పరిమళించే సాహిత్య కుసుమం (సాహితీ) వనపర్తి పద్మావతి…

మన మహిళామణులు

రసప్లావితమైన హృదయ వీణ ఉద్వేగంతో నినదించినపుడు పలికే కవితానిక్వాణం ఎపుడు చైతన్య భరితంగా ఉంటుంది. మానవ శ్రేయోచింతనను వ్యక్తం చేస్తుంది. వసంతకోకిలమై రాగాలు పలికిస్తుంది. ఆప్యాయతజల్లై అనురాగాన్ని కురిపిస్తునే పరుగెత్తే గోదారియై మనసులను ఆనందంతో తడిపేస్తుంది. సాంఫీుక దూరాచారాలపైన కూడా తనదైన శైలిలో నరసిస్తారు. సమాజంలోని కుళ్ళును ప్రశ్నించడంతో పాటు గడ్డ పూవులో సహితం రసజ్ఞత చూడగలిగిన భావుకురాలు. తన మనసులో కలకలం రేపుతున్న ఎన్నో భావాలకు అక్షర రూపం వనపర్తి పద్మావతి రచనలు. వీరి కవిత్వం అవధుల్ని చెరిపేసిన స్వచ్ఛమైన అమ్మ మనస్సు నుండి పుట్టిన మమకారం గా చూడవచ్చు.

                                      వనపర్తి పద్మ

‘‘కవిత్వం మనకు మనం రాసుకునే వీలునామా, మనకు మనం కూర్చుకునే చిరునామా’’ అది తరాలు మారినా చెదరనిది అన్నట్లు పద్మావతి కవిత్వం రాసిన, కథలు రాసిన, వ్యాసం వెలువరించిన నిజ జీవితపు దర్పణంగానే కనిపిస్తుంది. ఎదలోతుల్లోని అలజడుల నుండి ఎదటివారి భావాలను చదవగల్గె సున్నితమైన హృదయ స్పందనలకే ఆమె కలం అక్షరాలతో జతకట్టి అక్షర స్వేద్యం చేస్తున్నారు పద్మావతి. వివాహ బంధానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. నేటి సమాజంలో ఆర్థిక అవసారాల దృష్టా భార్య-భర్తల నడుమ దూరం అనివార్యం పురాణాల్లో చెప్పినట్లు ఆ నాటిసతి యాజ్ఞాగ్నిలో దహించుకుపోయింది. ఈ నాటి సతులు విరాహగ్నిలో జ్వలిస్తున్నారు. కాని పద్మావతి సతిలాకాలిపోలేదు. కూలిపోలేదు, పార్వతిలా తాపసి అయింది, అర్థనారీశ్వరీయై విజయకేతనం ఎగురవేసింది.

డాక్టరేట్ పురస్కారం 9 డిసెంబర్ 20232

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు వనపర్తి పద్మావతి ప్రపంచ దేశాలలోనే మొట్ట మొదటి సామ్రాజ్యం, కాకలు తీరిన ఎందరో మహావీరుల జన్మస్థలి, రాజుసానికే వన్నె తెచ్చిన రాణి రుద్రమ నడయాడిన నేల, కాకతీయుల రాజధాని ఓరుగల్లు ఖిల్లాలో డిసెంబర్‌ 25, 1964 సం॥లో జన్మిచింది, అమాయకత్వపు అంచులలో పయనిస్తూ, చిరుప్రాయం నుండే మేధాసంపత్తికి నిధియైనా, సంప్రదాయపు సందుల్లో, సంస్కృతి కట్టుబాట్లతో ఎదుగుతూ బాల్యం నుండి పాఠశాల విద్య అంతయు ఖమ్మం మెట్టులో పూర్తి గావించి, కళాశాలపు మెట్లను ఖమ్మంలోనే తాకించిన, పద్మావతి చిరుప్రాయంలోనే వనపర్తి చంద్రశేఖర్‌ గారితో వైవాహిక జీవితంలో అడిగిడి, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయికి తల్లియై, పిల్లలకు పాలు, మురిపాలు పంచుతూ తిరిగి తన విద్యను కొనసాగించారు. తన పిల్లలకు తానే ఆదర్శంగా నిలుస్తూ, ఉన్నత విద్యను అభ్యసించి 1992 సం॥లో బి.ఎ., 1994లో ఎం.ఎ., పూర్తి చేసి, తన పిల్లలకే కాకుండా ఆనాటి తరానికి, నేటి తరానికి ఒక ఆదర్శమైన తల్లిగా, గృహిణిగా, భార్యగా నిలబడడం గొప్ప విషయం. తాను ఉన్నత విద్యను అభ్యసించడమే కాకుండా తన పిల్లలకు ఉన్నత విద్యను గరిపి విద్యావంతులుగా తీర్చిదిద్ది, ఎన్నో కష్టనష్టాలను అనుభవించి, అధిగమించిన పద్మావతి నాటి, నేటి, భావితరానికి ఆదర్శనీయురాలు.

సంసార సాగరంలో తేలియాడుతూ, సమస్యలను అదిగమిస్తూ, కుటుంబ విలువలను పాటిస్తూ, సంసారం అనే మూడుముళ్ళ బంధంలోనే చిక్కుపడి పోకుండా, సామాజిక చైతన్య దీప్తి లాగా వెలుగొందుతూ రేడియో ప్రసంగాల ద్వారా సాహిత్య లోకానికి పరిచయమై, తనలోని ఆలోచనలకు, అనుభవాలకు పదును పెడుతూన్న పద్మావతి నాటి మహిళలు కత్తి పట్టి యుద్దం చేస్తే, నేటి మహిళ పరిమళించే సాహితీ కుసుమమైన కలం పట్టి మనోనేత్రాన్ని తెరిచి, తన భావజాలంతో ఈ సమాజాన్ని కొంచమైనా కదిలించే ప్రయత్నం చేస్తూ భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలకు, అక్షర శాసనాలు అందిస్తూ, ఎంతో మంది నవసాహితీపరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది పద్మావతి. తను వ్రాసిన బతుకమ్మ వ్యాసం ఉస్మానియా విశ్వ విద్యాలయపు రిసెర్చ్‌ స్కాలర్‌ తన పరిశోధనా గ్రంథానికి ఉపయోగించుకోవడం విశేషం. గ్రామ దేవతారాధనా విశిష్టత కలిగిన బోనాల పండుగ వ్యాసాన్ని డాక్యుమెంటరీగా చిత్రీకరించడం ఎంతో అభినందనీయం.

.నాలుగు దశాబ్ధాలుగా తన సాహితీ ప్రస్థానాన్ని కొనసాగిస్తూ, ప్రముఖ రచయితగా కథలు, కవితలు వ్యాసాలు, టి.వి. రేడియోలోను, అనేక వేదికలపై స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఎన్నో తనను ‘‘ఉపన్యాసశిరోమణి’’ స్థానంలో కూర్చోబెట్టాయి. పద్మావతి రచన ప్రక్రియలు ఎన్నో పత్రికల్లో అచ్చు అయినాయి. ‘సంబరం’ అనే మొదటి రచన శ్రీనందిని సిద్దారెడ్డి గారు నిర్వహిస్తున్న ‘‘సోయి’’ అనే పత్రికలో అచ్చవడం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందంటారు. అనురాగ వీఛికలు, సగటుమనిషి, ‘‘నీవే నా ఆలోచన’’ మొదలైన రచనలు వీరి కవితా సంకనాలుగా పుస్తకరూపంలోకి వచ్చాయి. వివిధ పత్రికల్లో అచ్చవడం విశేషం. ఆధునిక సమాజంలో మహిళ, తరాల అంతరాల్లో, స్త్రీ బతుకమ్మ, బోనాల విశిష్టత, దేవతారాధన, వెలుగు నీడలు, నరమూల్యం, మనసుమమత, మౌన హృదయం మొ॥వి, ఎన్నో కథలు, కథానికలు వ్రాస్తూ, రేడియో, టి.వి. కార్యక్రమాల్లో ప్రసంగిస్తూ డాక్టరేట్‌ సాధించలాన్న లక్ష్యంలో అక్షర సేద్యం చేస్తున్న వీరిని జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో ఎన్నో పురస్కారాలు వరించాయి

తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ 8 మార్చి 2023

రాష్ట్రస్థాయి ఉత్తమ కవితా అవార్డు-2004 లో ప్రారంభమైన అవార్డుల ప్రస్థానం హృదయ భారతి రాష్ట్రీయ అవార్డు, ఉపన్యాస శిరోమణి-2015, ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ కవితా సాహిత్య పురస్కారం-2018, డైనమిక్‌ లేడి లెజెండ్‌ అవార్డు, నేను సైతం ప్రిమియర్‌ అవార్డు, అస్థిత్వ రాష్ట్రస్థాయి అవార్డు, రాష్ట్ర స్థాయి విశిష్టనేవాపురస్కారం, కాకతీయ కళాకెరటం అవార్డు, నేషనల్‌ యూత్‌ ఐకాన్‌ అవార్డు, సావిత్రీబాయి పూలే నేషనల్‌ ఫెలోషిప్‌ అవార్డు, స్ఫూర్తిరత్న అవార్డులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వేదిక విజ్‌డం నేషనల్‌ లిటరేచర్‌ అవార్డు, గోల్డెన్‌ స్టార్‌ అవార్డు, దాదాపు ఒక 30 కు పై పురస్కారాలు, సత్కారాలు పొందడం ఓరుగల్లు బిడ్డగా గర్వించదగ్గ విషయం. నేటి నారీలోకానికి ఆదర్శమహిళగా, కవయిత్రిగా, సామాజికవేత్తగా మున్ముందు మరెన్నో అవార్డులు, రివార్డులతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశిద్దాం. కళాతపస్వి వార పత్రికకు బ్యూరో చీప్‌ గాను ఎ.ఎన్‌.ఎస్‌. యూ ట్యూబ్‌ ఛానెల్‌ కు కన్వీనర్‌ గా వ్యవహరిస్తున్నారు. ‘ది లెజెండ్‌’ 140 మంది ప్రముఖుల జీవిత చరిత్రలతో కూడిన పుస్తకానికి సంపదకత్వం వహిస్తున్నారు.

మనం గొప్పగా బ్రతకడం గొప్పవాడు. మన చుట్టూ ఉన్న సమాజాన్ని గొప్పగా బ్రతికేలా చేయడం గొప్ప అని భావించే చైతన్య భావన పద్మావతిని. కనీసం తృప్తిగా బ్రతికేలా చేయాలని తపించే మానవతా మూర్తి వనపర్తి పద్మావతి తన ప్రాథమిక కర్తవ్యంగా భావించి అనాథలకు, అభాగ్యులకు, వృద్ధులకు వికలాంగులకు తన వంతు ఆర్థిక చేయూతను సహాయ సహకారాలను అందిస్తూ, తనలోని సేవా తృష్ణను తీర్చుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

స్నేహాలయం

వికాస వెలుగులు