1. మౌనం స్పృషిస్తున్న
గత గాయాల శబ్దాలు
ఊపిరి లయలో
ఎగిసిపడుతుంటే
అసంకల్పిత చర్యగా
సడి చేయని దుఃఖం
అశ్రుపాతమై ప్రవహిస్తుంది
2. శూన్యం తెరమీద
ఒక్కొక్కటిగా కనుమరుగైపోతున్న
వాస్తవ దృశ్యాలు
మెలకువగానే అచేతురాలిని చేస్తున్నప్పుడు
కలం వాకిటిపై దిగులు దుబ్బు మౌనంగానే రోదిస్తుంది
3. గిర్రున తిరుగుతున్న
అనుభవాల గోళం
జీవిత పయనంలో
కుదుపుతో ఆగినప్పుడల్లా
ప్రతి శబ్దం ఒక హెచ్చరికే అవుతుంది
ఏదేమైనప్పటికీ
గమనం ఒక చరిత్రకు
సాక్ష్యం!!