ఎన్ని కలలో ఎన్నెన్ని “కల”లో
ఎన్నెన్ని కల్పనలో
అవన్నీ” నటనని” తెలుసుకో
ఓ ఓటరు అన్నా!
తల్లివమ్మా చెల్లి వమ్మ
ఇప్పుడు నీవే దేవతవు
తెప్పదాటి నాకా నాయకుడు
రెప్పపాటు కనిపించడు.
టీవీకి సెల్లుకు నీ ఓటు వేస్తే
తిండి గింజల కే కరువస్తది తల్లి
కలకాలం పాడిపంటలు నిలవాలన్నా
నీ ఓటు హక్కు నీవు సద్వినియోగం చేసుకో చెల్లి
వందిస్తే ఏమొస్తది
వేయిస్తే ఏమొత్తది. ఒక్క రోజుకి
గంజి నీళ్లు తాగనీకే
కరువైతది “ఓటు” అమ్ముకుంటే!
దున్నుకొను భూమి ఏది
కొనుక్కోను భూమి ఏది
రేపటి నీ బిడ్డ భవిష్యత్తు
ఆలోచించే బాధ్యత నీది కాదా!
“భూతాలు” మన నేతలు
నీతులు చెబుతారు
కవ్వించి నవ్వుతారు
గెలిచాక నిన్ను ఏడిపిస్తారు.