“బతుకమ్మ పండుగ

బతుకమ్మ పండుగ సందర్భంగా

వై,అరుంధతి

తెలంగాణా రాష్ట్రం లోఅతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ.
తెలంగాణ స్త్రీల ఆచార, సాంప్రదాయలతో, ఆనందోత్సాహాలతో, వెల్లివిరిసే పండుగ బతుకమ్మ పండుగ.

స్త్రీల సౌభాగ్య ప్రదాయిని యైన గౌరీదేవీ యే బతుకమ్మ. మహిషాసుర మర్ధిని, భీకర స్వరూపిణియైన దేవిని నవరాత్రుల సమయంలో తెలంగాణ అతివలు సుకుమారమైన, అందమైన పూల రూపంలో ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగ నాటికి ప్రక్రృతి అంతాపూలతోశోభాయ మానంగా ఉంటుంది.

అడవుల్లో, చేలల్లోతంగేడు గునుగు, ముత్యాలపూలతో ప్రకృతి నయనానందకరంగా
ఉంటుంది. చెరువులన్నీ నిండుగాకలకలాడుతూ వుంటాయి.

మహాలయా అమవాస్యనాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభించి, మహర్నవమి వరకు తొమ్మిది రోజులు
ఎంతో ఘనంగా ఆడుతారు.

ఈమహాలయా అమవాస్యకు ముందువచ్చే ఏకాదశి రోజు ఎర్రమట్టితో బొడ్డెమ్మను చేసి దానిపై వెంపలికొమ్మను పెట్టి,
పసుపు,కుంకుమవేసి,పూలతో అలంకరించి బాలికలంతా దాని చుట్టూ చప్పట్లతో తిరుగతూ ఆడి,అమవాస్యరోజు, మొదటి
బతుకమ్మతో పాటు నీటిలో విడిచిపెడతారు.

మొదటి ఎనిమిది రోజులు బతుకమ్మనుచిన్నగాపేరుస్తారు, తొమ్మదోరోజుసద్దులబతుకమ్మను చాలాపెద్దగా పేరుస్తారు.

తెల్లవారుజామునముత్తైదువలు అభ్యంగన స్నానం చేసి  అలికి ముగ్గేసిన లోగిల్లలో,  సేకరించిన పూలన్నీ చాపపై
సమకూర్చుకుని, ఇత్తడిపళ్ళెంలోమొదటగుమ్మడి ఆకులను పరిచి దానిపై తంగేడుపూలను,గునుగుపూలను,చామంతి, కట్ల, గన్నేరు, బంతి, ముత్యాల,మందార మొదలయిన ,రకరకాల, రంగు రంగుల పూలను వరుసగా పేరుస్తూ ఎంతో అందంగా తీర్చి దిద్దుతారు. ఈ పెద్దబతుకమ్మ (తల్లి బతుకమ్మ)పక్కన,చిన్న
బతుకమ్మ(పిల్లబతుకమ్మ)ను చేసి పెడుతారు.

ఈబతుకమ్మలను,దేవునిదగ్గర పీటపై పెట్టి, నువ్వులు,శనగపప్పు,బెల్లంతో కలిపిచేసిన సద్దులతో, పులిహోర, మలీదలను నైవేద్యంగా సమర్పిస్తారు.

ఈతొమ్మిది రోజుల బతుకమ్మ లను  మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ అని,

రెండవ రోజు అటుకులబతుకమ్మ,

మూడవ రోజు ముద్దపప్పుబతుకమ్మ

నాల్గవ రోజు నానబియ్యం బతుకమ్మ,

అయిదవ రోజు అట్ల బతుకమ్మ

ఆరవరోజు అలిగిన బతుకమ్మ

ఏడవరోజువేపకాయల బతుకమ్మ ,

ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ,

తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ .

ఈతొమ్మిది రోజులూ తొమ్మిది రకాల నైవేద్యాలను అర్పిస్తారు.

స్త్రీ సంతాన ప్రదాయిని, సంతానం వల్లనే జీవితం సార్ధకమవుతుందని భావిస్తుంది.

బతుకమ్మ పండుగ లో తల్లి బతుకమ్మ పక్కన పిల్ల బతుకమ్మ ను వుంచటంలోని
ఆంతర్యం,తల్లి పక్కన పిల్లను ఉంచటం మాతృహృదయానికి ప్రతీక గావిదితమవుతుంది

ఉదయం బతుకమ్మను పేర్చిన ముతైదువులు సాయంకాలం
సాంప్రదాయ దస్తులు ధరించి,  అలంకరించుకొని,ఇంటిముందు
బతుకమ్మ ను ఆడిన తర్వాత ఊరిమధ్యలోకి కానీ చెరువు దగ్గరికి గానీ బతుకమ్మను
తీసుకవెల్లి,దానిచుట్టూ చిన్నా,పెద్దాతేడాలేకుండా మహిళలందరూ చప్పట్లతో
తిరుగుతూ పాటలు పాడుతూ చీకటి పడేవరకూ ఆడి బతుకమ్మను చెరువులో
విడిచి పెడతారు. బతుకమ్మలన్నీనీటిలోతేలుతూ
ప్రవాహంలో కదిలే దృశ్యం కమనీయం.

ఔషద గుణాలున్న ఈపూలన్నీ నీటిలో కలువడం వల్ల ప్రజల కెంతో మేలు జరుగుతుంది. బతుకమ్మ కు వీడుకోలు
పాటలు పాడి సాగ నంపి, వెంటతెచ్చుకున్న పసుపు గౌరమ్మను ముత్తైదువలందరూ పెట్టుకొని, సద్దినైవేద్యాలు
వొకరికొకరు వాయినా లిచ్చుకుని తిని ,ఇల్లకు చేరు కుంటారు. స్త్రీలందరూ ఇలా కులాలకతీతంగా కలిసికట్టుగా ఆడటం సద్దులు పంచుకుని తినటం సమైక్యతకు నిదర్శనం.

బతుకమ్మ చరిత్ర

దాదాపు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈబతుకమ్మపండుగకు ఎన్నో కథలు, ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని.

పూర్వం ఒక దంపతులకు పిల్లలు పుట్టినట్టే పుట్టి, వెంటనే చనిపోయేవారు, దీనితో ఆ దంపతులు పిల్లల కోసం పార్వతీదేవిని ప్రార్థించారు. ఆమె కరుణతో వారికొక ఆడపిల్ల పుట్టింది.అక్కడి కొచ్చిన మునులందరు ఆమెకు బతుకమ్మ అని నామకరణం చేస్తారు.

మరో కథ-
శివుని తలపైపెట్టుకున్నగంగను చూసి,అసూయచెందినపార్వతిదేవి, గంగమ్మనే అందరూ పూజిస్తున్నారని,తన తల్లితో
చెప్పుతుంది. అపుడు తల్లి పార్వతీదేవిని  ఓదార్చి, గంగమ్మ మీద నిన్ను పూలతెప్పలా తేలించి, పూజించేలా చేస్తానని మాట
ఇచ్చింది.అదే నేడు ,పూల బతుకమ్మ పండుగ గా మారింది.

“మరో కథ”-
పూర్వం ధర్మాంగుడు,సత్యవతీఅనే రాజదంపతులువుండేవారు. వారికీ వందమంది సంతానం. యుధ్ధానికి వెళ్ళి,ఆవంద
మందీ మరణిస్తారు.ఆ తల్లిదండ్రులుఎంతోబాధపడి,తమకున్న సంపదనంతా  దానం చేసి అడవిలో కెళ్ళి తపస్సు చేసుకుంటుంటారు. అపుడు లక్మీదేవి ప్రసన్నురాలై, ప్రత్యక్షమవుతుంది. ఏం వరంకావాలో కోరుకోమంటుంది.
మేము పిల్లల కోసం వచ్చాము.

నువ్వే మా కడుపున పుట్టాలని, కోరుకుంటారు.వారి కోరిక మన్నించి లక్ష్మీ దేవి వారి గర్భాన జన్మిస్తుంది. ఆమె
కలకాలం బ్రతకాలని, బతుకమ్మ అని పేరు పెడతారు. అందుకే బతుకమ్మ అంటే, లక్ష్మీదేవి స్వరూపము.

బతుకమ్మ పెరిగి పెద్దయ్యాక విష్ణుమూర్తి,చిత్రాంగుడు అనే రాజు రూపం లో వచ్చి ,బతుకమ్మ ను పెళ్ళాడుతాడు.

అలా బతుకమ్మను పేర్చిన ఇల్లు ,సకల సౌభాగ్యాలతో ,అష్టైశ్వర్యాలతో తుల తూగుతుందని నమ్మకం.

Written by Y. Arundhati

Y.ARUNDHATI.
NIZAMABAD.
8639617444

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

డాక్టర్ కొండపల్లి నీహారిణి వ్యక్తిత్వ చిత్రణ నేటి తరానికో అవసరం!

నేను కవయిత్రినైనందుకు కాబోలు