తన పేరు -తొందరపాటు.

కథ

 

తాటికోల పద్మావతి

విశాఖ బీచ్ చాలా సందడిగా ఉంది. వేసవి సెలవులు కావడంతో యువతి యువకులు పిల్లలు పెద్దలంతా వేసవి తాపాన్ని తీర్చుకోవడానికి వచ్చారు. ఉవ్వెత్తున ఎగిసిపడే అలల్ని ఢీకొడుతూ వాటికి ఎదురెళ్లి వాటితో పాటు సమానంగా ఎగరటానికి ప్రయత్నిస్తున్నారు.
కెరటాలు ఎంత వేగంగా వస్తున్నాయో అంత నెమ్మదిగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాయి. నీళ్లలో గంతులేసి అలసిపోయి చీకటి పడే వరకు సరదాలు తీర్చుకొని సముద్రానికి బాయ్ చెప్పి బయలుదేరారు.
అప్పటిదాకా కోలాహలంగా సందడిగా ఉన్న సముద్రతీరం బోసిపోయినట్లయింది. చీకటి చాటున సముద్రుడు గంభీరంగా ఘోషిస్తున్నాడు.
ఇదే మంచి సమయం! అందరూ వెళ్లిపోయారు చీకటి పడింది ఎవరు నన్ను చూడరు. తెల్లవారితే నేను ఇంట్లో కనిపించలేదని అంతా ఏడుస్తారు. నాలుగు రోజులు పోతే ఆ దుఃఖాన్ని మర్చిపోతారు. ఇలాంటి కొడుకుని కన్నందుకు అమ్మానాన్న బాధపడతారు. నేను బ్రతికుండీ వాళ్ళని బాధపడటం చేయటం కన్నా చచ్చిపోవటమే మంచిది. వచ్చేస్తున్నాను నన్ని భూమ్మీద నుంచి నీటిలో కలిపేసుకోమంటూ సముద్రంలోకి దూకేశాడు గోపినాథ్.
నీళ్లలో పది గజాల దూరం వెళ్లి దేవుడికి రెండు చేతులెత్తి నమస్కరించాడు. నేల మీద కాలు ఆడటం లేదు. ఊపిరి అందడం లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే మంచి జీవితాన్ని ప్రసాదించమని కోరుకున్నాడు.
తెల్లవారి కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పటల్లో బెడ్ పైన ఉన్నాడు హాస్పటల్లో బెడ్ పైన ఉన్నాడు. తన ఎదురుగా పోలీస్ కానిస్టేబుల్ నిలబడ్డాడు. తాగిన నీరు అంతా కక్కించి ప్రాణాపాయం నుంచి బయటపడేశారు డాక్టర్లు.
అంకుల్ నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అడిగాడు పోలీస్ కానిస్టేబుల్ ని.
ఏం చచ్చి పోదాం అనుకుంటున్నావా! అంత తప్పు నువ్వేం చేసావు? మీ అమ్మానాన్నలు నువ్వు కనిపించలేదని ఎంత బాధ పడుతున్నారో తెలుసా నీకు. రాత్రంతా ఇంటికి వెళ్లలేదని ఎంత కంగారుపడి ఉంటారు. ముందు వెంటనే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వు వాళ్లకి తెలియపరుస్తాను నువ్వు క్షేమంగా ఉన్నట్లు. వాళ్లు వచ్చి నిన్ను ఇంటికి తీసుకువెళ్తారు అన్నాడు పోలీస్ కానిస్టేబుల్.
గోపినాథ్ కి భయం వేసింది. తన ఎందుకు చచ్చిపోవాలనుకున్నాడో నిజం తెలిస్తే ఈ పోలీస్ అంకుల్ నన్ను వదిలిపెట్టడు. నిజాన్ని బయటికి లాగుతాడు చెప్పకూడదు అనుకున్నాడు.
నువ్వెందుకు చచ్చిపోవాలనుకున్నావో చెప్తావా! ఏమైనా తప్పు చేశావా? నిజం చెప్పు. లేకపోతే నీతో పాటు మీ తల్లిదండ్రులని కూడా అరెస్టు చేయాల్సి వస్తుంది అన్నాడు కఠినంగానే.
గోపినాథ్ కి నిజం చెప్పడం ఇష్టం లేదు.
ముందు మీ వాళ్లకి ఫోన్ చెయ్యి అంటూ గోపీనాథ్ చేత తన ఫోన్లో నుంచి కాల్ చేయించాడు కానిస్టేబుల్.
మీ అబ్బాయి నా దగ్గర క్షేమంగా ఉన్నాడు. మీరు హాస్పిటల్ కి వస్తే వివరాలన్నీ చెప్తానన్నాడు.
గోపీనాథ్ తండ్రి కంగారు పడ్డాడు. కొడుకు ఏమైందో నాని తల్లిదండ్రులు ఇద్దరు హాస్పిటల్ కి పరిగెత్తుకుని వచ్చారు.
ఎందుకురా ఇంత పని చేశావు అంటూ గోపినాథ్ తండ్రి కోపంతో ఊగిపోయాడు.
చూడండి జనార్ధన్ గారు! పిల్లల్ని ప్రేమగా చూడాలి గానీ వాళ్ల మీద ఎప్పుడు విసుగు రాకూడదు. మీరు చిన్నప్పటి నుంచి క్రమశిక్షణగా పెంచలేదు కాబట్టే మీ అబ్బాయి ఇలాంటి పని చేశాడు.
ఇంతకీ ఏం జరిగింది నిజం చెప్పించారా!
పోలీస్ కానిస్టేబుల్ మీకు వచ్చిన భయం ఏమీ లేదు నిజం చెప్పు. కాపాడే బాధ్యత నాది అని భరోసా ఇచ్చాక గోపీనాథ్ నోరు విప్పాడు.
నేను కాలేజీలో చేరాక ఖర్చులకోసం నాన్నని డబ్బులు అడగాల్సి వచ్చింది. ఎప్పుడు చూసినా చదువుకో చదువుకో అంటాడు కానీ సరదాగా నాన్న వెంట నన్ను బయటికి తీసుకువెళ్ళడు. చిన్నప్పటి నుంచి మంచిర్యాంకు తెచ్చుకుంటేనే చదివిస్తాను. లేకపోతే ఏదైనా పనికి పెడతానని బెదిరించేవాడు. మంచి డ్రెస్సులు కొనమంటే ఉన్న వాటితో సరిపెట్టుకోమంటాడు. మా ఫ్రెండ్స్ అంతా పార్కులు పిక్ నికులకు వెళ్తుంటే నన్ను మాత్రం పంపడు. ఎప్పుడు చూసినా చదువు గొడవే. నన్ను పరాయి వాడిగానే చూస్తాడు. చదువు తప్ప మరో ప్రపంచ జ్ఞానం తెలియకుండా చేశాడు. కాలేజీలో నాకు ఇష్టమైన గ్రూపు తీసుకోవడానికి వీలు లేదని తనకి నచ్చిన గ్రూపు నే తీసుకోవాలన్నాడు.‌ నాకు నచ్చిన చదువుకునే స్వాతంత్రం కూడా లేదు. అందుకే పాకెట్ మనీ కోసం నాకు తెలియకుండానే నేను ఒక ప్రమాదంలో చిక్కుకున్నాను.
ప్రమాదమా? ఏంటది.
పాకెట్ మనీ కోసం ఆశపడి ఈ పని చేశాను. నేను కాలేజీ నుంచి వస్తుంటే ఒక అంకుల్ ఎదురుపడి ఒక కవర్ ఇచ్చి ఎదురుగా ఉన్న షాపులో ఇచ్చి రమ్మన్నాడు. అలా చేసినందుకు 500 నోటు ఇచ్చాడు. ఇదేదో బాగుందనిపించింది. ఆ కవర్లో ఏముందో నాకు తెలియదు. ప్రతిరోజు ఇలాగే చేస్తే రోజు డబ్బు ఇస్తానని ఆశపెట్టాడు. తర్వాత తెలిసింది ఆ ప్యాకెట్ లో ఉన్నది గంజాయి అని.
కానిస్టేబుల్ తో పాటు గోపీనాథ్ తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారు.
అంటే నువ్వు గంజాయి సరఫరా చేస్తున్నావా?
అది గంజాయిని నాకు తెలియదు. వాళ్లు రహస్యంగా మాట్లాడుకుంటుంటే విన్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా ఇలాగే చేసేవాడు. వాడు నిజం తెలుసుకొని ఈ పని చెయ్యను అని చెప్పినందుకు చిత్రహంసలు పెట్టి కొట్టారుట. పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించారు. అందుకే నాకు చాలా భయం వేసింది. ఎవరికీ చెప్పుకోలేక నాకు నేనే‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను అన్నాడు గోపినాథ్ భయంగా.
ఈ విషయంలో నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది డ్రగ్స్ అని నీకు తెలియకపోవచ్చు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే. పోలీసులు నిన్ను విచారించక మానరు.మేము వాళ్ళ ఆచూకీ తీసి వాళ్ళ రహస్య స్థావరాలను కనిపెడతాం. నువ్వు ఇక ధైర్యంగా ఉండవచ్చు. అవసరమైతే మాకు ఫోన్ చెయ్యి వాళ్ళ వివరాలు చెప్పడానికి నిన్ను పిలిపించినప్పుడు రావడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియటం లేదు. మా అబ్బాయిని ప్రాణాలతో రక్షించి మాకు అప్పగించారు. నేను వాడిని అలా బాధ పెట్టాలని ప్రవర్తించలేదు. మంచి చదువు చదువుకుంటే సుఖపడతాడని ఆశించాను. వాడు గొప్ప వాడైతే చూసి సంతోషించేది మేమే కదా. అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ పోతే ఎక్కడ చెడు అలవాట్లకు బానిస అవుతాడు అని భయం పట్టుకుంది. ఆ భయం ఇప్పుడు నిజమైంది. మాలాంటి తల్లిదండ్రులు బిడ్డలు బాగుపడాలని కోరుకుంటారు. చెడిపోవాలని ఎవరు అనుకోరు. మేము చేసిన మంచి పనే మాకు ఎదురు తిరిగింది. ఆ సమయంలో మీరు చూసి ఉండకపోతే పెద్ద ఘోరం జరిగిపోయేది అంటూ బాధపడ్డారు.
నేను ఇలా చెప్తున్నానని మీరు ఏమీ అనుకోకండి. చదువుకునే పిల్లల్ని తండ్రి ఒక స్నేహితుడిలా చూడాలి. వాళ్లకు నచ్చిన కోర్సునే వాళ్ళు ఎంచుకోవాలి. చదువుకోనే కష్టం వాళ్లకే తెలుస్తుంది. ఇప్పుడు చూశారుగా బాధపడి ఏం ప్రయోజనం. పిల్లల్ని చదువు విషయంలో గానీ పెళ్లి విషయంలో గానీ బలవంతం చేయకూడదు. అది పెద్దవాళ్లకే మంచిది కాదు. గోపీనాథ్ నువ్వు ఇక మీ ఇంటికి వెళ్ళవచ్చు అంటూ కానిస్టేబుల్ గోపినాథ్ని తల్లిదండ్రుల వెంట ఇంటికి పంపించాడు.
కాలేజీలో చేరిన యువకులు చదువుకునే వయసులో ఇలాంటి దురలవాట్లకు బానిసలు అయితే అది వాళ్ళ జీవితానికి మోసం. వాళ్లు వేసే ప్రతి అడుగు రహదారి కావాలి. తప్పటడుగులు వేయకూడదు. ఒకసారి తప్పటడుగు వేస్తే సరిదిద్దుకోవడం చాలా కష్టం.
డబ్బు కోసం ఆశపడి ఇలాంటి ముఠాలతో చేయి కలిపితే జీవితాలే నాశనమవుతాయి ఇంకెప్పుడు ఇలాంటి పని చేయవద్దని హెచ్చరించారు.
ఈ విషయం కాలేజీ అంతా తెలిసిపోయింది. పోలీసు నిఘా పెట్టి డ్రగ్స్ పంపిణీ చేసే ముఠాను పట్టుకొని అరెస్టు చేసింది. అందులో చిక్కుకున్న యువకులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రతి విద్యార్థి వేసే అడుగు అది తప్పక రాదు.
గోపీనాథ్ ప్రమాదం నుంచి బయటపడినందుకు తల్లిదండ్రులు సంతోషించారు. పిల్లల పట్ల ఎలా ప్రవర్తించాలో కళ్ళు తెరిపించినందుకు ఇది ఒక ఉదాహరణ.
తన పేరు -తొందరపాటు.
రచన-తాటి కోల పద్మావతి. గుంటూరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

గరళకంఠుడు