మన మహిళామణులు

 తరతరాల బతుకమ్మ కు బ్రతుకు ఇచ్చిన బండారు సుజాతా శేఖర్ – అచ్యుతుని రాజ్యశ్రీ

బండారు సుజాతా శేఖర్

ఆమె తోటే తెలంగాణా లో బతుకమ్మ రంగురంగుల సింగిడీల పూలపండుగ గా అవతరించింది.తెలంగాణాబతుకమ్మపాటలపై తొలి రిసెర్చ్ స్కాలర్ గా ఖ్యాతి గడించారు 2023లోబతుకమ్మ ఫౌండేషన్ ప్రెసిడెంట్ గా ఆమె ఎన్నో గౌరవపురస్కారాలు తనఖాతాలో వేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి లక్షరూపాయలు బహుమతి పొందారు.
అమ్మ నాన్నలు అనసూయమ్మ మల్లయ్య గార్లు.తల్లి చాలా బాగా పాటలు పాడటంతో స్వతసిద్ధంగా సుజాత గారికి పాటలు కవిత్వం స్వయంగా పాడటం
అబ్బాయి.నర్సింహశతకం కరతలామలకం.హైస్కూల్ విద్యార్ధినిగా కవిత పై పట్టు సాధించారు.చుట్టుప్రక్కల స్త్రీలు వారి కష్టాలు కన్నీరు కథలు వింటూ వచ్చిన ఆమెలో సంఘసేవ చేయాలనే తాపత్రయం పెరిగింది.
2కోఠి ఉమెన్స్ కాలేజీ లో డిగ్రీ పొందారు.భర్త తోడ్పాటుతో ఇటు చదువు అటు ఉద్యోగం లో రాణిస్తున్నారు.కవితాపుష్పం తో ఆరంభం ఆమె సాహితీ జీవితం.నల్గొండలోని దేవరకొండలో పుట్టిన ఈమె జెడ్.పి.హెచ్.ఎస్.గుజ్జలో స్కూల్ అసిస్టెంట్ గా ఉన్నారు.(ఆంగ్లం). ఎం.ఎ. ఎం.ఇడి.పి.హెచ్.డి . చేశారు.ఆపరిశోధన” stop harassment on girl child / women and save them”. ప్రభుత్వ డిప్యుటేషన్ MGCDO గా ఎన్నో ప్రోగ్రాం లు చేశారు. 3ఏళ్ళు ఆమె చేపట్టిన ప్రతి ప్రోగ్రాం విజయవంతం ఐంది.42మాబడి పాఠశాలలు ఏర్పాటు చేశారు.
3 మండలం జిల్లా పోలీసు శాఖల చేయూత తోఆడపిల్లల అమ్మకాలకు అడ్డుకట్ట వేశారు.1998_2002 లో 63 మంది బాలకార్మికులకు విముక్తి కల్గించారు.తెలంగాణా ఏర్పడ్డాక ఎన్నో ప్రజాసంబంధ ప్రోగ్రాంలలో పాల్గొంటున్నారు.షీటీమ్స్ ఆధ్వర్యంలో బడి కాలేజీ లో జరిగే వాటిలో ఆమె పాలుపంచుకుంటున్నారు.ఆడపిల్లను పుట్టనిద్దాం పెరగనిద్దాం చదవనిద్దాం అనే థఈంతఓ10 రోజులు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.సాంస్కృతికమండలి జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర మంతా విస్తృత ప్రచారం చేసిన ఘనత ఆమెదే.టీచింగ్ తోపాటు బాలలపురోభివృద్ధికై కృషి చేస్తున్నారు.ఎంతోమంది
4రచయితల పుస్తకాలు ఆవిష్కరించారు.ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ స్టేట్ ఎక్జిక్యూటివ్ మెంబర్ గా
ఎన్నో నేషనల్ సెమినార్స్ కి హాజరైనారు.నల్గొండజిల్లా రచయితల సంఘం సెక్రెటరీ.అక్షరయాన్ కళావిభాగ్ కిరాష్ట్ర ఛైర్మన్.2014_15 తెలంగాణ ప్రభుత్వ జాగృతి తెలంగాణ ఉద్యమం పురస్కారం తో సత్కరించింది.2017 ప్రపంచ తెలుగు మహాసభల్లో కమిటీ మెంబర్ గా గుర్తింపు పొందారు.తెలుగు అకాడమీ వారికి శ్రీ కె.సి.గుప్తా జీవిత చరిత్ర రాస్తే సి.ఎం.కె.సి.ఆర్.దాన్ని రిలీజ్ చేశారు.తానా తాసా(సౌత్ ఆఫ్రికా) ఆస్ట్రేలియా ఇంకా 25దేశాల టీం స్పెషల్ గెస్ట్ గా
5వర్చువల్ మీటింగ్స్ లో పాల్గొన్నారు.ఈమెకు వచ్చిన పురస్కారాలు కొన్ని మాత్రమే ప్రస్తావిస్తాను. SSY పురస్కారం బి.ఎన్.రెడ్డి పురస్కారం వాసవి యూత్ అవార్డు హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ అవార్డు మహిళా శిరోమణి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం ఎన్నో ఎన్నెన్నో.ప్రభుత్వ అచ్చు పుస్తకాల రచనలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ నేటి తెలంగాణ రెగ్యులర్ ఓపెన్ డిస్టెన్స్ మోడ్ లో100 పుస్తకాలు మాడ్యూల్స్ తయారీలో పాలుపంచుకున్నారు.టి.వి.లో అన్ని ఛానెల్స్ లో డి.డి.యాదగిరిలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్.ఎం.లో ప్రోగ్రాంలు లెక్కలేనన్ని ఇచ్చారు.ఆమెరచనలు అన్ని పేపర్లలో వస్తున్నాయి
6బతుకమ్మ గతం అనే సినిమాలకి లిరిక్స్ రాశారు.ఈమెరాసిన పుస్తకాలు దాదాపు అన్ని లైబ్రరీ లలో ఉన్నాయి.
సుజాత గారు ఓపెన్ స్కూల్ సొసైటీ కరిక్యులం ఇన్చార్జి గా పనిచేశారు.WAM లో ఎంతోమంది సభ్యుల్ని చేర్చారు.ఎన్నో సాహిత్య పోటీలకు కోఆర్డినేటర్ గా 2020నుంచి వ్యవహరిస్తున్నారు.ఆర్యవైశ్య సంస్థలు బాగా ముందుకి సాగేందుకు చేయూత నిస్తున్నారు.1994నుంచి దేవరకొండలో వాసవి మహిళా మండలి ఫౌండర్ గాఫ్రీగా ఆమె చేసిన కార్యాలు చెప్పుకోవాలి స్త్రీలు వ్యక్తి గతంగా వృత్తి పరంగా ఎదిగేలా ప్రేరణ ప్రోత్సాహం కల్గిస్తున్నారు.బిల్డింగ్ కట్టించారు.ఆనాటి
7ఆంధ్రప్రదేశ్ వైశ్యమహాసభ కల్చరల్ ఛైర్మన్ గా ఆమె చేసిన కృషి అమోఘం.వాసవీస్రవంతిలో ఆమె పాటలు రచనలు ప్రచురింపబడినాయి.మహిళావిభాగ్ లోఆమె పనితనానికి శ్రీ కొణిజేటి రోశయ్య గారు (, గవర్నర్
ఎంతో ప్రశంసించారు.ఇంకా సీనియర్ నాయకులుమార్గదర్శకులైన సర్వశ్రీ కొత్తూరు సీతయ్య కె.సి.గుప్తా వేలూరి దుర్వాసులు లింగయ్య నారాయణ శెట్టి కబలవాయి రాధాకృష్ణ గార్ల అండదండలు లభించాయి.ఆర్యవైశ్య సంస్థలసమాఖ్య వైస్ ప్రెసిడెంట్ గా దేశంలోని విద్యార్ధులకు ఇతరులకు ప్రాంతీయ భేదాలు లేకుండా కావాల్సిన సాయం ఏర్పాటు చేశారు.వాసవీక్లబ్ ల్ని నెలకొల్పారు.

ఉయ్యాలండి ఉయ్యాల అంటూ పిల్లల కోసం తను ఉయ్యాల పాట పాడిన చిత్తుచిత్తుల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ అంటూ కోలాటం పాట గళమెత్తినా ఆమె పాటకు వందల గళాలు గొంతు కలుపుతాయి, పాదాలు అడుగులేస్తాయి. చేతులు నాట్యం చేస్తాయి. ఆమె పాట రాసినా, పాడినా అందరి గుండెలు శృతిలయలతో కోకిలమ్మ రాగాన్ని విన్నట్టు శివనాధాన్ని అనుభవించినట్టు అనుభూతి పొందుతాయి . ఆమె తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కార గ్రహీత ,తెలంగాణ ప్రభుత్వ జిల్లా పురస్కార గ్రహీత.ఎన్నో ఎన్నో అవార్డులకు వన్నె తెచ్చి నాటి ముఖ్యమంత్రి నుండి నేటి ముఖ్యమంత్రి వరకు నాటి గవర్నర్ నుండి నేటి గవర్నర్ వరకు అందరినీ అలరించింది ఆమె మాట ఆమె పాట. ఆమె కవితాక్షరం… Lion డాక్టర్ బండారు సుజాత శేఖర్, సామాజిక కార్యకర్త ,కవయిత్రి, పాఠ్యపుస్తక రచయిత్రి.

డాక్టర్ సుజాత శేఖర్ గారు పాఠ్యపుస్తక రచయిత్రిగా, సామాజిక సేవలో పాల్గొంటూ ,అక్షరాస్యత కోసం అలమటించి ఆడవాళ్ళ చదువుతో ప్రగతికి నాందిగా కదిలి కదిలించి ఎన్నో సమస్యలపై తన పాటలతో తన గలంతో స్పందన కలిగించారు. మారుమూల గిరిజన ప్రాంతంలో తపించి శ్రమించిన సుజాత శేఖర్ గారిని హాన్స్ ఇండియా పత్రిక బతుకమ్మ సందర్భంలో ప్రత్యేకంగా పరిచయం చేసింది.ఫిఫ్టీ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఇన్ తెలంగాణ…అంటూ తమిళనాడుకు చెందిన ఒక గొప్ప ఫోటోగ్రాఫర్ కొంతమంది స్పాన్సర్స్ సహకారంతో ఒక గొప్ప ఎగ్జిబిషన్ నిర్వహించారు. పుస్తకాన్ని ప్రచురించారు. బతుకమ్మ పాటల తొలి పరిశోధకరాలు,సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల కవయిత్రిగా,గాయకురాలుగా సుజాత శేఖర్ గారికి ఆ పుస్తకం లోచోటు దక్కింది.ఆ పుస్తకాన్ని ప్రస్తుత గవర్నర్ తమిళ్ సై గారు ఆవిష్కరింప చేశారు.అదే వేదికపై మరి కొన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ సంస్థల ద్వారా స్త్రీ శక్తి పురస్కారాన్ని కూడా సుజాత శేఖర్ గారు అందుకున్నారు. ఇలా మన మధ్యలోనే ఉంటూ అందరికీ స్ఫూర్తిగా నిలిచిన ఆమె వెలుగుతూ వెలుగిస్తు పదిమంది కోసం తపించడం హర్షనీయం అభినందనీయం.
8జోన్ ఛైర్మన్ గా కొన్ని పల్లెల్లో ట్రైబల్ ఆటవిక జాతుల స్త్రీల లో జాగృతి కల్గించి వారి ఆరోగ్యం శిశుపోషణపై ఆడపిల్లల సంరక్షణ పై అవగాహన కల్పించారు.శిశుహత్య ఆడపిల్లని అమ్మడం పై శ్రద్ధపెట్టి స్ఫూర్తి రగిల్చారు.బతుకమ్మ ఫౌండేషన్ ని ఆమె భర్త శ్రీ దాచేపల్లి బుచ్చయ్య గారు నెలకొల్పారు.50రాత్రి బడులు సెంటర్లు మండలటీం తోడ్పాటుతో దేవరకొండ లోని ఎస్.టి.వర్గాలకోసంమండల గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఆమె కృషి అమోఘం.బాలకార్మికనిర్మూలనకై భ్రూణహత్యలు పై ఆమె రాసిన స్కిట్స్ పాటలు జనాల్లో చైతన్యం తెచ్చాయి.భర్తతోడ్పాటుతో ఇన్ని పనులు చేస్తున్న
సుజాత గారు జాతీయ అంతర్జాతీయ బహుమతులు పొందాలని ఆశిద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కోటి విద్యలు కూటి కొరకే

అత్త ఉన్న కోడలు ఉత్తమురాలు