
ముందుగా తరుణ్ పాఠకులకు శ్రోతలకు నమస్కారములు పోయిన వారం నరసింహ శతకంలోని ఒక పద్యం చూసాం. ఇప్పుడు మరొక పద్యం చూడండి
అవనిలో గల యాత్రలన్నీ చేయ గ వచ్చు
ముఖ్యమౌ నదులందు మునుగవచ్చు
ముక్కు పట్టుకు సంధ్య మొనసి వార్చగ వచ్చు
తిన్నగా జపమాల త్రిప్ప వచ్చు
వేదాల కర్దంబు విరిచి చెప్పగ వచ్చు
శ్రేష్ఠ యాగములె ల్ల చేయగ వచ్చు
ధనము లక్షల కోట్లు దాన మీయగవచ్చు
నై స్టికాచారముల్ నడుప వచ్చు
చిత్త మన్య స్థలంబులన్ జేర కుండ
నీ పదాంబో జములందు నిలుప గలమే
భూషణ వికాస శ్రీ ధర్మ పురి నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర
ఇప్పుడు భావం చూడండి
భూమి మీద గల యాత్రలు చేయ వచ్చు. ముఖ్య మైన నదులలో స్నానం చేయ వచ్చు. ముక్కు పట్టుకొని సంధ్య వార్చ వచ్చు. జప మాల త్రిప్పి వచ్చు. వేదాల అర్థాలన్ని చెప్ప వచ్చు. గొప్పవైన యాగాలు చేయ వచ్చు. లక్షలు కోట్లు దానం చేయ వచ్చు. నియమ నిష్ఠతో అచారాలన్నీ పాటించ వచ్చు కానీ మనసు వేరే వాటి మీదకు వెళ్లకుండా నీపా దాల యందు నిలుపరాదు