వంటింటి కళ

టమాటో పచ్చడి

           జ్యోతిర్మయి

టమాటో 1/2kg
నూనె 30-40gms
పచ్చి మిర్చి 20
ఎల్లిపాయలు 15
జీలకర్ర 1tsp
ధనియాలు 1tsp
పుదీనా 1గుప్పెడు
పసుపు 1/2tsp
ఆవాలు 1/2tsp
శనగపప్పు 2tsp
కరివేపాకు 2రెమ్మలు
ఉప్పు 1tsp లేదా కాస్త తక్కువ


టమాటోలు ఎరుపు కాస్త పచ్చగా, కాస్త గట్టిగాఉన్నవాటినితీసుకొని,కడిగి, ముక్కలుగా కట్ చేసుకొని ఒక మందపాటి గిన్నెలో వేసి,2tsp నూనె వేసి, కాస్త పసుపు
వేసి కలిపి స్టవ్ పై పెట్టి, మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు అంటకుండా కలుపుకుంటూ ఉండాలి.చివర 5నిముషాలు మూత తీసి, నీరు ఇగిరిపోయే వరకు చిన్న మంట పై ఉంచి, అప్పుడప్పుడు కలుపుకోవాలి. తరువాత దీన్ని చల్లారనివ్వాలి.
ఇప్పుడు మూకుడులో కాస్త నూనె వేసి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, 1/2tsp జీలకర్ర, ధనియాలు వేసి వేగనిచ్చి, పుదీనా వేసి పచ్చి వాసన పోయేలా వేయించి, పసుపు వేసి కలిపి దింపేసి చల్లారనివ్వాలి.
ముందుగా చిన్న జార్ లో వేయించిన దినుసుల్ని, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత సగం పేస్ట్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటోను సగం జార్ లో వేసి 2,3సార్లు మిన్సింగ్ బటన్ నొక్కాలి.దీన్నిగిన్నెలోకి తీసుకోని,తరువాత మిగిలిన పచ్చిమిర్చి పేస్ట్ ఉడికిన టమాటో జార్ లో
వేసి ఇలాగే తిప్పాలి. పచ్చిమిర్చి పేస్ట్ చిన్న జార్ లోనే బాగా నలుగుతుంది. పేస్ట్ చేసుకున్న తర్వాత కావాలంటే పెద్ద జార్ లోకి మార్చుకొని మొత్తం ఉడికిన టమాటో వేసుకొని 2,3సార్లు మిన్సింగ్ చేసుకోవాలి. తరువాత నూనె వేసి,2tsp శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, చిటికెడు పసుపు వేసి పోపు పెట్టుకోవాలి. కాస్త కారం కారంగా తినాలనుకొనేవారు పోపు వేసుకోక పోతే సరి. ఇది అన్నంలోకైనా, దోశ, ఇడ్లిల్లోకి ఐనా బాగుంటుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నీ స్నేహమే…

అమ్మ ఫొటో