చీడ పురుగు

కథ

“ప్లీజ్ !అర్పణా!ఈ ఒక్క సహాయం చేసి పెట్టు ప్లీజ్ !ప్లీజ్ !”అంది సంయుక్త స్నేహితురాలు  అర్పణ ను బ్రతిమాలుతూ.
సహాయం అంటే ఎలా ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? నువ్వు అడుగుతున్న సహాయంలో సహాయం ఎలా చేయాలో నాకు అర్థం కావడం లేదు.” అంది అర్పణ .
“ఎలా సహాయం చేయాలో నేను చెబుతాను కదా !నేను చెప్పినట్లు ఫాలో అయితే సరిపోతుంది. కానీ ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాలి సుమా అంది.” సంయుక్త .
“అలానే సంయుక్తా!నీ బాధ నాకు అర్థమైంది నీకు పెళ్లి ప్రపోజల్స్ ప్రారంభమయ్యాయని ఒక వ్యక్తితో పెళ్లిచూపులు జరిగాయని అతని పేరు కృష్ణ శరత్ అనీ,మీ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని వచ్చే నెలలో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి తేదీ నిర్ణయం కూడా జరుగుతుందని నాకు తెలుసు ఇవన్నీ నువ్వే చెప్పావు కానీ ఈ విషయంలో నా సహాయం ఎలా కావాలో అర్థం కావడం లేదు .”అంది అర్పణ.
“చూడు అర్పణా!పెళ్లి అంటే నూరేళ్లపంట దానిని నూరేళ్ల మంటగా నేను మార్చుకోలేను వివాహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయని అంటూ ఉంటారు వివాహాలు నరకంలో నిర్ణయించబడేలా మారకూడదు. అని నా అభిప్రాయం కుటుంబంలో ఒక వివాహం జరిగినప్పుడు ఆ కుటుంబ సభ్యులు వారి బంధువులు ఆనంద సాగరంలో మునిగిపోవాలి కానీ పంచాయతీలు పెట్టుకునే స్థాయికి దిగజారి దాంపత్య విలువలు దిగజార్చే ప్రయత్నం చేయకూడదు.” అంది సంయుక్త “నువ్వు చెప్పింది కరెక్టే సంయుక్తా! నీ పెళ్లి విషయంలో నన్ను ఏమి చేయమంటావు? అర్థం కాక అడిగింది అర్పణ .
“ఒకప్పుడు అయితే వివాహాలు నిశ్చయించేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు ఎంక్వయిరీ చేసేవారట ఇప్పటి వారికి అంత తీరిక ఓపిక లేవు కాబట్టి ఏమీ చూడకుండా ఒక్క జీవిత భాగస్వామి గురించి మాత్రమే తెలుసుకుంటున్నారు అదీ అంతంత మాత్రమే ఆ తెలుసుకున్నది కూడా కొన్నిసార్లు ఫేక్ న్యూస్ .”కచ్చితంగా అంది సంయుక్త.
నిజమే సంయుక్తా!జీవిత భాగస్వామి గురించి పూర్తిగా ముందే తెలుసుకోవాలి లేకుంటే జీవితం నరకప్రాయం అవుతుంది ఇంతకు నీకు కాబోయే భర్త కృష్ణ శరత్ గురించి అన్ని వివరాలు తెలిసాయా?” అంటూ ప్రశ్నించింది అర్పణ.
” అమ్మానాన్న తెలుసుకున్న దానిని బట్టి కృష్ణ శరత్ పీజీ చదివిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అతనికి ఈ సంవత్సరమే ఉద్యోగం వచ్చింది అతను క్రమశిక్షణ గల వ్యక్తి అనీ చెడు అలవాట్లు ఏమీ లేవని అటువంటి వ్యక్తి ఈ రోజుల్లో ఎవరూ ఉండరని తెలిసింది. దానితో అమ్మానాన్న నిశ్చితార్థం కూడా జరిపించేసారు పై నెలలో పెళ్లి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.” అంది సంయుక్త .
“మీరు తెలుసుకున్న విషయాలన్నీ నిజమే అయి ఉంటుంది సంయుక్తా!” అంది అర్పణ.
” కావచ్చు కాకపోవచ్చు కూడా అంది.” సంయుక్త .
ఇంతకూ అతని గురించిన ఇన్ఫర్మేషన్ ఎవరు సేకరించారు? వారు మీకు నమ్మకస్తులేనా?” అడిగింది అర్పణ.
అర్పణ ప్రశ్నకు ఉత్సాహంగా సమాధానం చెప్పింది సంయుక్త .
“కొంత ఇన్ఫర్మేషన్ నాన్నగారు కొంత ఇన్ఫర్మేషన్ అమ్మ మరికొంత ఇన్ఫర్మేషన్ అన్నయ్య ఆ తర్వాత బంధువులు కూడా సేకరించారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా చాలా కష్టపడి సేకరించారు.” ఆనందంగా చెప్పింది సంయుక్త
మరి ఇంకా నేను సహాయం చేసేదేముంది ప్రశ్నించింది అర్పణ .
“అతనిది మీ ఊరే ఏలూరు. అందుకే నిన్ను సహాయం అడుగుతున్నాను నువ్వు నా స్నేహితురాలివి ఆ మాత్రం సహాయం చేయలేవా? రిక్వెస్ట్ చేసింది సంయుక్త ..
“సహాయం ఏ పద్ధతిలో చేయాలని అడుగుతున్నాను .”అంది అర్పణ .
అర్పణ చెవిలో తన ప్లాన్ అంతా వివరించింది సంయుక్త .
తల్లి బిందు కి వినపడకుండా జాగ్రత్త పడింది.
అర్పణ చిరునవ్వు నవ్వింది .
ఆ మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం ఉదయం సంయుక్త అర్పణ ఏలూరు బయలుదేరారు అర్పణ “నా బర్త్ డే సందర్భంగా నువ్వు మా ఇంటికి రావడం మంచిదయింది నీతో అయితే అమ్మ ఎక్కడికైనా పంపిస్తుంది .అమ్మను అడగగానే నిరభ్యంతరంగా  వెళ్లి రా అమ్మ అంది .”అన్నది సంయుక్త .
“అంటే కృష్ణ శరత్ ఏలూరులోనే వర్క్ చేస్తూ రూమ్ తీసుకొని ఉంటున్నాడు అన్నమాట నువ్వు చెప్పిన అడ్రస్ ప్రకారం ఆ ఏరియా నాకు తెలుసు నువ్వు వేసిన పథకం ప్రకారమే ఎంక్వైరీ చేద్దాం.” సహకరిస్తూ అంది అర్పణ. “ఓకే థాంక్యూ !”అంది సంయుక్త
సంయుక్త సేకరించిన వివరాల సహాయంతో అర్పణ సంయుక్త నేరుగా కృష్ణ శరత్ రూమ్ కి వెళ్లారు .
తీరా చూస్తే రెండు రోజుల క్రితమే కృష్ణ శరత్ రూమ్ మారి వేరే రూమ్ కి మారినట్లు తెలిసింది .
చుట్టుప్రక్కల వారే సమాచారం అందించారు “ఇంతకూ ఆ కృష్ణ శరత్ నీకేమవుతాడు?” చిరాగ్గా అడిగాడు అక్కడున్న ఒక వ్యక్తి.
“కృష్ణ శరత్ మా అన్నయ్య” అంది అర్పణ తడుము కోకుండా .
“అన్నయ్య అంటున్నావు అతను రూమ్ మారిన విషయం కూడా నీకు తెలీదా ?”అంటూ అడిగాడు ఆ వ్యక్తి .
“అన్నయ్య వారం రోజులుగా అమ్మ మీద నాన్న మీద నా మీద అలిగాడు అందుకే తెలియలేదు తెలుసుకోవడానికి ఇలా వచ్చాను .”అల వోకగా చెప్పేసింది అర్పణ .
సంయుక్త అర్పణ వైపు ఆశ్చర్యంగా చూసింది “ఆ .అలాగా!” అన్నాడు ఆ వ్యక్తి .
సరిగ్గా అదే సమయంలో అక్కడికి మరొక వ్యక్తి వచ్చి నిలుచున్నాడు వెంటనే మొదటి వ్యక్తి రెస్పాండ్ అయ్యాడు
“అమ్మా!మీ అన్నయ్య ఖాళీ చేసిన రూమ్ ఓనర్ ఈయనే .”అంటూ రెండవ వ్యక్తిని పరిచయం చేశాడు మొదటి వ్యక్తి .
“సార్ !మా అన్నయ్య కృష్ణ శరత్ రూమ్ మారి ఎటువైపు వెళ్ళాడో తెలుసునా?” అభ్యర్థించింది అర్పణ .
అంతే అతను కోపోద్రిక్తుడైపోయాడు .
అతని సమాధానం వినిపించాడు .
“వాడు ఉత్త ఫూల్ .చదువుకొని ఉద్యోగం చేస్తున్నాడే కానీ వాడికి అన్ని అలవాట్లు ఉన్నాయి లేని అలవాటు అనేది లేదు వాడి చెడు అలవాట్లతో ఇల్లంతా గందరగోళం చేసేసాడు తాగినప్పుడు వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియడం లేదు.” అంటూ గట్టిగా అరిచాడు ఆ రెండవ వ్యక్తి.
కృష్ణ శరత్ పాత ఓనర్ .
“సార్! ఇప్పుడు ఏ ఇంట్లోకి మారాడో కాస్త చెప్పగలుగుతారా ?”భయం భయంగా అడిగింది అర్పణ .
ప్రక్క వీధిలో రెండో ఇంట్లోకి మారాడు చిరాగ్గా చెప్పాడు పాత వోనర్ .
వెంటనే సంయుక్త అర్పణ అతను చెప్పిన అడ్రస్ కి వెళ్లారు అక్కడ చిన్న సైజు యుద్ధ వాతావరణం నెలకొని ఉంది కాస్త దూరం నుండి ఒక చెట్టు చాటుగా నిలుచుని సంయుక్త అర్పణ గమనించ సాగారు కృష్ణ శరత్ బాగా డ్రింక్ చేసి ఉన్నాడేమో గట్టిగా అరుస్తున్నాడు అలా అరుస్తూనే ప్రక్కనున్న స్నేహితుడితో ఏవేవో మాట్లాడుతున్నాడు ఆ మాటల మధ్య సంయుక్త పేరు కూడా వినబడటంతో  సంయుక్త అర్పణ చెవులు రెక్కించి వినసాగారు
” అవునూ! సంయుక్త తో నీ  పెళ్లట కదా నీ ప్రేయసి సంధ్యను ఏం చేస్తావ్ .” కృష్ణ శరత్ స్నేహితుడు వ్యంగ్యంగా అడుగుతున్నాడు.
” చాల్లే ఊరుకోరా !సంధ్యపాత్ర సంధ్య పోషిస్తుంది సంయుక్త పాత్ర సంయుక్త పోషిస్తుంది ముందు ఆ కట్నం డబ్బు నా అకౌంట్ లో పడనీ”అంటూ  వికాటహాసం చేశాడు కృష్ణ శరత్ .
ఒక్కసారిగా షాక్ తిన్నారు సంయుక్త అర్పణ.
“అర్పణామన ఎంక్వయిరీ పూర్తయింది ఇక బయలుదేరు .”అంటూ బయలుదేర తీసింది సంయుక్త .
ఇద్దరూ అక్కడి నుండి నిష్క్రమించారు ఆ మరుసటి రోజు పెళ్లి తేదీ నిర్ణయించుకోవడానికి ముందుగా సంయుక్త తల్లిదండ్రులు ప్రశాంతంగా బాల్కనీలో కూర్చుని అదే ఆలోచనలో ఉన్నారు.
సరిగ్గా అదే సమయానికి సంయుక్త అక్కడికి వచ్చింది .
“అమ్మా సంయుక్తా నీ పెళ్లి విషయములో అన్నీ విజయవంతంగా జరుగుతున్నాయి ఇక పెళ్లి తేది నిర్ణయించడం మిగిలింది. మనకు ఏ తేదీ అనుకూలమో ముందుగా ఆలోచించుకుందాం అన్నాడు .:సంయుక్త తండ్రి గౌరీనాథ్ తల్లి బిందు కూడా భర్తను సపోర్ట్ చేస్తూ మాట్లాడింది .
“వచ్చే నెల రెండవ వారంలో అయితే బాగుంటుందేమో “అంది బిందు .
సరిగ్గా అదే సందర్భాన్ని ఉపయోగించుకుంది సంయుక్త
:పెళ్లి తేదీ నిర్ణయించుకోవడానికి మనం ఆలోచిస్తున్నాము కృష్ణ శరత్ అనే వ్యక్తి ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నాడు ఆఫీసర్ హోదాలో ఉన్నాడు అతని గురించి ఎంక్వయిరీ చేసి మంచివాడుగా నిర్ధారించుకొని ఎంగేజ్మెంట్ కూడా జరిపించుకొన్నాం. అతని గురించి ఎంక్వైరీ చేసిన వారిలో మమ్మీ డాడీ బంధువులు కూడా ఉన్నారు. అతని గురించి మంచి రిపోర్టు రావడంతో పెళ్లి తేదీ వరకు వచ్చేసాము కానీ అతనిని వివాహం చేసుకునేది నేను జీవితం నాది అందువలన నేను స్వయంగా వెళ్లి అతని గురించి ఎంక్వయిరీ చేసుకున్నాను దానికోసం నా స్నేహితురాలు అర్పణ నాకు సహాయం చేసింది .”అంటూ ఆగింది సంయుక్త .
“అలాగా అతని గురించి ఏం తెలిసింది?” తల్లి తండ్రి ఇద్దరు ఆసక్తిగా అడిగారు.
సంయుక్త తను స్వయంగా సేకరించిన విషయాలు తల్లిదండ్రుల ముందుంచింది .
“ఆ కృష్ణ శరత్ అనే వ్యక్తి చాలా చెడ్డవాడు అతనికి లేని చెడు అలవాటు అనేది లేదు అన్నీ చెడు లక్షణాలు అతనికి ఉన్నాయి అతనిది చాలా భయంకరమైన క్యారెక్టర్ ఒక్కమాటలో చెప్పాలంటే అతడు సమాజానికి చీడపురుగు అటువంటి చీడపురుగు నా అమూల్యమైన జీవితాన్ని తొలిచేసేవాడు. ప్రమాదం తప్పింది నా జీవితాన్ని వాడి నుండి కాపాడుకున్నాను .”అంటూ తను ,అర్పణ తీసిన వీడియోలను రికార్డు చేసిన ఆడియోను వారి దృష్టికి తీసుకు వెళ్ళింది.
వాటిని చూసి సంయుక్త తల్లిదండ్రులు షాక్ తిన్నారు తమ కూతురు స్వయంగా తన జీవితాన్నికాపాడుకున్న తీరుని వారు అభినందించారు .
“అమ్మా!సంయుక్తానిజంగానే వాడు చీడపురుగు .నువ్వు స్వయంగా ఎంక్వయిరీ చేసుకుని ఉండకపోతే నీ పవిత్రమైన విలువైన జీవితాన్ని తొలిచేసేవాడు .”అన్నాడు గౌరీనాథ్.
తల్లి బిందు కూతురిని మనస్ఫూర్తిగా అభినందించింది .
“అమ్మా సంయుక్తా!నీకు పెళ్లి చేయాలనే తొందరలో మేము ఆ కృష్ణ శరత్ పై ఎంక్వైరీ నామమాత్రంగా చేసి అయిందనిపించుకున్నాము చదువు ఉన్నతమే ఉద్యోగము ఉన్నతమే కానీ గుణం ఉన్నతమో కాదో పూర్తిగా తెలుసుకోలేకపోయాము నీ జీవితం విలువైనదని తెలియక ఆ చీడపురుగు నీ జీవితాన్ని తొలుచుకుంటూ వెళ్లిపోయేవా
డు నేటి సమాజంలో ఎంత మంది అమ్మాయిలు సరైన ఎంక్వయిరీ లేక ఇటువంటి చీడపురుగుల బారిన పడుతున్నారో!” అంటూ తన మనసులోని భావాలను బయట పెట్టింది బిందు .
సరిగ్గా అప్పుడే కాంతులు వెదజల్లుతూ ఓ మిణుగురు పురుగు వారి మధ్య నుండి వెళ్ళింది.

Written by G. Mary Kripa bai

G.mary krupa bai
20/585-3 Lakshmanarao puram
Chilakalapudi p.o
Machilipatnam- '521003
Krishna Dt
AP
cell.9989347374

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఏడ్పు ఎందుకు?

భారతీయ ఋషి పరంపర