే… ఈ ఇల్లు, పిల్లలు. అంతా ఆగఆగమే…. ఈ ఆడోళ్ళ బతులో వంట అనే పదం తీస్తే ఎంత బాగుండో…!”
“అవునక్కా”
“అందుకేనే నేనో నిర్ణయానికీ వొచ్చా!”
“ఏం చేస్తావ్! ఏంటీ”
“ఇన్నేళ్లు మౌనంగా ఉండబట్టే ఆడోళ్లకు ఈ బాధలు”
” అంటే మౌనంగా ఉండోద్దక్కా! ఏమిటో చెప్పక్కా తొందరగా”
“ఇప్పుడర్థం అయింది”…ఆడవాళ్ళు ఎందుకు బలహీనమై పోతున్నారో! అని”
“ఎందుకక్కా?”
” యుగయుగాలుగా, తరతరాలుగా ఆడవారు తెల్లవారకముందేనిద్ర లేవాలి. లేవగానే మొగుళ్ళ పాదాలకుమొక్కాలి. తాళిబొట్టుకళ్ళకద్దుకోవాలి. వరలక్ష్మీవ్రతాలు, శ్రావణమాస మంగళ,గురు,శుక్ర వారాలునోములు వంటివి సంవత్సరాల తరబడినోచుకుంటూ వుండాలి. వాటిపరమార్థం మోక్షం లభించాలని కాదు. ఐదవతనం ఉండాలని!! మొగుళ్ళు దీర్ఘాయురారోగ్యాలతో విలసిల్లాలని. లేకపోతే ఈ బ్రతుకులకి పట్టుచీరలుండవు పేరంటాలుండవు. జుట్టుకు పూలు మొహాలకి బొట్లు కూడా వుండవు.
“ఓ అక్కో!వాళ్ళు అన్నం తినొద్దని పూజలు చెయ్యండి అనిచెప్పారా!….. వీళ్లే లేనిపోని ఆంక్షలు పెట్టుకొని” వొళ్ళు హూనం చేసుకుంటూడ్రు..
“అవునే! ఏ మగాడైనా వంటవార్పు చేసిన పాపాన పోయారా!”…ఆడోళ్ళకే ఈ పనులు పెట్టారెందుకే…?”
” అక్కో! ఆడోళ్ళను పరీక్ష చెయ్యగల మొగాడేవడు భూమ్మీద” పుట్టలే…?”
“అవునులేవే!”నువ్వు“మగమహారాజువు”అయి పుడితే బాగుండేదేమో!”
“కాదక్క!ఆడమగఇద్దరూకలిసి పనిచేసుకుంటే ఎలాంటి సమస్యనే! రాదు ఈతేడాలు అసలే రావు?”
“ఆది కాదే! నీఆలోచనావిధానం సరికాదనిపించింది.!”
“అక్కమగవారిలో దోషాలువెతుకుతూ కూర్చున్నావు. ఇంటి చాకిరీ ఆడోల్లె చేస్తారు.మగవారుకాలు మీద కాలు వేసుకుని తనమీద పెత్తనం చలాయిస్తున్నారని అపోహ పడుతూ వచ్చింది సమాజం. కాని వారు విధి నిర్వహిస్తున్నారు కదా! ఉద్యోగంలో అనేక సాధకబాధకాలు వుంటాయి. అధికారి నుంచి అప్పుడప్పుడు అవమానకరమైన మందలింపులు కూడా పొందవలసి వుంటుంది.డబ్బు లేదన్న మాట చెప్పారు!. సరికదాఎంత కావాలంటే అంతా తన చేతిలో పోస్తున్నారు. వంటపని, ఇంటిపని అంటే మగవారికీ ఎలా చాతవుతుంది పాపం? మగవారిలో దోషాలు వెతకడం మానుకోవాలి. ఈ సంసారమనే బండిలోఎవరి బాధ్యతలు వాళ్ళకి ఉన్నాయి, ఉంటాయి కదా…!
“నీజమే నావె! అవునేఇంట్లో అందరూ…. అంటుంటారు…?”
“ఒక్కసారి ఆలోచించాక్క”
“నీ మాటలతోమనస్సు తేలికపడిందే”మనసు సంతా ఎంతో ప్రశాంతత ఆవరించిందే. ఆలోచనావిధానంలో మార్పు రాగానే గుండె చెమరించిందే. కన్నీళ్ళు ఉబికి ఉబికి వస్తూంటే, మీ భావ గుండెల మీద వాలిపోలనివుందే.