హేమంత రాగాల పల్లకిలో

3-12-2023 తరుణి సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకులు

హేమంతం ఒక ఋతువు. భూమి తన చుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక కక్ష్యలో పరిభమిస్తుంది. ఈ కక్ష గ్రహణ యానానికి సంబంధించి భూమి అక్షంలో వచ్చే వంపుల , మలుపు ల వల్ల ఋతువులు ఏర్పడతాయి. ఋతువులు ఆరు. మొదటి ఋతువు వసంత ఋతువు. హేమంత ఋతువు నాలుగవ ఋతువు. Early Winter అని, శీతాకాలం అనీ అంటారు. చల్లని గాలులు వీస్తూ ఉంటాయి, Fog అంటే పోగమంచు బాగా ఉంటుంది. ఇది దక్షిణాయనం లో చివరి ఋతువు. ఎండ వేడిమి తీవ్రంగా ఉండదు. When the sun travels towards the south on the celestial spare is called Dakshinayanam.
ఆయనము అంటే కదలిక మూమెంట్. భూమి కదలిక . వసంత, గ్రీష్మ,వర్ష ,శరత్ ఋతువులు ఉత్తరాయణం లోని రుతువులు.
సంవత్సరానికి ఉన్న 12 నెలలలో మార్గశిర పుష్య మాసాలు హేమంత ఋతువు. దాదాపు నవంబర్ 20 ప్రాంతం నుండి జనవరి 20 వరకు వస్తుంది. ఋతువులు వారు అంటాము అవి కాలాలు మూడు. హేమంత ఋతువు ను శీతాకాలం అంటాం.” ఆగామి శిశిరభయంబుచే జమిలి దుప్పటి కప్పుకొనె నేమో ప్రకృతి కాంత” అంటాడు ఒక కవి పుంగవుడు.
చలిని తట్టుకునే ప్రయత్నాలు చేయక తప్పదు. ప్రాణి కోటి మనుగడకు అనుకూలంగా ఉండే ఒకే ఒక్క గ్రహం భూమి. మానవకేంద్రీకృతమైన ఈ సకల జీవకోటిలో 0.01 శాతమే మనుషులు జీవించేది. కానీ ,మొత్తం భూ మండలాన్ని ఆక్రమించింది తెలివితోనే.అందుకే ఈ హేమంత ఋతువులోని, ఈ డిసెంబర్ నెలలోని అందాలు,ఆరోగ్య విషయాలు, ప్రకృతి ధర్మాలు అన్నీ ఒడిసి పట్టుకోగలిగాం. మన చుట్టూ ఉన్న మొత్తం భౌతిక ప్రపంచం అంతా ప్రకృతే. పర్యావరణమైతేనేమి వాతావరణం అయితేనేమి సమస్త వృక్ష జంతు జాల వ్యవస్థ అయితే నేమి మనదైన అవసరాల కొరకు ఉపయోగించుకుంటున్నవే. ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీ అంటే ఏదైతే సానుకూల శక్తి ఉంటుందో అది ఉపయోగించుకుంటున్నారు..
సముద్రాలు ,మైదానాలు ,కొండ కోనలు ,చెట్లు చేమలు ,అడవులు, ఎడారులు అన్నీ మనిషి గుప్పిట్లో ఉన్నాయి ప్రస్తుతం. Survival of the human being అనేది ఒక్కటే ముఖ్య ఉద్దేశమై ప్రకృతిని వంశం చేస్తున్నటువంటి పరిస్థితులు కాస్తా ప్రకృతి ని కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఇవి.
దాదాపు 450 కోట్ల సంవత్సరాల వయస్సు ఉంటుంది భూమికి. ఎప్పుడైతే మనిషి నిప్పును కనుగొన్నాడో, invention of fire అనేది పెను మార్పులు తీసుకువచ్చింది. గుహల నుండి గుమ్మాలకు మారిన తర్వాత మనిషి ఆలోచన మారింది. చలి ఓ లెక్కనా? మండే ఎండలను తట్టుకోవడానికి ఏ సీ లను కనుగొన్న తర్వాత చలి గుప్పెట్లో కి రాదా!
చాలా పశ్చిమ దేశాలలో చలికాలం తీవ్రంగా ఉంటుంది. మంచు కురుస్తుంది. చలికాలంలో మన భారత దేశంలో కాశ్మీర్ కొండ చర్యలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ లో లంబసింగిని అనే ప్రదేశం కూడా ఇలాగే చాలా వరకు చల్లా చల్లగా ఉంటుంది. మంచు కురుస్తూ ఉంటుంది. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉన్నది. ఒక్కోసారి జీరో డిగ్రీ సెంటీగ్రేడ్లకి వాతావరణం పడిపోతుంది. కానీ చక్కని పచ్చని ప్రకృతి పరిసరాలు అందాన్ని ఇనుమడింప చేస్తుంది. ఢిల్లీలో 5 డిగ్రీల కు ఉష్ణోగ్రత లు పడిపోవడం చూస్తుంటాం.

ఎండా కాలానికి వానా కాలానికి మధ్యలో వచ్చేది చలికాలం. ఈ కాలంలో సూర్యుడు భూగోళానికి దూరంగా నూ, అర్థగోళాకృతిలోనూ ఉండడంతో సూర్యప్రతాపం తగ్గి వాతావరణం చల్లగా ఉంటుంది. ఎప్పుడైతే ఉత్తరార్థ గోళంలో చలికాలం ఉంటుందో దక్షిణార్థ గోళంలో ఎండాకాలం ఉంటుంది. శరదృతువుకు వసంత ఋతువుకు మధ్యలో వచ్చే ఋతువు హేమంత ఋతువు. ఈ ఋతువులో ఋతు మధ్య భాగంలో పగలు సమయం తక్కువగా ఉంటుంది రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాలలో గడ్డకట్టి పోయెంత తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇక ధ్రువ ప్రాంతాలలో చెప్పనక్కరలేదు.

పంట కోతల కాలంగా ఈ కాలాన్ని చెప్పుకోవచ్చు .కళ్ళాలలో వరి ధాన్యం బాగా కనిపిస్తుంది. రైతులకు వాళ్ళ ఇంట్లో పంట సిరి వస్తుంది. రైతులు ఆనందంగా ఉంటేనే ప్రజలంతా సంతోషం తో ఉంటారు. ప్రజలు ఆనందంగా ఉంటే దేశం బాగున్నట్టు. ప్రకృతి కి నష్టం కలిగించే పనులు చేయకుంటే, వాతావరణ సమతుల్యత దెబ్బతినకుంటే అంతా సుభిక్షంగా ఉంటుంది.
శీతాకాలం నీహార మనోహరం.
హేమంత రాగాల పల్లకిలో పరుగులు పయనం.
_**_

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంకల్పం

సంధి అంటే?