హొమాయ్ వ్యారవల్ల

భారతదేశపు మొదటి మహిళా ఫోటో జర్నలిస్టు .’పద్మ విభూషణ్’ గ్రహీత . గుజరాత్ లోని ‘నవ్సారీ’లో 1913,డిసెంబర్ 9న ‘పార్సీ’ కుటుంబంలో జన్మించారు.
జే.జే .స్కూల్ ఆఫ్ ఆర్ట్స్, లోను, ముంబై విశ్వవిద్యాలయంలోనూ విద్యనభ్యసించారు. జె. జె.లో సహాధ్యాయి , ఫోటోగ్రాఫర్ అయినా మానేక్షా వ్యారావల్లను వివాహం చేసుకున్నారు.1930 లో బాంబేలో నివాసముంటూనే వృత్తి లో ప్రవేశించారు. మొదట పరిచయం చేసింది కూడా ఆమెనే .

ఈమె తీసిన ఫోటోలు మొదట తన భర్త పేరిట ప్రచురించే వారు. తర్వాత’ డాల్డా 13 ‘పేరుతో వచ్చేవి. ఆమె
అన్ని వృత్తుల, వర్గాల ప్రజల్ని ఫోటోలు తీస్తూ ప్రపంచానికి పరిచయం చేశారు .ఈమె మొదటి అసైన్మెంట్ ‘బాంబే క్రానికల్ ‘స్థానిక వార్తా పత్రిక వారు ప్రచురించారు. గుర్తింపు అధికం కావడంతో వీరి మకాం 1942 లో ముంబై నుండి ఢిల్లీకి మార్చారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత’ ఇలెస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో’ 1970 వరకు పనిచేశారు. ఆ సమయంలో ఆమె తీసిన నలుపు తెలుపు ఛాయా చిత్రాలు తర్వాత తరాలకు ప్రతిరూపాలుగా నిలిచాయి.ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా గాంధీ, నెహ్రూ, జిన్నా ,ఇందిరాగాంధీ,గాంధీ- నెహ్రూ ల కుటుంబాల ఫోటోలు చాలా తీసారు.స్వాతంత్ర్యం ముందు,తరువాత నవభారత నిర్మాణంలోని ఎన్నో సందర్భాల్లో, ఎన్నో అంశాలపై ఛాయా చిత్రాల్ని తీసారు. 1973లో భర్త మరణానంతరం ‘వదోదరా’ లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు .

“నేను ఫోటోగ్రాఫర్ అవుతానని ఏనాడు అనుకోలేదు అంటారామె”. డాక్టర్ కావాలనుకున్నాను కానీ
వృత్తిలో షిఫ్ట్ ల కారణంగాతన తల్లి నిరాకరించారని అందుకే ప్రెస్ ప్రోటోగ్రాఫర్ అయ్యానని కానీ ఇది అత్యంత దారుణమైన వృత్తి అని ఆమె గ్రహించలేకపోయారని అంటారామె. ఏనాడు వృత్తిలో వివక్షకు గురి కాలేదు. కారణం పాఠశాల స్థాయి నుండి తరగతిలో ఒక్క అమ్మాయి ని కావడం తో మగవాళ్లతో ఎలా ఉండాలో అలవాటయ్యిందంటారు. 9కిలోల భారీ ఫిలిం కెమెరాతో ఎక్కువగా పని చేయాల్సి వచ్చేదని అంటారు.’న్యూయార్క్ మెట్ మ్యూజియం ‘షోలో పాల్గొన్న మొదటి భారతీయ మహిళా ఫోటో జర్నలిస్టు. ‘ది న్యూ ఉమెన్ బిహైండ్ ది కెమెరా’ పేరుతో 2021 లో ఢిల్లీలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు .
తన ఛాయాచిత్రాల సేకరణను ‘అల్కా ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్స్’ సంస్థకు ఇచ్చేశారు .
“తన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన సంఘటన గాంధీ జీ హత్యా సమయంలో ఫోటోలు తీసే అవకాశం కదరకపోవడమంటూ బాధను వ్యక్తపరుస్తారు.

“2011లో భారత ప్రభుత్వం ఆమె సేవలకు గుర్తింపుగా ‘పద్మవిభూషణ్’తో సత్కరించింది. గాంధేయవాది గా అతి సాధారణ జీవితం గడిపిన హొమాయ్ తన 98వ యేట ఊపిరి తిత్తుల వ్యాధితో తుది శ్వాస విడిచారు. 104 వ జయంతి సందర్భంగా ‘గూగుల్’, ‘డూడుల్ ‘ద్వారా నివాళి అర్పించింది. ‘ఫస్ట్ లేడీ ఆఫ్ ది లెన్స్’ శీర్షికతో ఉన్న ఈ ‘డూడుల్’ మధ్య హొమాయ్ చిత్రం ఉంది. ఇంతటి మణిరత్నాన్ని
స్మరించుకోవడం ఒక గొప్ప అనుభూతి.

రాధికా సూరి

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మనోనిబ్బరానికి ప్రతిరూపం – వాసిరెడ్డి సీతాదేవి

ఎలా?…