పూర్తి పేరు. డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ
జన్మస్థలం. మహబూబాబాద్
తల్లిదండ్రులు. తాళ్లపల్లి అబ్బమ్మ అబ్బయ్య
నివాస స్థలం. మహబూబాబాద్ గుమ్మడూరు బజారు.
వృత్తి. ఉపాధ్యాయురాలు .
యాకమ్మ నాన్న యాకమ్మ చిన్నతనంలో దొర గారికి జీతం ఉన్నారు అది ఒక రకంగా వెట్టి చాకిరీ లాంటిది. కొంతకాలం తర్వాత జీతం మానేసి వ్యవసాయ కూలీ పనులకు బావులు తవ్వడానికి ఇంకా ఏ పని దొరికితే ఆ పనికి వెళ్లేవాడు.యాకమ్మ తల్లి కూలి పనులతో పాటు కల్లాల దగ్గర లేకి చేసేది పరిగె ఏరి ఆ తెచ్చిన వడ్లను దంచి పిల్లలకు వరి అన్నం పెట్టి వాళ్లు జొన్న గటక తాగే వాళ్ళు. అలా యాకమ్మను పెంచి పోషించి చదివించారు.
విద్యాభ్యాసం. ఒకటవ తరగతి నుండి ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు మహబూబాబాద్ లోని చదువు. ఇంటర్ చదువుతున్నప్పుడే వివాహం జరిగింది.
డిగ్రీ ఉమెన్స్ కాలేజ్ ఖమ్మం.
ఎం .ఏ తెలుగు – కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్.
ఎం.ఏ. సంస్కృతం – కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్.
టి పి టి- బిఈడి కాలేజ్ హనుమకొండ.
ఎం. ఫీల్ – మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం తమిళనాడు .
పీహెచ్డీ – ద్రావిడ విశ్వవిద్యాలయం కుప్పం. – గైడ్ గా ఆచార్య గారు కాకతీయ విశ్వవిద్యాలయం.
యు జి సి నెట్.
ఏపీ సెట్.
వృత్తి వివరాలు – 2001 డిఎస్సి, మొదటి నియామకం తెలుగు పండిట్ గా జడ్పీహెచ్ఎస్ కాంపల్లి కురవి మండలంలో 2002 చేరారు యాకమ్మ. 2009 నుండి 2018 వరకు జడ్పీహెచ్ఎస్ కురవిలో పనిచేశారు , 2018 ఆగస్టు నుండి జడ్పీహెచ్ఎస్ పెనుగొండ కేసముద్రం మండలంలో ప్రస్తుతం పనిచేస్తున్నారు. ప్రస్తుత హోదా తెలుగు పండిట్ .
భర్త పేరు – సోమారపు వీరస్వామి సామాజిక కార్యకర్తగా పనిచేస్తారు. వారి సొంత గ్రామం పురుషోత్తమాయగూడెం మరిపెడ మండలం మహబూబాద్ జిల్లా. ప్రస్తుత నివాసం – మహబూబాబాద్. 1996లో వివాహం జరిగింది పెళ్లి తర్వాత యాకమ్మ భర్త సహకారంతో ఉన్నత విద్యలు అభ్యసించారు.
పిల్లలు – గాయత్రి ఎంబిబిఎస్ హౌస్ సర్జన్ కాకతీయ మెడికల్ కాలేజ్.
కుమారుడు కళ్యాణ్ కుమార్ – బీటెక్ ఫస్టియర్
సాహితీ ప్రస్థానం. – యాకమ్మకు ఎంపీలు పిహెచ్డి పరిశోధనలో భాగంగా బోయ జంగయ్య గారి సాహిత్యం తో పాటు ఇతర సాహితీవేత్తల పుస్తకాలు చదవడంతో సాహిత్యం పై మరింత మక్కువ పెరిగింది. పరిశోధన సిద్ధాంత గ్రంథాలు రాసి ఎంపీ పిహెచ్డి పట్టాలు పొందిన తర్వాత యాకమ్మ గురువుగారు ఆచార్య బన్న ఐలయ్య కాకతీయ విశ్వవిద్యాలయం గారు” నువ్వు వచనం బాగా రాస్తున్నావమ్మా కథలు చక్కగా రాయగలవు” అని యాకమ్మ ను ప్రోత్సహించారు. దానితో కథలతో పాటు కవిత్వం కూడా రాయడం మొదలు పెట్టారు. అంతే కాకుండా యాకమ్మ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తున్న తరుణంలో ‘ నగర గీతం’ అలిశెట్టి ప్రభాకర్ గారి కవితను విద్యార్థులకు బోధిస్తూనే తాను ఎంతో తన్మయత్వం చెందుతూ కవిత్వం అంటే కేవలం వర్ణనలు మాత్రమే కాదు బతుకు చిత్రన కూడా అని అర్థం చేసుకున్నారు. అందుకే సామాజిక అంశాలు దళిత జీవిత బాధలు గాధలు కవిత్వంగా రాయడం మొదలుపెట్టారు. 2014 నుండి కవితలు కథలు రాస్తున్నారు. యాకమ్మ సాహితీ ప్రయాణానికి ప్రేరణ యాకమ్మ గురువుగారు ఆచార్యబన్న ఐలయ్య గారు. మరియు అక్షర యాన్ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీ లక్ష్మీ గారు చాలా కార్యక్రమాలలో యాకమ్మకు అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తున్నారు.
ఉద్యోగరీత్యా సాహిత్య పరంగా యాకమ్మ కైవసం చేసుకున్న కీర్తి పురస్కారాలు :
1. మదర్ ఫౌండేషన్ వారి సేవ రత్న జాతీయ అవార్డు 2017.
2. కాలగమనం కథకు అక్షరాలతో వ ఖమ్మం వారి జాతీయస్థాయి ద్వితీయ బహుమతి 2017.
3. అక్షరాలతో వ ఖమ్మం వారి అక్షర శిఖరం మరియు బహుమతి కవితలకు జాతీయస్థాయి ఉత్తమ కవితా పురస్కారాలు 2018.
4. విశాల సాహిత్య అకాడమీ వారి బిఎస్ రాములు ప్రతిభా పురస్కారం 2019.
5. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2019.
6. కెరటం నవలకు అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ వరంగల్ వారి ప్రధమనవల ద్వితీయ బహుమతి 2019.
7. మమతల మల్లెలు కథా సంపుటికి డాక్టర్ పుట్ల హేమలత స్మారక పురస్కారం 2021.
8. గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా గెలుపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో బోయ జంగయ్య సాహిత్యానుశీలన పిహెచ్డి పరిశోధన గ్రంథానికి గాను సాహితీసేవ పురస్కారం 2021.
9. మాతృభాషా దినోత్సవం సందర్భంగా అక్షర యాన్ ఆధ్వర్యంలో సాహితీ రత్న పురస్కారం 2021.
10. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ వారిచే ఉత్తమ రచయిత అవార్డు మార్చి 4, 2022.
11. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబా జిల్లా కలెక్టర్ శ్రీ శశాంక గారి ఆధ్వర్యంలో ఎంపీ మాలోతు కవిత గారి చేతులమీదుగా ఉత్తమ రచయిత్రి అవార్డు మార్చి 8, 2022.
12. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక గారి ఆధ్వర్యంలో శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి చేతుల మీదుగా ఉత్తమ కవిత పురస్కారం జూన్ 2, 2022.
13. కాకతీయ సప్తాహం సందర్భంగా ఉత్తమ కవితా పురస్కారం జూన్ 8, 2022.
14. పలుగుల భూమారెడ్డి స్మారక ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం జూలై 24, 2022.
15. బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ కవి సమ్మేళనంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఉత్తమ కవితా పురస్కారం 2022.
16. నందివాడ రత్నశ్రీ స్మారక పురస్కారం జనవరి 6, 2023.
17. రక్షణ కథల సంపుటికి పర్సా సైదులు స్మారక పురస్కారం 2023.
ముద్రిత పుస్తకాలు:
1. బోయ జంగయ్య సాహిత్యం పిహెచ్డి సిద్ధాంత గ్రంథం 2017.
2. మమతల మల్లెలు కథల సంపుటి 2018.
3. జగడం ఒక పరిశీలన ఎంపీలు సిద్ధాంత గ్రంథం 2019.
4. కెరటం దళిత నవల 2020.
5. రక్షణ కథల సంపుటి 2020.
6. మట్టి బంధం కవితా సంపుటి 2021.
7. సమాజ హిత శతకం 2021 8.దుఃఖ నది కరోనా కథలు 2022.
ఉద్యోగరీత్యా ఉపాధ్యాయురాలు కావడంతో యాకమ్మ తరగతి గదిలో తన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలలోని పాఠాలతోపాటు బతుకు పాఠాలను కూడా నేర్పిస్తూ సమాజంలోని మంచి పౌరులుగా ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకునే విధంగా విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు.