స్నేహాలయం

(కవిత)

జిల్లా హర్షిత

నా కళ్ళకు కాటుక ఏమైపోయింది
నా ముఖంలో చిరునవ్వు ఎక్కడికెగిరి పోయింది
నా మనసుకు ఆనందం ఎందుకు దూరం అయింది
పోతూ పోతూ నావాడే తీసుకెళ్ళి పోయాడు

లో ఉన్న చిలిపితనము ఏమైపోయింది
నాలో ఉన్న కొంటెతనం ఏమైపోయింది
నాలో కొత్త గొంతు మూగదెందుకైపోయింది
పోతు పోతు నా వాడే తీసుకువెళ్లిపోయాడు

నా మనసులో నుంచి తీసుకెళ్లిపోయాడు
నా ఊపిరి నుంచి తీసుకెళ్లిపోయాడు

వదిలిపెట్టను రా
నువ్వు వదిలిపెట్టను రా
ప్రాణం పోయే దాకా విడిచిపెట్టను రా
ఊపిరి ఉన్నంతవరకు నా మనసుకు అబద్ధం చెప్పి బతికిస్తారా

మనసులో ఉన్న నువ్వు
మాటల్లో లేవు
గుండెలో నిన్ను దాచి కప్పేస్తా
మాటకు కట్టుబడి
మనసుకు సర్ది చెప్పేస్తా

బాధలో ఉంటే బాధనైపోతా
ఆనందంలో ఉంటే ఆనందమైపోతా
అందరిలో ఉంటే అమ్మనైపోతా
వదిలిపెట్టను రా
నేను వదిలిపెట్టను రా
స్నేహానీకే గుడి కట్టేస్తారా

Written by Jilla Harshitha

జిల్లా హర్షిత
7 వ తరగతి
ZPHS పాలకుర్తి
జనగాం జిల్లా, తెలంగాణా రాష్ట్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

పతంగి

పరిమళించే సాహిత్య కుసుమం (సాహితీ) వనపర్తి పద్మావతి…