ఆలోచన

       రాధికాసూరి

ఆలోచనాకోణాల్ని బట్టి ప్రాధమ్యాలు ప్రామాణీకరించబడతాయి. నీకు అత్యవసరమని తోచింది ఎదుటివారికి అప్రధాన కారకం కావచ్చేమో! అందిపుచ్చుకోవాలనే ఆరాటంలో ఒక్కోసారి విలువలకు తిలోదకాలు ఇవ్వబడతాయి. ఆలోచనల్లో విచక్షణ కొరవడితే వ్యక్తిత్వం అధః పాతాళానికి జారిపోతుంది. ఆచరణకు నోచని ఆలోచనలు రంగు మారిన తైలవర్ణ చిత్రాలౌతాయి,
ఆలోచనల ‘వడిగుర్రాని ‘కి కళ్లెం వేయకపోతే  అదుపుతప్పి అగాధంలో పడేస్తుంది మితిమీరిన ఆలోచనలు భ్రాంతి చట్రంలో బందీలై ‘ పద్మ వ్యూహంలో చిక్కిన అభిమన్యు ‘న్ని తలపిస్తాయి ఆలోచనల అమ్ముల పొది నుండి ఆశయాల అస్త్రాలను సంధించాలి విజ్ఞతతో కూడిన ఆలోచనలకు విజయపథం ఎర్రతివాచీపరుస్తుంది 

Written by Radhika suri

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వంట

పరాన్న భుక్కులు