వ్యాకరణం – జీవన వ్యాపారం

5వ వారం

           కామేశ్వరి ఉగిరాల

కొత్తగా ఆలోచించాలి. అప్పుడే జీవితం మాధుర్య భరితం అవుతుంది. ఈ విషయాన్ని కవయిత్రి ,రచయిత్రి ,తెలుగు ఉపాధ్యాయురాలు కామేశ్వరి ఓగిరాల గారు తెలుగు వ్యాకరణం లోని అక్షర మాల నుండి అచ్చులు హల్లులు , వర్గాక్షరాలు, సంధులు సమాసాలు అలంకారాలు ఛందస్సు వంటివి నిత్య జీవితానికి అన్వయం చేస్తూ చక్కగా క్లుప్తంగా రాస్తున్నారు. సీరియల్ గా వచ్చే ఈ విశేషాలను చదివి ఆనందించండి.
– డాక్టర్ కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

మిత్రులారా! గత నాలుగు వారాలుగా వ్యాకరణానికి మనుష్యులస్వభావాల కు గల పోలికల గురించి సంబంధం గురించి పరిశీలిస్తు న్నాము. జీవితం లో ఎన్నో రకాల స్వభావం కలవా ళ్లు మనకు తారస పడుతుంటారు. ఈ వారం మరీ కొన్ని స్వభావాల తో మీ ముందుకు వచ్చాను.
పోయిన వారం స్థిర స్వభావం గురించి చూసాము. కానీ కొంత మంది ఎంత స్థిరం గా ఉండాలని ప్రయత్నించినా ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా తల వంచక తప్పదు.
ఉదాహరణ: విసర్గ: సంధి మనకు 5రకాలుగా గోచరిస్తుందిచూడండి
విసర్గ. ‘ ఓ ‘ గా మార వలసి వస్తుంది
తప:+ధనుడు. తపోధనుడు.
అదే విసర్గమరో సారి రే ఫ గా మారుతోంది
అంత:+ఆత్మ. అంతరాత్మ
అదే విసర్గ ఇంకో సారి ‘ ష ‘ గా మార వలసి వస్తుంది
విసర్గకు శ, ష, స లు పరమైతే మాత్రం శ ష స లను తోడు తెచ్చు కుంటాయి.మన:+శాంతి మన శ్శా o తి
కొన్ని సార్లు మాత్రమే విసర్గతన అస్తి త్వాన్ని నిలిపుకుంటుంది.
అలాగే మనుష్యులు కూడా ముఖ్యంగా. స్త్రీలు తల వంచకతప్పటం లేదు.
అలాగే ‘ ము ‘ వర్ణం కూడా పడ్వాదులు పరమగు నప్పుడు ‘ ము ‘ తన అస్తి త్వాన్నీ కోల్పోతున్న ది
భయము+ పడు. భయ పడు

అదే ‘ ము ‘ వర్ణం లు ల న లు పరమగు నప్పుడు
తాను లోపిస్తూ కనీసం ముందు అక్షరానికి దీర్ఘాన్ని అయినా ప్రసాదిస్తుంది.

మరి కొన్ని అంశాలతో వచ్చే వారం మీ ముందుంటా ను.

Written by Kameshwari Ogirala

పేరు :కామేశ్వరి ఓగిరాల
ఊరు :భువనగిరి
ఇండియా
చదువు :ఎం ఎ తెలుగు
ఉద్యోగం :తెలుగు ఉపాధ్యాయురాలు (ప్రైవేట్ స్కూల్ )
చరవాణి 8008296355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమెరికాలో బామ్మ

అపాయంలో ఉపాయం కథ