గజల్ చతురస్ర గతి

కవిత

            ఎం. వి. ఉమాదేవి

బ్రతుకుకు అర్థం ఏదో తెలియని దేహము ఎందుకు?
చితికిన మనసుని సరిచేయాలని మథనము ఎందుకు?

పూలను ముళ్లను సరిసమానమై చూసే క్షణములు
వంకలు పెట్టే వారసులుంటే శోకము ఎందుకు?

వాస్తవ చిత్రం వసుధను భద్రం దైవం సృజనలు
మార్చుట యత్నం చేయుటలోనే కుటిలము ఎందుకు?

తారల సన్నిథి తన్మయమందే జాబిలి అదృశ్యం
మేఘపు కౌగిలి తప్పనిరోజున క్రోధము ఎందుకు?

కళలను కలలుగ రెప్పలలోనే దాచుట నీవిధి
మూర్ఖుల కోసం ముత్యపు హృదయం దహనము ఎందుకు?

రంగం ఎక్కిన వేళల పాత్రల ఆవాహనములు
రంగులు తుడిచిన తదుపరి కూడా నటనము ఎందుకు?

లేచే అలవై ఉమఅక్షరమై ముద్రిత భావన
సాగరఘోషగ సాగుతు ఉంటే నాకము ఎందుకు?

Written by Mv Umadevi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమ్మ ఫొటో

కోడలు పిల్ల