
మాటల్లో మాధుర్యం
చూపుల్లో కారుణ్యం
చేతల్లో నిజాయితీ
ఒక మనిషిలో ఉండాల్సిన కనీస లక్షణాలు.
ఇవి ఉంటేనే మనుషుల మధ్య పెనవేసుకుంటాయి ప్రేమానుబంధాలు.
ఇవే మన కష్ట సుఖాల్లో, కలిమి లేముల్లో
తోడు నీడ, అండ దండ.
ఎంత పేరు సంపాదించినా, ఎంత డబ్బు గడించినా లభించని తృప్తి, ఆనందం
నీ చుట్టూ ప్రేమానుబంధాలు
కలిగినమనుషులుంటేనే
అవి అవుతాయి నిబిడీకృతం.
అప్పుడే మనిషి జన్మ సార్థకం