ఒక ఉషోదయ కిరణం హృదయం లో వెలుగులు విరజిమ్మే అంత అందమైనది కాదు జీవితం అంటే. ఒక పున్నమి వెన్నెల లో హాయిగా విహారం చేసినంత ఆనందమొక్కటే ఉండదు సంసార జీవితమంటే . కష్టసుఖాలు కలబోసి ఉంటాయి. బాధ వెనుక బాంధవ్య మాధుర్యం, సుఖం వెనుక దుఃఖ జాడలూ ఉంటాయి. చేరాల్సిన గమ్యానికి శ్రేణులు దాటిన విజయం లా,ఎక్కిన మెట్లు దిగుతుంటే కలిగే సుఖం లా ఎన్నో భావనలు ఉంటాయి. ఎన్నో ప్రయత్నాలు ఉంటాయి. ఎవరి గద్దెమీదనో అప్పనంగా కూర్చుని రాజ్యమేలినట్టు కాదు. పోరాటాల లో నిలిచి గెలిచిన సింహాసనం లాంటిది జీవితం అంటే . ఈ సంసార సింహాసనానికి రాజూ నువ్వే రాణీ నువ్వే. రెండు పాత్రల మధ్య సయోధ్య లా కుటుంబ పాలన ఉంటుంది. ఉండాలి . సాధించిన హృదయ రాజ్యం మీదైన పాలక రాజ్యం. శృంగార వంతమైన జీవితం. శృంగారం అంటే అందం. శృంగార జీవితం అంటే కష్టాలను అధిగమించిన అద్వితీయత! శృంగారమంటే బాధలను ఈదిన విజయ పరంపర! మంచి చెడుల కలబోత ! పుట్టుక చావుల ఎదురీత! అప్పుడే ఆనందం నీదైనట్టు . అప్పుడే సుఖం వంతమైన జీవితానుభవం నీదైనట్టు !! ఈ సంసార జీవితం ఫలప్రదం కావాలని కొన్ని నియమాలు పెట్టారు పెద్దలు. అవే కొత్త తరానికి కొన్ని సరిపడక పోవచ్చు. ఈ నవ యుగాన దిగాలు లేని కుటుంబ పాలన కు కొన్ని కొత్త హంగులు కొత్త సూత్రాలు సిద్ధం చేసుకోవాలి…
అందుకే ఇలా Family Rules …
Help each other –
భార్యాభర్తలు ఇద్దరు సమానం ఇంటి బండిని లాగడానికి!
సంసార నౌక సాగడానికి!!
ఆర్థిక సంబంధాలే జీవన సంబంధాలైన నేటి కాలానికి అనుగుణంగా అడుగులు పడాల్సిందే. ఇంటాబయటా స్త్రీ పురుషులు ఇద్దరికీ సమానమైన పనులు ఉండాలి. నిత్యావసరాలు తీరాలంటే ఆఫీస్
ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవచ్చు సహాయం చేసుకున్నప్పుడు. ఎంతటి ఆర్థిక భారాన్నైనా హార్థకంగా తీసుకుంటే ఎంతో సులభమైపోతుంది. పే.. ద్ధ … సమస్య చిన్నదైపోతుంది. భార్య సలహాలను భర్త భర్త సలహాలను భార్య తీసుకుంటే ఆర్థిక సంబంధాలే హార్థిక సంబంధాలపై పోతాయి .
‘Share‘ … ఈ ఆర్థిక సంబంధమైన పనుల ఒత్తిడి తగ్గాలంటే ఒకరికొకరు పంచుకోవాలి . సంపాదించిన డబ్బును ఎలా వాడుకోవాలి అనే ప్లానింగ్ చెప్పుకోవాలి. భార్య ఉద్యోగమో , వ్యాపార మో చేసిసంపాదించనంత మాత్రాన ఆమె ఏదో తక్కువ అని అనుకుంటే ఇక అంతకన్న తెలివితక్కువ తనం మరోటి లేదు. ఇది మగవాళ్ళ విషయం లోనూ అంతే భర్త సంపాదించకున్నా ఇంటి పనుల్లో సాయం ” Do your best” చేస్తే బాగుంటుంది. తక్కువ చూపు ఉండదు.
ఈ జీవిత ప్రయాణం లో అనుకోకుండా జరిగే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇద్దరి మధ్య సయోధ్య ఉంటే ఇబ్బందుల. యుద్ధానంతరం అంతా సుఖ సంతోషాలు నిండిపోతాయి.నువ్వెంత ? నీ లెక్కెంత ? అన్నారంటే నేనంత నేనింత అనీ అనలేరు. అర్హత కోల్పోతారు. జీవితం సమరమే కానీ రాగసుధాభరితం కూడా ! రాజ్యాలు పంచుకుపోయే యుద్ధ తంత్రాలక్కరలేదు. అందుకే., ‘Try New Things‘ అని చెప్పడం!!
కాస్త దగ్గరగా తీసుకొని అనునయంగా మాట్లాడుకుంటే వంద సమస్య లూ విరిగిపోతాయి. జీవిత భాగస్వామి అనే మాటకు సార్థకత చేకూరుతుంది.
‘ Bethankful‘ అనేదే లేకుండా పోయింది ఈ మధ్య! ఒకసారి ఎక్కువో ఒకసారి తక్కువో. మొగుడు పెళ్ళాల మధ్య సయోధ్య కుదిరిందా ఎన్ని సమస్యల సుడిగుండాలనైనా దాటేస్తారు. ‘ Show compassion‘
కంపాషన్ అంటే శారీరక మానసిక ఉద్వేగాలను అర్థం చేసుకుని ఒకరకమైన కరుణాత్మక భావంతో మాట్లాడడం, మనసు కు దగ్గరగా మాట్లాడడం అన్నట్టు.లౌకికంగా ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటామని పెళ్లి నాడు ప్రమాణాలు చేసుకుంటారు . ఏ మతమైనా దీనికి దూరం కాదు.
” కొడుకుతో సమానంగా, జాగ్రత్తగా పెంచుకున్న ఈ కన్యను నీకు ఇస్తున్నాను” అని పూర్వం పెద్దలు చెప్పిన మంత్రాల సారాంశం ఇదే!
వైవాహిక జీవితం అంటే కష్టాలను అధిగమించి ముందుకు సాగే ప్రయాణం. కష్టాలంటే? పిల్లలు పుట్టిన తర్వాత వచ్చేవి కాదు గర్భం ధరించిన స్త్రీలు నిత్యం సంతోషంగా ఉండాలి. కానీ శారీరకంగా మార్పు లు వస్తూ ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అవి ఆడవాళ్ళ కే పురుషుల పురుడు సమస్యలు తలెత్తవు. అప్పుడే ఓపికగా ప్రేమగా భార్య ను చూసుకుంటే భార్య కూడా అంతే స్థాయిలో ప్రేమిస్తుంది.
Always Tell The Truth
ఈ విషయం లో భార్య గా నేనే గొప్ప అనడమూ తెలివి తక్కువ తనం అవుతుంది. ఎవరు గొప్ప కాదు. కానీ ఆడవాళ్ళకు కాస్త ఎక్కువ కష్టం అనేది మర్చిపోవద్దు.
ఇక సంసారం లో ‘ నిజం ‘ మాట్లాడుతూ ఉండాలి. పిల్లలు పుట్టిన తర్వాతే సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి . పిల్లలు పుచిటకున్నా కొన్ని సమస్యలు ఉంటాయి. అప్పుడే ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒకరి మనోభావాలను బట్టి మసలు కోవాలి.
Dream Big
ధర్మార్థ కామ మోక్షాలనేవాటిని సాధించుకునేదే సంసార జీవితం.
స్త్రీ పురుష సంబంధాల్లో పెళ్లి అనేది మూడు ముళ్ల బంధం తోనో ఏడడుగులతోనో , మధుపర్కాల జతతోనో, తిలకధారణ తోనో , అంగుళీయకాల మార్పిడి తోనో , నీతోనే నేను నాతోనే నువ్వు అనే ప్రమాణాలతో నో ఏకమయ్యే ఋుజువులే కానీ నిజానికి వీటన్నింటికీ న్యాయం చేయాలని ఉందంటే ప్రతిరోజూ కనీసం విలువలను పాటిస్తేనే సాధ్యం అవుతుంది. సార్థకత చేకూరుతుంది. పెళ్లి వెనకాల ఉన్న సృష్టి రహస్యాలకు విలువ ఇవ్వడంతో నే కుటుంబం నిలుస్తుంది. ఇవే ఫ్యామిలీ రూల్స్!!
కొన్ని కలలు, చిన్న నవ్వులు, మెప్పులు ఎన్నో మనస్సు నొప్పులను పోగొడ్తాయి. వార్మ్ ఫీలింగ్ కలుగుతుంది. ఒకరినొకరు గౌరవించుకోవడం తోనే ఇది సాధ్యం. ప్రతి చిన్న సేవకు ఒకరికొకరు కృతజ్ఞత భావం కలిగినప్పుడు మరింత ఫలవంతకంగా ఉంటుంది. పిల్లలు మన అభివ్యక్తి కి ఉదాహరణ లు. వాళ్ళ రూపురేఖలను ఎట్లా పోల్చుకుంటారో వాళ్ళ గుణగణాలను పోల్చుకుంటారు అందులోనే ఆనందం ఉంటుంది. అనురాగాలు ఆప్యాయత లూ రెండు ప్రతిరోజూ అవసరాలు!!
-_***_