సహ్యాద్రివాసా శ్రీదత్తా!

సహ్యాద్రివాసా శ్రీదత్తా! త్రిమూర్తిరూపా జయదత్తా!!

నీపదదాసులు మేమయ్యా! అభయమునీయగ రావయ్యా!!

సృష్టికి మూలము ప్రణవమనీ – దైవబీజమోంకారమనీ నిరూపించగ

వచ్చినవాడవు – వరమునిచ్చిన అత్రితనయుడవు!

బ్రహ్మ అంశను కలిగినవాడవు – జపతపంబులజ్ఞానమిచ్చెదవు

భక్తులబ్రోచే విష్ణువు నీవు – ఇహపరములమము సంరక్షింపుమ!

రుద్రాత్మకుడవు నీవుకదా – వాంఛితార్థములనివ్వు సదా

కల్పవృక్షమే నీడనీయగ – కామధేనువే వెంటనుండెగ!

గంగయందున జలకమాడెదవొ – కొల్లాపురమున భిక్షనందెదవో

పర్వతశ్రేణుల సంచరించెదవో – స్మరించినంతనే చెంతనిలువుమా!

అనసూయాత్మజ పరబ్రహ్మవు – కరుణనిండినా అనఘుడవూ

సద్గురుమూర్తివి దత్తదిగంబర దయామూర్తిపై అనుగ్రహింపుమ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఒడిపిళ్ళు

మీనాక్షి చిత్రాలు